Realme 3 Pro: ఆకట్టుకునే ఫీచర్లతో రిలీజైన రియల్‌మీ 3 ప్రో... ప్రత్యేకతలు ఇవే

Realme 3 pro Released | రియల్‌మీ 3 ప్రోలో 16+5 మెగాపిక్సెల్ కెమెరానే ఉన్నా... అల్ట్రా హెచ్‌డీ మోడ్‌తో 64 మెగాపిక్సెల్ ఫోటోలు తీయొచ్చని కంపెనీ చెబుతోంది. 4కే వీడియో రికార్డింగ్, వీడియో ఎడిటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి.

news18-telugu
Updated: April 22, 2019, 2:37 PM IST
Realme 3 Pro: ఆకట్టుకునే ఫీచర్లతో రిలీజైన రియల్‌మీ 3 ప్రో... ప్రత్యేకతలు ఇవే
Realme 3 Pro: ఆకట్టుకునే ఫీచర్లతో రిలీజైన రియల్‌మీ 3 ప్రో... ప్రత్యేకతలు ఇవే (image: @realmemobiles/twitter)
news18-telugu
Updated: April 22, 2019, 2:37 PM IST
రియల్‌మీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రియల్‌మీ 3 ప్రో గ్రాండ్‌గా రిలీజైంది. కొంతకాలంగా రియల్‌మీ 3 ప్రో టీజర్లు యూజర్లలో భారీ అంచనాలే పెంచాయి. ఇటీవలే రియల్‌మీ 3 రిలీజ్ చేసిన కంపెనీ... ఇప్పుడు రియల్‌మీ 3 ప్రో తీసుకొచ్చేసింది. రియల్‌మీ 3 ప్రోలో 16+5 మెగాపిక్సెల్ కెమెరానే ఉన్నా... అల్ట్రా హెచ్‌డీ మోడ్‌తో 64 మెగాపిక్సెల్ ఫోటోలు తీయొచ్చని కంపెనీ చెబుతోంది. 4కే వీడియో రికార్డింగ్, వీడియో ఎడిటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్రంట్‌లో 25 మెగాపిక్సెల్ కెమెరా సెల్ఫీ లవర్స్‌ను ఆకట్టుకుంటుంది. ఇవి మాత్రమే కాదు మరిన్ని రియల్‌మీ 3 ప్రో ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి.

Read this: Realme C2: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ సీ2 రిలీజ్... ధర రూ.5,999

రియల్‌మీ 3 ప్రో VOOC 3.0 ఛార్జింగ్ సపోర్ట్ చేయడం విశేషం. బాక్స్‌లో 20W ఛార్జర్‌ ఇస్తోంది కంపెనీ. ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌తో 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 5 గంటలపాటు టాక్‌టైమ్ లభిస్తుందని, ఫోన్ ఫుల్ ఛార్జ్ చేయడానికి 80 నిమిషాలు చాలని కంపెనీ చెబుతోంది. ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు లోలైట్ ఫోటోగ్రఫీ, స్లో-మోషన్, డ్యూ డ్రాప్ డిస్‌ప్లే లాంటి ప్రత్యేకతలున్నాయి. రియల్‌మీ 3 ప్రో స్మార్ట్‌ఫోన్ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ఏప్రిల్ 29 మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుపై కొన్నవారికి రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. జియో నుంచి రూ.5,300 బెనిఫిట్స్ ఉంటాయని రియల్‌మీ ప్రకటించింది. రియల్‌మీ 3 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో కొన్నాళ్ల క్రితం షావోమీ రిలీజ్ చేసిన రెడ్‌మీ నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌కు గట్టి పోటీ ఇస్తోంది రియల్‌మీ.

Read this: Post Office Franchise: రూ.5 వేలతో పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్... వివరాలు ఇవే...



Realme 3 pro release, Realme 3 pro launch, Realme 3 pro features, Realme 3 pro specifications, Realme 3 pro price, Realme 3 pro photos, Realme 3 pro pics, రియల్‌మీ 3 ప్రో రిలీజ్, రియల్‌మీ 3 ప్రో లాంఛ్, రియల్‌మీ 3 ప్రో ధర, రియల్‌మీ 3 ప్రో స్పెసిఫికేషన్స్, రియల్‌మీ 3 ప్రో ఫీచర్స్, రియల్‌మీ 3 ప్రో కెమెరా, రియల్‌మీ 3 ప్రో ఆఫర్, రియల్‌మీ 3 ప్రో ఫోటోలు
(image: @realmemobiles/twitter)


రియల్‌మీ 3 ప్రో స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ
ర్యామ్: 4 జీబీ, 6జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ, 128 జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 710
రియర్ కెమెరా: 16+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 25 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4045 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిన్ 9.0+కలర్ ఓఎస్ 6.0
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: నైట్రో బ్లూ, లైటెనింగ్ పర్పుల్, కార్బన్ గ్రే
ధర:
4 జీబీ+64జీబీ- రూ.13,999
6 జీబీ+128జీబీ- రూ.16,999

Realme 3 Pro: రిలీజైన రియల్‌మీ 3 ప్రో... ఎలా ఉందో చూశారా?

ఇవి కూడా చదవండి:

SSC MTS Jobs: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్

KGF Chapter 2: కేజీఎఫ్ చాప్టర్ 2లో మీరూ నటించొచ్చు... ఆడిషన్ వివరాలు ఇవే...

Indian Railways: మీరు ఎక్కిన రైలు డర్టీగా ఉందా? ఇలా కంప్లైంట్ చేయండి
First published: April 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...