REALME 5S VS REDMI NOTE 8 KNOW WHICH IS BEST OPTION UNDER RS 10000 SS
Realme 5s VS Redmi Note 8: రూ.10,000 లోపు ఈ రెండు ఫోన్లల్లో ఏది బెస్ట్?
Realme 5s VS Redmi Note 8: రూ.10,000 లోపు ఈ రెండు ఫోన్లల్లో ఏది బెస్ట్?
Realme 5s VS Redmi Note 8 | డిజైన్ విషయం చూస్తే రియల్మీ 5ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో ముందువైపు గొరిల్లా గ్లాస్ 3+ ప్రొటెక్షన్ ఉంటే రెడ్మీ నోట్ 8 మోడల్లో ముందు, వెనుక గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. రెండు ఫోన్లు స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్‌తో పనిచేస్తాయి.
స్మార్ట్‌ఫోన్ కంపెనీలు పోటాపోటీగా మోడల్స్ రిలీజ్ చేస్తున్నాయి. ప్రతీ కంపెనీ నెలలో ఒకట్రెండు కొత్త ఫోన్లను తీసుకొస్తున్నాయి. ఇటీవల రియల్మీ 5ఎస్ రిలీజైంది. కొద్ది రోజుల క్రితం షావోమీ పరిచయం చేసిన రెడ్మీ నోట్ 8 మోడల్‌కు గట్టిపోటీ ఇస్తుందని అంచనా. ఈ రెండు ఫోన్ల స్పెసిఫికేషన్స్ మాత్రమే కాదు... ధర కూడా ఒకేలా ఉండటంతో కాంపిటీషన్ చాలా టఫ్‌గా ఉంది. మరి రెడ్మీ నోట్ 8, రియల్మీ 5ఎస్ స్పెసిఫికేషన్స్ ఏంటీ? వాటి మధ్య తేడాలేంటీ? ఈ రెండు ఫోన్లల్లో ఏది బెస్ట్? తెలుసుకోండి.
డిజైన్ విషయం చూస్తే రియల్మీ 5ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో ముందువైపు గొరిల్లా గ్లాస్ 3+ ప్రొటెక్షన్ ఉంటే రెడ్మీ నోట్ 8 మోడల్లో ముందు, వెనుక గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. రెండు ఫోన్లు స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. రెడ్మీ నోట్ 8 ఫుల్హెచ్డీ+ డిస్ప్లే తో వస్తే, రియల్మీ 5ఎస్ హెచ్డీ+ డిస్ప్లేతో వస్తుంది. కెమెరా స్పెసిఫికేషన్స్ కూడా రెండింట్లో ఒకేలా ఉన్నాయి. అయితే రెడ్మీ నోట్ 8 ఫోన్లో ఫోటోలు బాగా వస్తున్నాయని టెక్ రివ్యూయర్ల అభిప్రాయం. రియల్మీ 5ఎస్‌లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటే, రెడ్మీ నోట్ 8 స్మార్ట్‌ఫోన్‌లో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. రెడ్మీ నోట్ 8 కొంటే 18వాట్ ఫాస్ట్ ఛార్జర్ బాక్స్‌లో లభిస్తుంది. రియల్మీ 5ఎస్‌లో 10వాట్ ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. స్పెసిఫికేషన్స్ చూస్తే రెండు ఫోన్ల మధ్య గట్టి పోటీనే ఉంది. బ్యాటరీ విషయంలో రియల్మీ 5ఎస్ పైచేయి సాధిస్తే, డిస్ప్లే, కెమెరా క్వాలిటీ విషయంలో రెడ్మీ నోట్ 8 ముందుంది. కాబట్టి ఫోన్ కొనేముందు మీ అవసరాలకు తగ్గ ఫోన్ ఎంచుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.