హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Realme AC: రియల్‌మి కొత్త ఏసీలు.. ధర తక్కువ, ఫీచర్లు అదుర్స్.. 20 నిమిషాల్లో రూమ్ కూల్!

Realme AC: రియల్‌మి కొత్త ఏసీలు.. ధర తక్కువ, ఫీచర్లు అదుర్స్.. 20 నిమిషాల్లో రూమ్ కూల్!

Air Conditioner | మీరు కొత్తగా ఏసీ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. ఎందుకంటే మీకు కొత్త ఏసీలు అందుబాటులోకి వచ్చాయి. రియల్‌మి కంపెనీ కొత్త ఏసీలు లాంచ్ చేసింది.

Air Conditioner | మీరు కొత్తగా ఏసీ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. ఎందుకంటే మీకు కొత్త ఏసీలు అందుబాటులోకి వచ్చాయి. రియల్‌మి కంపెనీ కొత్త ఏసీలు లాంచ్ చేసింది.

Air Conditioner | మీరు కొత్తగా ఏసీ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. ఎందుకంటే మీకు కొత్త ఏసీలు అందుబాటులోకి వచ్చాయి. రియల్‌మి కంపెనీ కొత్త ఏసీలు లాంచ్ చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

AC | రియల్‌మి టెక్‌లైఫ్ తాజాగా కొత్త ఏసీ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఎండా కాలం ముందే కంపెనీ కొత్త ఏసీని తీసుకురావడం గమనార్హం. ఇది 4 ఇన్ 1 కన్వర్టబుల్ ఇన్వర్టర్ ఎయిర్ కండీషనర్. దీని ధర తక్కువగానే ఉంది. అలాగే ఫీచర్లు అదిరిపోయాయి. కొత్తగా ఏసీ (AC) కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీతో ఈ రియల్‌మి (Realme) ఏసీలు తయారు అయ్యాయి.

రియల్‌మి టెక్‌లైఫ్ బ్రాండ్ వివిధ రకాల హోమ్ అప్లయెన్సెస్‌ను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్‌గా 4 ఇన్ 1 ఏసీని తీసుకువచ్చింది. ఈ ఏసీ రెండు వేరియంట్ల రూపంలో అందుబాటులో ఉంది. 1 టన్ను, 1.5 టన్ను ఆప్షన్లలో ఇది లభిస్తోంది. ఏసీలలో రాపిడ్ కూలింగ్ ఫీచర్ ఉంది. అంటే ఎయిర్‌ఫ్లో ఎక్కువగా ఉంటుంది. కేవలం 20 నిమిషాల్లో రూమ్ కూల్ అవుతుందని కంపెనీ పేర్కొంటోంది.

ఒక్కసారి చార్జ్ చేస్తే 120 కి.మి వెళ్లొచ్చు, కిలోమీటర్‌కు 7 పైసలు ఖర్చు.. మతిపోగొడుతున్న కొత్త ఇబైక్స్!

రూమ్‌లో ఎంత మంది ఉన్నారనే అంశం ప్రాతిపదికన కూడా ఏసీ స్పీడ్ మారుతుంది. అలాగే ఈ ఏసీలో ఫ్లెక్సీ కంట్రోల్ టెక్నాలజీ ఉంది. ఇంకా ఈ కొత్త ఏసీ ఎనర్జీ ఎఫిసియేంట్ కూడా. అంటే తక్కువ విద్యుత్‌ను ఉపయోగించుకుంటుంది. అలాగే ఈ ఏసీలో ఇన్వర్టర్ టెక్నాలజీ కూడా ఉంది. కంప్రెసర్ దీర్ఘకాలం మన్నికకు వచ్చేలా ఈ టెక్నాలజీ పని చేస్తుంది. రియల్‌మి ఇండియా సీఈవో, వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేత్ ప్రకారం చూస్తే 4 ఇన్ 1 కన్వర్టబుల్ ఇన్వర్టర్ ఫ్లెక్సి కంట్రోల్ ఎయిర్ కండీషనర్లు కస్టమర్లకు అనువుగా ఉంటాయని, సులభంగానే వీటిని ఆపరేట్ చేయొచ్చని, ఇంకా అధిక మన్నిక వీటి సొంతం అని తెలిపారు.

మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్‌ఫోన్ .. ధర రూ.5 వేల కన్నా తక్కువే!

ఈ ఏసీ ధర రూ. 28,499 నుంచి ప్రారంభం అవుతోంది. 1 టన్ను ఏసీకి ఈ రేటు వర్తిస్తుంది. అలాగే 1.5 టన్ను ఏసీ విషయానికి వస్తే.. దీని రేటు రూ. 33,999గా ఉంది. ఈ రెండు ఏసీలు దిగ్గజ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల మీరు కొత్త ఏసీ కొనుగోలు చేయాలని భావిస్తే.. ఈ కొత్త ఏసీలను ఒకసారి పరిశీలించొచ్చు. ఎందుకంటే ఎండా కాలం వస్తే.. ఏసీలు, కూలర్ల, ఫ్రిజ్‌ల ధరలు కొండెక్కి కూర్చుంటాయి. అందువల్ల మీరు వీటిల్లో ఏదైనా కొనాలని భావిస్తే.. ఇప్పుడు కొనుగోలు చేయడం ఉత్తమం. డబ్బులు ఆదా చేసుకోవచ్చు. అలాగే రిపబ్లిక్ డే ఆఫర్లు ఏమైనా ఉండొచ్చు. వీటిల్లో తక్కువ ధరకే ప్రొడక్టులు లభించే ఛాన్స్ ఉంది.

First published:

Tags: Ac, Air conditioners, Flipkart, Realme

ఉత్తమ కథలు