Realme 3i: గుడ్ న్యూస్... జూలై 15న రియల్‌మీ 3ఐ రిలీజ్

Realme 3i | రియల్‌మీ 3 స్మార్ట్‌ఫోన్ లాగా రియల్‌మీ 3ఐలో కూడా డ్యూ డ్రాప్ డిస్‌ప్లే ఉంటుందని టీజర్ చూస్తే తెలుస్తుంది. రియల్‌మీ 3 లైటర్ వర్షన్ రియల్‌మీ 3ఐ కావచ్చని భావిస్తున్నారు.

news18-telugu
Updated: July 9, 2019, 1:32 PM IST
Realme 3i: గుడ్ న్యూస్... జూలై 15న రియల్‌మీ 3ఐ రిలీజ్
Realme 3i: గుడ్ న్యూస్... జూలై 15న రియల్‌మీ 3ఐ రిలీజ్ (image: Flipkart)
news18-telugu
Updated: July 9, 2019, 1:32 PM IST
రియల్‌మీ ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్. జూలై 15న రియల్‌మీ ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు రియల్‌మీ 3ఐ కూడా రిలీజ్ కానుంది. రియల్‌మీ ఎక్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంటే సర్‌ప్రైజ్ ఇచ్చింది రియల్‌మీ. ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ 3ఐ టీజర్ కనిపించింది. అయితే ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ వివరాలేవీ వెల్లడించలేదు కంపెనీ. అసలు రియల్‌మీ నుంచి రియల్‌మీ 3ఐ స్మార్ట్‌ఫోన్ వస్తుందన్న విషయం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. దీంతో ఈ ఫోన్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి నెలకొంది. అయితే రియల్‌మీ 3 స్మార్ట్‌ఫోన్ లాగా రియల్‌మీ 3ఐలో కూడా డ్యూ డ్రాప్ డిస్‌ప్లే ఉంటుందని టీజర్ చూస్తే తెలుస్తుంది. రియల్‌మీ 3 లైటర్ వర్షన్ రియల్‌మీ 3ఐ కావచ్చని భావిస్తున్నారు. తక్కువ బడ్జెట్‌లో ఈ ఫోన్ ఉంటుందని అంచనా.

Realme 3i, Realme 3i release date, Realme new phone, Realme 3i specifications, Realme 3i features, Realme X, రియల్‌మీ 3ఐ, రియల్‌మీ 3ఐ రిలీజ్ డేట్, రియల్‌మీ 3ఐ ఫీచర్స్, రియల్‌మీ 3ఐ స్పెసిఫికేషన్స్, రియల్‌మీ ఎక్స్
(image: Flipkart)


జూలై 15న రియల్‌మీ ఎక్స్ రిలీజ్ చేయనుంది రియల్‌మీ. ఈ ఫోన్ కోసం రియల్‌మీ ఫ్యాన్స్ చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ కూడా పూర్తిగా తెలియదు. పాప్-అప్ సెల్ఫీ కెమెరా, VOOC 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుందని, ఆనియన్ అండ్ గార్లిక్ వేరియంట్‌ రానుందని మాత్రమే ప్రస్తుతం తెలుసు. మరి రియల్‌మీ ఎక్స్, రియల్‌మీ 3ఐ స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయో తెలియాలంటే జూలై 15 వరకు ఆగాల్సిందే.

Redmi 7A: రూ.5,799 ధరకే రెడ్‌మీ 7ఏ... ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

SBI: ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్... రిజిస్టర్ చేసుకోండిలా

UPI Apps: గూగుల్ పే, ఫోన్‌పే లావాదేవీల్లో ఈ జాగ్రత్తలు పాటించండి

WhatsApp: వాట్సప్‌లో వచ్చేస్తున్న కొత్త ఫీచర్స్ ఇవే...
First published: July 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...