Realme 3 Pro-Jio offer: కాసేపట్లో రియల్‌మీ 3 ప్రో ఫస్ట్ సేల్... జియో నుంచి ఆఫర్లు ఇవే

Realme 3 Pro Sale in Flipkart | రియల్‌మీ 3 ప్రో VOOC 3.0 ఛార్జింగ్ సపోర్ట్ చేయడం విశేషం. బాక్స్‌లో 20W ఛార్జర్‌ ఇస్తోంది కంపెనీ. ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌తో 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 5 గంటలపాటు టాక్‌టైమ్ లభిస్తుందని, ఫోన్ ఫుల్ ఛార్జ్ చేయడానికి 80 నిమిషాలు చాలని కంపెనీ చెబుతోంది.

news18-telugu
Updated: April 29, 2019, 10:03 AM IST
Realme 3 Pro-Jio offer: కాసేపట్లో రియల్‌మీ 3 ప్రో ఫస్ట్ సేల్... జియో నుంచి ఆఫర్లు ఇవే
Realme 3 Pro-Jio offer: రేపే రియల్‌మీ 3 ప్రో సేల్... జియో నుంచి ఆఫర్లు ఇవే (image: Realme)
news18-telugu
Updated: April 29, 2019, 10:03 AM IST
రియల్‌మీ 3 ప్రో స్మార్ట్‌ఫోన్ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ఏప్రిల్ 29 మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. కొద్దిరోజుల క్రితమే రియల్‌మీ 3 ప్రో స్మార్ట్‌ఫోన్‌ రిలీజైంది. తొలి సేల్ కోసం రియల్‌మీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. రియల్‌మీ 3 ప్రో ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. ఫ్రంట్‌లో 25 మెగాపిక్సెల్ కెమెరా, 4కే వీడియో రికార్డింగ్, వీడియో ఎడిటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. రియల్‌మీ 3 ప్రో VOOC 3.0 ఛార్జింగ్ సపోర్ట్ చేయడం విశేషం. బాక్స్‌లో 20W ఛార్జర్‌ ఇస్తోంది కంపెనీ. ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌తో 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 5 గంటలపాటు టాక్‌టైమ్ లభిస్తుందని, ఫోన్ ఫుల్ ఛార్జ్ చేయడానికి 80 నిమిషాలు చాలని కంపెనీ చెబుతోంది. ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు లోలైట్ ఫోటోగ్రఫీ, స్లో-మోషన్, డ్యూ డ్రాప్ డిస్‌ప్లే లాంటి ప్రత్యేకతలున్నాయి.


రియల్‌మీ 3 ప్రో స్మార్ట్‌ఫోన్ కొన్నవారికి 'రియల్‌మీ యూత్ ప్లాన్' వర్తిస్తుంది. ఈ ఆఫర్‌లో జియో నుంచి రూ.5,300 విలువైన బెనిఫిట్స్ ఉంటాయి. రూ.299 రీఛార్జ్ చేసుకున్నవారికి రోజుకు 3 జీబీ డేటా లభిస్తుంది. దీంతో పాటు అన్‌లిమిటెడ్ టాక్‌ టైమ్ పొందొచ్చు. జియో సేవల్ని ఉపయోగించుకోవచ్చు. 'రియల్‌మీ యూత్ ప్లాన్'‌లో రీఛార్జ్‌లపై నెలకు రూ.100 చొప్పున రూ.1,800 తగ్గింపు లభిస్తుంది. బుక్‌మై షో నుంచి 50 శాతం డిస్కౌంట్, క్లియర్‌ట్రిప్‌లో రూ.3,250 క్యాష్‌బ్యాక్, ఫెర్న్స్ అండ్ పెటల్స్‌లో రూ.750 కొనుగోలుపై రూ.150 తగ్గింపు లభిస్తుంది. 'రియల్‌మీ యూత్ ప్లాన్'లో మొత్తం కలిపి రూ.5,300 వరకు బెనిఫిట్స్ లభిస్తాయి.

Reliance Jio offers, Realme Youth Plan, Realme Youth Plan offers, Realme Youth offers, Realme smartphone, Reliance Jio data offers, Reliance Jio plans, Realme 3 pro, realme c2, realme 3, రిలయెన్స్ జియో ఆఫర్స్, రియల్‌మీ యూత్ ప్లాన్, రియల్‌మీ యూత్ ప్లాన్ ఆఫర్స్, రియల్‌మీ యూత్ ఆఫర్స్, రియల్‌మీ స్మార్ట్‌ఫోన్, రిలయెన్స్ జియో డేటా ఆఫర్స్, రిలయెన్స్ జియో ప్లాన్స్, రియల్‌మీ 3 ప్రో, రియల్‌మీ సీ2, రియల్‌మీ 3
image: Jio


రియల్‌మీ 3 ప్రో స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ
ర్యామ్: 4 జీబీ, 6జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ, 128 జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 710
రియర్ కెమెరా: 16+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 25 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4045 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిన్ 9.0+కలర్ ఓఎస్ 6.0
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: నైట్రో బ్లూ, లైటెనింగ్ పర్పుల్, కార్బన్ గ్రే
ధర:
4 జీబీ+64జీబీ- రూ.13,999
6 జీబీ+128జీబీ- రూ.16,999

Realme 3 Pro: రియల్‌మీ 3 ప్రో... ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

PAN Card: పాన్ కార్డులో తప్పుల్ని సరిచేసుకోండి ఇలా...

Aadhaar Card: మీ ఆధార్ కార్డు ఎక్కడెక్కడ వాడారో తెలుసుకోండి

SBI Loans: ఎస్‌బీఐ ఆఫర్ చేస్తున్న లోన్స్ ఇవే...
First published: April 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...