Realme 3 Flash Sale: కాసేపట్లో ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ 3 ఫ్లాష్ సేల్... ఆఫర్లు, ఫీచర్లు ఇవే...

Realme 3 Flash Sale: రియల్‌మీ 3 మరో ఫ్లాష్ సేల్... ఆఫర్లు, ఫీచర్లు ఇవే...

Realme 3 Next flash sale | తొలి రోజు నిర్వహించిన ఫ్లాష్ రెండు సేల్స్‌లో 2,10,000 స్మార్ట్‌ఫోన్లు అమ్మినట్టు కంపెనీ ప్రకటించింది. రియల్‌మీ 2 మోడల్‌తో ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టించిన రియల్‌మీ... రియల్‌మీ 3 స్మార్ట్‌ఫోన్‌తో అలాంటి రికార్డులే క్రియేట్ చేస్తున్నాయని లెక్కలు చెబుతున్నాయి.

  • Share this:
    మొదటిరోజు నిర్వహించిన రెండు ఫ్లాష్ సేల్స్‌లో రియల్‌మీ 3 స్మార్ట్‌ఫోన్ కొనలేనివారికి శుభవార్త. మార్చి 19న మరో ఫ్లాష్ సేల్ నిర్వహించబోతోంది రియల్‌మీ. మధ్యాహ్నం 12 గంటలకు ఈ సేల్ జరగనుంది. రియల్‌మీ 3 తొలి ఫ్లాష్ సేల్ మార్చి 12న మధ్యాహ్నం 12 గంటలకు జరిగింది. అదే రోజు రాత్రి 8 గంటలకు మరో ఫ్లాష్ సేల్ నిర్వహించింది రియల్‌మీ. తొలి రోజు నిర్వహించిన ఫ్లాష్ రెండు సేల్స్‌లో 2,10,000 స్మార్ట్‌ఫోన్లు అమ్మినట్టు కంపెనీ ప్రకటించింది. రియల్‌మీ 2 మోడల్‌తో ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టించిన రియల్‌మీ... రియల్‌మీ 3 స్మార్ట్‌ఫోన్‌తో అలాంటి రికార్డులే క్రియేట్ చేస్తున్నాయని లెక్కలు చెబుతున్నాయి. ఇందుకు కారణం ఆ మోడల్ స్పెసిఫికేషన్స్‌తో పాటు ధర యూజర్లను ఆకట్టుకోవడమే.

    Read this: Redmi Go: షావోమీ నుంచి లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 'రెడ్‌మీ గో'

    Realme 3 second flash sale, Realme 3 next flash sale, Realme 3 Flipkart sale, Realme 3 Jio offer, Realme 3 Price, Realme 3 specifications, Realme 3 features, రియల్‌మీ 3 నెక్స్‌ట్ సేల్, రియల్‌మీ 3 ఫీచర్స్, రియల్‌మీ 3 సేల్, రియల్‌మీ 3 స్పెసిఫికేషన్స్, రియల్‌మీ 3 ఆఫర్, రియల్‌మీ 3 జియో ఆఫర్
    image: @realmemobiles/twitter


    రియల్‌మీ 3 మోడల్‌లో 3డీ గ్రేడియంట్ డిజైన్, డ్యూడ్రాప్ ఫుల్ స్క్రీన్, మీడియాటెక్ హీలియో పీ70 ప్రాసెసర్, ఏఐ బ్యూటిఫికేషన్, కలర్ ఓఎస్ 6, రైడింగ్ మోడ్ లాంటి ప్రత్యేకతలున్నాయి. 3జీబీ+32జీబీ ధర రూ.8,999 కాగా, 4జీబీ+64జీబీ ధర రూ.10,999. జియో నుంచి రూ.5,300 బెనిఫిట్స్ ఉంటాయని కంపెనీ ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు Realme.com వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ కొనొచ్చు.

    రియల్‌మీ 3 స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.2 అంగుళాలు
    ర్యామ్: 3జీబీ, 4జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, 64జీబీ
    ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో పీ70
    రియర్ కెమెరా: 13+2 మెగాపిక్సెల్
    ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 4230 ఎంఏహెచ్ బ్యాటరీ
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై+కలర్ ఓఏస్ 6
    కలర్స్: డైనమిక్ బ్లాక్, రేడియంట్ బ్లూ
    ధర:
    3జీబీ+32జీబీ- రూ.8,999
    4జీబీ+64జీబీ- రూ.10,999

    Photos: రెడ్‌మీ నోట్ 7 ప్రో... ఎలా ఉందో చూడండి



    వాట్సాప్ ద్వారా న్యూస్ 18 తెలుగు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి

    ఇవి కూడా చదవండి:

    Paytm App: పేటీఎం నుంచి మరో యాప్... ఫీచర్లు ఇవే

    Healthy Sleep Tips: హాయిగా నిద్రపోవాలంటే ఈ 9 టిప్స్ ఫాలో అవండి

    IRCTC PNR Linking: ఏప్రిల్ 1 నుంచి అమలులోకి... ప్రయాణికులకు ఎంత లాభం?

     
    First published: