Realme 3 Pro: కాసేపట్లో రియల్‌మీ 3 ప్రో రిలీజ్... 64 మెగాపిక్సెల్ ఫోటోలు, మరెన్నో ప్రత్యేకతలు

Realme 3 Pro Release | రిలీజ్‌కు ముందే రియల్‌మీ 3 ప్రో ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. 3,960 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, కలర్ ఓఎస్ 6.0, స్నాప్‌డ్రాగన్ 710, 6 జీబీ ర్యామ్, 48 మెగాపిక్సెల్ కెమెరా లాంటి ఫీచర్లు ఉంటాయని అంచనా.

news18-telugu
Updated: April 22, 2019, 12:37 PM IST
Realme 3 Pro: కాసేపట్లో రియల్‌మీ 3 ప్రో రిలీజ్... 64 మెగాపిక్సెల్ ఫోటోలు, మరెన్నో ప్రత్యేకతలు
Realme 3 Pro: కాసేపట్లో రియల్‌మీ 3 ప్రో రిలీజ్... 64 మెగాపిక్సెల్ ఫోటోలు, మరెన్నో ప్రత్యేకతలు (image: Realme)
news18-telugu
Updated: April 22, 2019, 12:37 PM IST
ఒకప్పుడు ఫోన్‌లో 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటేనే గొప్ప. ఆ తర్వాత మెగాపిక్సెల్ పెరుగుతూ వచ్చింది. 2ఎంపీ తర్వాత 4ఎంపీ, తర్వాత 8ఎంపీ, ఇంకొన్నాళ్లకు 16 మెగాపిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లు వచ్చాయి. అంతటితో ఆగలేదు. 32 మెగాపిక్సెల్, 48 మెగాపిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లు రావడం విశేషం. ఇప్పుడు రియల్‌మీ ఈ హద్దుల్ని దాటేస్తోంది. కొత్తగా రిలీజ్ చేయబోయే రియల్‌మీ 3 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో అల్ట్రా హెచ్‌డీ మోడ్‌తో ఏకంగా 64 మెగాపిక్సెల్ ఫోటోలు తీయొచ్చని ఆ కంపెనీ చెబుతోంది. రియల్‌మీ సీఈఓ కొత్త ఫోన్‌కు సంబంధించిన విశేషాలు, ఫోటోలు ట్వీట్ చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. రిలీజ్‌కు ముందే ఫీచర్లు తెలిసిపోవడం రియల్‌మీ ఫ్యాన్స్‌ను టెంప్ట్ చేస్తోంది. ఈ ఫోన్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఢిల్లీ యూనివర్సిటీలో రియల్‌మీ 3 ప్రో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కానుంది.

Read this: JIO 251 Plan: ఐపీఎల్ ఫ్యాన్స్ కోసం రూ.251 ప్రీపెయిడ్ ప్లాన్




స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. రియల్‌మీ, షావోమీ మధ్య కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. రెండు కంపెనీలు పోటాపోటీగా స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం షావోమీ రెడ్‌మీ నోట్ 7, రెడ్‌మీ నోట్ 7 ప్రో రిలీజ్ చేసింది. రియల్‌మీ కూడా రియల్‌మీ 3 రిలీజ్ చేసిం కాంపిటీషన్‌లో నిలిచింది. ఇప్పుడు రెడ్‌మీ నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌కు పోటీగా రియల్‌మీ 3 ప్రో రిలీజ్ కానుంది. రిలీజ్‌కు ముందే 'బ్లైండ్ ఆర్డర్' పేరుతో ఆర్డర్లు తీసుకుంది రియల్‌మీ. రియల్‌మీ 3 ప్రో స్మార్ట్‌ఫోన్‌ కోసం బ్లైండ్ ఆర్డర్లు లక్షకు పైనే వచ్చాయని రియల్‌మీ ప్రకటించడం విశేషం.
Loading...
Read this: JIO DND Feature: జియో యాప్‌లో డీఎన్‌డీ ఫీచర్ ఇలా యాక్టివేట్ చేయాలి


రిలీజ్‌కు ముందే రియల్‌మీ 3 ప్రో ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. 3,960 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, కలర్ ఓఎస్ 6.0, స్నాప్‌డ్రాగన్ 710, 6 జీబీ ర్యామ్, 48 మెగాపిక్సెల్ కెమెరా లాంటి ఫీచర్లు ఉంటాయని అంచనా. అంతేకాదు స్లో-మో, ఫాస్ట్ ఛార్జింగ్, హైపర్ బూస్ట్, లో లైట్ ఫొటోగ్రఫీ లాంటి ప్రత్యేకతలున్నాయి. 10 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే 5 గంటల పాటు టాక్ టైమ్ వస్తుందని కంపెనీ చెబుతోంది. మరి రియల్‌మీ 3 ప్రో ప్రత్యేకతలు తెలియాలంటే ఏప్రిల్ 22 మధ్యాహ్నం వరకు ఆగాల్సిందే.

Photos: న్యూయార్క్ ఆటో షోలో కళ్లుచెదిరే 16 కార్లు


ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్వే ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... మొత్తం 310 ఖాళీలు

FSSAI Jobs: ఇంటర్ చదివితే చాలు... ఫుడ్ సేఫ్టీ ఉద్యోగాలు... మొత్తం 275 ఖాళీలు

SBI Charges: ఎస్‌బీఐ వసూలు చేసే ఈ 5 ఛార్జీలు తెలుసుకోండి...
First published: April 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...