Realme 3 Next Sale: రాత్రి 8 గంటలకు మరోసారి రియల్‌మీ 3 సేల్...

Realme 3 Next Sale | రియల్‌మీ 3 మోడల్‌లో 3డీ గ్రేడియంట్ డిజైన్, డ్యూడ్రాప్ ఫుల్ స్క్రీన్, మీడియాటెక్ హీలియో పీ70 ప్రాసెసర్, ఏఐ బ్యూటిఫికేషన్, కలర్ ఓఎస్ 6, రైడింగ్ మోడ్ లాంటి ప్రత్యేకతలున్నాయి.

news18-telugu
Updated: March 12, 2019, 5:15 PM IST
Realme 3 Next Sale: రాత్రి 8 గంటలకు మరోసారి రియల్‌మీ 3 సేల్...
Realme 3 Sale: రేపే రియల్‌మీ 3 సేల్... ధర రూ.8,999... జియో నుంచి రూ.5,300 బెనిఫిట్స్ (image: @realmemobiles/twitter)
news18-telugu
Updated: March 12, 2019, 5:15 PM IST
బడ్జెట్‌ సెగ్మెంట్‌లో మరిన్ని సంచలనాల కోసం రియల్‌మీ ఇటీవల లాంఛ్ చేసిన రియల్‌మీ 3 స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్ మార్చి 12న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో పూర్తైంది. మరో సేల్‌ను మార్చి 12న రాత్రి 8 గంటలకు నిర్వహించనుంది. ఇప్పటికే రియల్‌మీ 2 మోడల్‌తో ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టించిన రియల్‌మీ... ఇప్పుడు రియల్‌మీ 3 స్మార్ట్‌ఫోన్‌తో మరిన్ని రికార్డుల కోసం ఎదురుచూస్తోంది. రియల్‌మీ 2 స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యర్థి కంపెనీలకు ఊహించని పోటీ ఇచ్చింది. అవే అంచనాలతో రిలీజైన రియల్‌మీ 3 స్పెసిఫికేషన్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి.

రియల్‌మీ 3 మోడల్‌లో 3డీ గ్రేడియంట్ డిజైన్, డ్యూడ్రాప్ ఫుల్ స్క్రీన్, మీడియాటెక్ హీలియో పీ70 ప్రాసెసర్, ఏఐ బ్యూటిఫికేషన్, కలర్ ఓఎస్ 6, రైడింగ్ మోడ్ లాంటి ప్రత్యేకతలున్నాయి. 3జీబీ+32జీబీ ధర రూ.8,999 కాగా, 4జీబీ+64జీబీ ధర రూ.10,999. ఈ ధరలు మొదటి 10 లక్షల మందికే. ఆ తర్వాత ధరలు పెరిగే అవకాశముంది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో కొన్నవారికి రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు జియో నుంచి రూ.5,300 బెనిఫిట్స్ ఉంటాయని కంపెనీ ప్రకటించింది.

రియల్‌మీ 3 స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.2 అంగుళాలు


ర్యామ్: 3జీబీ, 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, 64జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో పీ70
Loading...
రియర్ కెమెరా: 13+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4230 ఎంఏహెచ్ బ్యాటరీ
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై+కలర్ ఓఏస్ 6
కలర్స్: డైనమిక్ బ్లాక్, రేడియంట్ బ్లూ
ధర:
3జీబీ+32జీబీ- రూ.8,999
4జీబీ+64జీబీ- రూ.10,999

Photos: ఈ 50 లగ్జరీ కార్లు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే...

ఇవి కూడా చదవండి:

Lok Sabha Election 2019: ఓటరు జాబితాలో మీ పేరు ఉందా? లేదా? 3 నిమిషాల్లో తెలుసుకోండి

Credit Card: క్రెడిట్ కార్డు వాడేప్పుడు ఈ 8 తప్పులు చేస్తున్నారా?

LIC AABY: ఎల్ఐసీ ఆమ్ ఆద్మీ బీమా యోజన... ఈ స్కీమ్‌తో మీకెంత లాభం?
First published: March 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...