రియల్మీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. రియల్మీ 6ఐ రిలీజ్ అయింది. ఇప్పటికే రియల్మీ 6 సిరీస్‌లో రియల్మీ 6, రియల్మీ 6 ప్రో మోడల్స్ ఇండియాలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అదే సిరీస్‌లో రియల్మీ 6ఐ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది కంపెనీ. గతంలోనే మియన్మార్ మార్కెట్లోనే రియల్మీ 6ఐ రిలీజ్ అయింది. కానీ ఆ మోడల్ కాకుండా యూరప్ మార్కెట్లో రిలీజైన రియల్మీ 6ఎస్ రీబ్రాండెడ్ వర్షన్‌ను ఇండియాలో రియల్మీ 6ఐ పేరుతో రిలీజ్ చేసింది రియల్మీ. ఇండియాలో బడ్జెట్ సెగ్మెంట్లో ఈ ఫోన్ రిలీజైంది. ప్రారంభ ధర రూ.12,999. మీడియాటెక్ హీలియో జీ90టీ ప్రాసెసర్, క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. కానీ బాక్సులో 20వాట్ ఛార్జర్ మాత్రమే వస్తుంది. 30వాట్ ఛార్జర్ వేరుగా కొనాల్సి ఉంటుంది.
OnePlus Nord: వన్‌ప్లస్ నార్డ్ ధర చూసి షాకయ్యారా? ఫోన్ ప్రత్యేకతలివే...
Samsung Galaxy A21s: గుడ్ న్యూస్... సాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్ ధర తగ్గింది
రియల్మీ 6ఐ స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ, 1,080x2,400 పిక్సెల్స్
ర్యామ్: 4జీబీ, 6జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ90టీ
రియర్ కెమెరా: 48+8+2+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,300 ఎంఏహెచ్ (30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10+రియల్మీ యూఐ
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ నానో సిమ్
కలర్స్: ఎక్లిప్స్ బ్లాక్, లూనార్ వైట్
ధర:
4జీబీ+64జీబీ- రూ.12,999
6జీబీ+64జీబీ- రూ.14,999
జూలై 31 మధ్యాహ్నం 12 గంటలకు రియల్మీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో రియల్మీ 6ఐ స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం కానుంది.