
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రియల్‌మి 2 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంఛైంది. నాచ్ డిస్ప్లే, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ గల ఈ ఫోన్ ధర రూ.8,990.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రియల్‌మి 2 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంఛైంది. నాచ్ డిస్ప్లే, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ గల ఈ ఫోన్ ధర రూ.8,990.
ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి మరో ఫోన్ దూసుకొచ్చింది. కొంతకాలంగా ఊరిస్తున్న రియల్మీ 2 ఫోన్ గ్రాండ్‌గా లాంఛైంది. నాచ్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈ ఫోన్ ప్రత్యేకత. కెమెరా విషయానికొస్తే ఏఐ బ్యూటిఫికేషన్ 2.0, రియల్ టైమ్ ఏఆర్ స్టిక్కర్స్, ఫ్రంట్ కెమెరా హెచ్డీఆర్, బొకే మోడ్ లాంటి ఫీచర్లున్నాయి. మోటో జీ5 ప్లస్, షావోమీ రెడ్ నోట్ 5, రెడ్మీ నోట్ 5 ప్రో లాంటి టాప్ బడ్జెట్ స్మార్ట్ఫోన్లను టార్గెట్ చేస్తోంది రియల్మీ 2 ఫోన్. ఈ ఫోన్ ఎక్స్‌క్లూజీవ్ సేల్ సెప్టెంబర్ 4న మధ్యాహ్నం 12 గంటలకు మొదలుకానుంది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డుతో కొన్న వారికి రూ.750 తగ్గింపు లభిస్తుంది. రిలయెన్స్ జియో నుంచి 120జీబీ అదనపు డేటాతో పాటు రూ.4,200 బెనిఫిట్స్ లభిస్తాయి. రియల్ మీ 2 కొనుగోలుదారులు ఈఎంఐ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు.
రియల్మీ 2 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.2 అంగుళాల హెచ్డీ+, 720x1520 పిక్సెల్స్, 19:9 యాస్పెక్ట్ రేషియో
ర్యామ్: 3 జీబీ, 4 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ, 64 జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 450
రియర్ కెమెరా: 13+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4230 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1, కలర్ ఓఎస్ 5.1
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
ధర:
3 జీబీ + 32 జీబీ- రూ.8,990
4 జీబీ + 64 జీబీ- రూ.10,990
Published by:Santhosh Kumar S
First published:August 28, 2018, 14:55 pm