Realme 3 Pro: రెడ్‌మీ నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌కు పోటీగా రియల్‌మీ 3 ప్రో... ఏప్రిల్ 22న రిలీజ్

Realme 3 Pro | రియల్‌మీ 3 ప్రో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని రియల్‌మీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ నెల 22న రిలీజ్ చేస్తామని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

news18-telugu
Updated: April 13, 2019, 4:47 PM IST
Realme 3 Pro: రెడ్‌మీ నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌కు పోటీగా రియల్‌మీ 3 ప్రో... ఏప్రిల్ 22న రిలీజ్
Realme 3 Pro: రెడ్‌మీ నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌కు పోటీగా రియల్‌మీ 3 ప్రో... ఏప్రిల్ 22న రిలీజ్
news18-telugu
Updated: April 13, 2019, 4:47 PM IST
రియల్‌మీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. కొద్ది రోజుల క్రితం రియల్‌మీ 3 రిలీజ్ చేసిన షావోమీ... ఇప్పుడు రియల్‌మీ 3 ప్రో లాంఛ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 22న రియల్‌మీ 3 ప్రో లాంఛ్ కానుంది. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో అధికారికంగా ప్రకటించింది కంపెనీ. ఇప్పటికే రియల్‌మీ 3 ప్రో స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు రియల్‌మీ సీఈఓ.


బడ్జెట్ సెగ్మెంట్‌లో షావోమీతో పోటీపడుతోంది రియల్‌మీ. ఇప్పుడు మార్కెట్‌లో ఫేవరెట్‌గా మారిన రెడ్‌మీ నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌కు పోటీగా రియల్‌మీ 3 ప్రో రిలీజ్ చేస్తుండటం విశేషం. రెడ్‌మీ నోట్ 7 ప్రో లాగే రియల్‌మీ 3 ప్రో ఫోన్‌లో కూడా 48 మెగాపిక్సెల్ కెమెరా ఉండటం విశేషం. రియల్‌మీ 3 ప్రో ఫోన్‌లో తీసిన ఫోటోలను ట్వీట్ చేసింది కంపెనీ. అంతేకాదు... రియల్‌మీ 3 ప్రో ఫోన్‌లో సెల్ఫీ కెమెరా 25 మెగాపిక్సెల్ ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.



Yamaha MT-15: యమహా కొత్త బైక్ ఎలా ఉందో చూశారా?

ఇవి కూాడా చదవండి:

UPSC Jobs: మొత్తం 965 ఖాళీలు... మొదలైన దరఖాస్తు ప్రక్రియ

IRCTC Rules: టికెట్ రీఫండ్ రిజెక్ట్ కావడానికి 10 కారణాలివే...

WhatsApp: వాట్సప్‌లో వీడియోను ఆడియోగా ఇలా మార్చేయండి
First published: April 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...