హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Realme 6 Series: రియల్‌మీ 6, రియల్‌మీ 6 ప్రో, రియల్‌మీ బ్యాండ్ రిలీజ్... ధర ఎంతంటే

Realme 6 Series: రియల్‌మీ 6, రియల్‌మీ 6 ప్రో, రియల్‌మీ బ్యాండ్ రిలీజ్... ధర ఎంతంటే

Realme 6 Series: రియల్‌మీ 6, రియల్‌మీ 6 ప్రో, రియల్‌మీ బ్యాండ్ రిలీజ్... ధర ఎంతంటే
(image: Realme India)

Realme 6 Series: రియల్‌మీ 6, రియల్‌మీ 6 ప్రో, రియల్‌మీ బ్యాండ్ రిలీజ్... ధర ఎంతంటే (image: Realme India)

Realme 6 Series | రియల్‌మీ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్స్, ఓ ఫిట్‌నెస్ బ్యాండ్ రిలీజ్ అయ్యాయి. రియల్‌మీ 6, రియల్‌మీ 6 ప్రో, రియల్‌మీ బ్యాండ్ ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

  రియల్‌మీ నుంచి రెండు స్మార్ట్‌ఫోన్లు, ఫిట్‌నెస్ బ్యాండ్ రిలీజ్ అయ్యాయి. రియల్‌మీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రియల్‌మీ 6 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయి. ఈ సిరీస్‌లో రియల్‌మీ 6, రియల్‌మీ 6 ప్రో మోడల్స్‌ని పరిచయం చేసింది కంపెనీ. ఆన్‌గ్రౌండ్ ఈవెంట్‌ని రద్దు చేసిన రియల్‌మీ... లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కొత్త ప్రొడక్ట్స్‌ని ఆవిష్కరించింది. ఒకేసారి ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో ఈ ప్రొడక్ట్స్‌ని రిలీజ్ చేసింది. రియల్‌మీ 5 ప్రో అప్‌గ్రేడ్ వర్షన్‌గా రియల్‌మీ 6 ఫోన్‌ను ప్రకటిస్తే, రియల్‌మీ 6 ప్రో మోడల్‌ను కొత్తగా ఆవిష్కరించింది కంపెనీ. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 90Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే, ఫోన్ వెనుకవైపు కాకుండా సైడ్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 30 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్లున్నాయి. రియల్‌మీ 6 ప్రారంభ ధర రూ.12,999. సేల్ మార్చి 11 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. రియల్‌మీ 6 ప్రో ప్రారంభ ధర రూ.16,999. సేల్ మార్చి 13 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొనేవారికి రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది.

  Realme 6 price, Realme 6 sale, Realme 6 Pro specifications, Realme 6 Pro price, Realme Band specs, Realme Band price, రియల్‌మీ 6 ధర, రియల్‌మీ 6 ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ 6 ప్రో ఫీచర్స్, రియల్‌మీ 6 ధర, రియల్‌మీ బ్యాండ్ ధర
  రియల్‌మీ 6

  రియల్‌మీ 6 స్పెసిఫికేషన్స్

  డిస్‌ప్లే: 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+

  ర్యామ్: 4జీబీ, 6జీబీ, 8జీబీ

  ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ

  ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ90టీ

  రియర్ కెమెరా: 64+8+2+2 మెగాపిక్సెల్

  ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్

  బ్యాటరీ: 4,300 ఎంఏహెచ్

  ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10+రియల్‌మీ యూఐ

  సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్+మైక్రో ఎస్డీ స్లాట్

  కలర్స్: కోమెట్ బ్లూ, కోమెట్ వైట్

  ధర:

  4జీబీ+64జీబీ- రూ.12,999

  6జీబీ+128జీబీ- రూ.14,999

  8జీబీ+128జీబీ- రూ.15,999

  Realme 6 price, Realme 6 sale, Realme 6 Pro specifications, Realme 6 Pro price, Realme Band specs, Realme Band price, రియల్‌మీ 6 ధర, రియల్‌మీ 6 ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ 6 ప్రో ఫీచర్స్, రియల్‌మీ 6 ధర, రియల్‌మీ బ్యాండ్ ధర
  రియల్‌మీ 6 ప్రో

  రియల్‌మీ 6 ప్రో స్పెసిఫికేషన్స్

  డిస్‌ప్లే: 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+

  ర్యామ్: 6జీబీ, 8జీబీ

  ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ

  ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీ

  రియర్ కెమెరా: 64+8+12 మెగాపిక్సెల్+ మైక్రో కెమెరా

  ఫ్రంట్ కెమెరా: 16+8 మెగాపిక్సెల్ డ్యూయెల్ హోల్ పంచ్

  బ్యాటరీ: 4,300 ఎంఏహెచ్

  ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10+రియల్‌మీ యూఐ

  సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్+మైక్రో ఎస్డీ స్లాట్

  కలర్స్: లైటెనింగ్ బ్లూ, లైటెనింగ్ ఆరెంజ్

  ధర:

  6జీబీ+64జీబీ- రూ.16,999

  6జీబీ+128జీబీ- రూ.17,999

  8జీబీ+128జీబీ- రూ.18,999

  Realme 6 price, Realme 6 sale, Realme 6 Pro specifications, Realme 6 Pro price, Realme Band specs, Realme Band price, రియల్‌మీ 6 ధర, రియల్‌మీ 6 ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ 6 ప్రో ఫీచర్స్, రియల్‌మీ 6 ధర, రియల్‌మీ బ్యాండ్ ధర
  రియల్‌మీ బ్యాండ్

  రియల్‌మీ 6 సిరీస్ స్మార్ట్‌ఫోన్లతో పాటు రియల్‌మీ బ్యాండ్‌ని కూడా పరిచయం చేసింది కంపెనీ. 2.4 సెంటీమీటర్ల కలర్ స్క్రీన్, 5 డయల్ ఫేస్‌లు ఉంటాయి. క్రికెట్ మోడ్‌తో కలిపి 9 స్పోర్ట్స్ మోడ్స్ ఉండటం విశేషం. హార్ట్ రేట్ సెన్సార్, స్లీప్ మానిటరింగ్ సపోర్ట్, స్మార్ట్ నోటిఫికేషన్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. రియల్‌మీ బ్యాండ్ ధర రూ.1,499. అమెజాన్, Realme.com వెబ్‌సైట్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో కూడా కొనొచ్చు.

  ఇవి కూడా చదవండి:

  Pension Scheme: ఈ స్కీమ్‌తో నెలకు రూ.19,000 పెన్షన్ పొందండి ఇలా

  IRCTC Ramayana Yatra: హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ రామాయణ యాత్ర... మార్చి 27న ప్రారంభం

  Arogya Sanjeevani: ఏప్రిల్ 1న ఆరోగ్య సంజీవని ప్రారంభం... లాభాలు ఇవే

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Fitness, Realme, Realme UI, Smartphone, Smartphones, Technology

  ఉత్తమ కథలు