Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    Realme 3: మార్చి 4న రియల్‌మీ 3 లాంఛింగ్

    Realme 3 Release Date | మార్చి 4న న్యూ ఢిల్లీలో జరిగే ఈవెంట్‌లో రియల్‌మీ 3 లాంఛ్ కానుంది. ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో పీ70 ప్రాసెసర్‌తో వస్తుందని కంపెనీ వెల్లడించింది.

    news18-telugu
    Updated: February 23, 2019, 12:41 PM IST
    Realme 3: మార్చి 4న రియల్‌మీ 3 లాంఛింగ్
    Realme 3: మార్చి 4న రియల్‌మీ 3 లాంఛింగ్
    • Share this:
    రియల్‌మీ ఫ్యాన్స్‌ని కొంతకాలంగా ఊరిస్తున్న రియల్‌మీ 3 మార్చి 4న లాంఛ్ కాబోతోంది. ఈ విషయాన్ని రియల్‌మీ ఇండియా అధికారికంగా ప్రకటించింది. షావోమీ తర్వాత అంతే స్థాయిలో ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టిస్తోంది రియల్‌మీ. రియల్‌మీ 1 పెద్దగా ఆకట్టుకోకపోయినా రియల్‌మీ 2 మోడల్‌‌కు ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. దీంతో రియల్‌మీ 3 ఎలా ఉండబోతుందో అన్న చర్చ ఫ్యాన్స్‌లో ఉంది. త్వరలో రియల్‌మీ 3 రాబోతోంది అంటూ కొద్దిరోజుల క్రితం కంపెనీ హింట్ ఇచ్చిన కంపెనీ... రిలీజ్ డేట్‌తో పాటు ప్రాసెసర్‌ వివరాలను వెల్లడించింది.

    Read this: WhatsApp Bug: మీ వాట్సప్‌లో బగ్ ఉందా? మీ ప్రైవసీకి ముప్పేనా?

    మార్చి 4న న్యూ ఢిల్లీలో జరిగే ఈవెంట్‌లో రియల్‌మీ 3 లాంఛ్ కానుంది. ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో పీ70 ప్రాసెసర్‌తో వస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇప్పటికే రియల్‌మీ యూ1 స్మార్ట్‌ఫోన్‌లో ఇదే ప్రాసెసర్ ఉంది. స్నాప్‌డ్రాగన్ 660 కన్నా 30 శాతం వేగంగా డౌన్‌లోడ్ స్పీడ్ ఉంటుందని కంపెనీ చెబుతోంది. రియల్‌మీ 3 మోడల్‌కు సంబంధించి ఇతర స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయో పూర్తి సమాచారం లేదు. అయితే 48 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ తీసుకొస్తామని గతంలో రియల్‌మీ ప్రకటించింది. మరి రియల్‌మీ 3 స్మార్ట్‌ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ కెమెరా ఉండొచ్చన్న చర్చ స్మార్ట్‌ఫోన్ యూజర్లలో ఉంది. రియల్‌మీ 3 ధర రూ.10,000 ఉండొచ్చని అనుకుంటున్నారు.

    Vivo V15 Pro: 32 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో వివో వీ15 ప్రో రిలీజ్


    ఇవి కూడా చదవండి:

    PAN-Aadhar Link: మీ పాన్-ఆధార్‌ లింకైందా? 30 సెకన్లలో తెలుసుకోండి

    Personal Finance: జీరో బ్యాలెన్స్ అకౌంట్‌కు ఈ 5 బ్యాంకులు బెస్ట్

    LIC Micro Bachat: ఎల్ఐసీ నుంచి 'మైక్రో బచత్ ప్లాన్'... వివరాలివే
    Published by: Santhosh Kumar S
    First published: February 23, 2019, 12:40 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading