రియల్మీ 3... మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసింది రియల్మీ. గతేడాది రియల్మీ 2 మోడల్‌తో ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సంచలనాలు సృష్టించిన రియల్మీ... ఇప్పుడు మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌తో మార్కెట్లోకి వచ్చేసింది. రియల్మీ 2 యూజర్లను బాగా ఆకట్టుకోవడంతో రియల్మీ 3 స్మార్ట్‌ఫోన్‌పై చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాల మధ్య రియల్మీ 3 మోడల్ని లాంఛ్ చేసింది కంపెనీ. రియల్మీ 3 ప్రో స్మార్ట్‌ఫోన్ కూడా లాంఛ్ చేస్తారని అనుకున్నా... కేవలం రియల్మీ 3 మాత్రమే రిలీజ్ చేసింది కంపెనీ. ఏప్రిల్‌లో రియల్మీ 3 ప్రో రిలీజ్ చేస్తామని కంపెనీ ప్రకటించింది.
రియల్మీ 3 స్మార్ట్‌ఫోన్‌లో 3డీ గ్రేడియంట్ డిజైన్, డ్యూడ్రాప్ ఫుల్ స్క్రీన్, మీడియాటెక్ హీలియో పీ70 ప్రాసెసర్, ఏఐ బ్యూటిఫికేషన్, కలర్ ఓఎస్ 6, రైడింగ్ మోడ్ లాంటి ప్రత్యేకతలున్నాయి. మార్చి 12 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ మొదలవుతుంది. హెచ్డీఎఫ్సీ కార్డుతో కొన్నవారికి రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది. జియో నుంచి రూ.5,300 బెనిఫిట్స్ ఉంటాయి. 3జీబీ+32జీబీ ధర రూ.8,999 కాగా, 4జీబీ+64జీబీ ధర రూ.10,999. ఈ ధరలు మొదటి 10 లక్షల మందికే ఉంటాయి. ఆ తర్వాత ధరలు పెరిగే అవకాశముంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.