Realme Wireless Charger: రియల్‌మీ నుంచి వైర్‌లెస్ ఛార్జర్.. ఎలా చార్జింగ్ చేయాలో అర్థం కావడం లేదా..
Realme Wireless Charger: రియల్‌మీ నుంచి వైర్‌లెస్ ఛార్జర్.. ఎలా చార్జింగ్ చేయాలో అర్థం కావడం లేదా..
ప్రతీకాత్మకచిత్రం
ప్రీమియం, బడ్డెట్ స్మార్ట్‌ఫోన్ల విభాగంలో మంచి మార్కెట్ వాటా సాధించిన రియల్‌మీ సంస్థ.. మరో కొత్త ప్రొడక్ట్‌ను ఆవిష్కరించనుంది. సంస్థ అభివృద్ధి చేసిన నెక్స్ట్ జెనరేషన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్ డివైజ్ ప్రస్తుతం మార్కెట్లో మంచి సేల్స్ అందుకుంటోంది.
ప్రీమియం, బడ్డెట్ స్మార్ట్‌ఫోన్ల విభాగంలో మంచి మార్కెట్ వాటా సాధించిన రియల్‌మీ సంస్థ.. మరో కొత్త ప్రొడక్ట్‌ను ఆవిష్కరించనుంది. సంస్థ అభివృద్ధి చేసిన నెక్స్ట్ జెనరేషన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్ డివైజ్‌ను ఆగస్టు 3న లాంచ్ చేయనుంది. రియల్‌మీ మ్యాగ్‌డార్ట్ పేరుతో రానున్న ఈ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ.. మాగ్నెటిక్ స్నాప్-ఆన్ ఫీచర్లతో రావచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల యాపిల్ ఆవిష్కరించిన మ్యాగ్‌సేఫ్ బ్యాటరీ ప్యాక్ సైతం ఇదే టెక్నాలజీతో వచ్చింది. ఈ కొత్త ఛార్జింగ్ టెక్నాలజీని రియల్‌మీ ఫ్లాష్ స్మార్ట్‌ఫోన్‌తో కలిపి అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ భావించింది.
ఈ క్రమంలో దీన్ని లాంచ్ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. అయితే ఈ మ్యాగ్‌డార్ట్ వైర్‌లెస్ ఛార్జర్‌తో పాటు రియల్‌మి ఫ్లాష్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసే విషయంపై సంస్థ స్పష్టత ఇవ్వలేదు. ఈ కొత్త డివైజ్ గురించి మరిన్ని వివరాలను ‘రియల్‌మీ టెక్ లైఫ్ ట్విట్టర్ అకౌంట్’ ద్వారా ప్రకటించింది. ఆగస్టు 3న సాయంత్రం 5.30 గంటలకు ఈ వైర్‌లెస్ ఛార్జర్‌ను ఆవిష్కరించనున్నట్లు సంస్థ వెల్లడించింది.
రియల్‌మి ఫ్లాష్, ఇతర స్మార్ట్‌ఫోన్ల కోసం ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసినట్లు తెలిపింది. దీనికి సంబంధించిన టీజర్ పోస్టర్ సైతం విడుదలైంది. ఈ డివైజ్ ఒక రింగ్ రూపంలో ఉన్నట్లు టీజర్‌లో కనిపిస్తోంది. ఇది ఇటీవల యాపిల్ ప్రకటించిన మ్యాగ్‌సేఫ్ బ్యాటరీ ప్యాక్ మాదిరిగానే ఉంది. మ్యాగ్‌సేఫ్ ఛార్జర్ ఐఫోన్ 12 సిరీస్‌లకు మాత్రమే పనిచేస్తుంది. అలాగే మ్యాగ్‌డార్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ సైతం మ్యాగ్‌డార్ట్ టెక్‌ను అనుసంధానించిన ఫోన్‌లకు మాత్రమే పనిచేస్తుంది.
ఈ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన మొదటి డివైజ్ రియల్‌మీ ఫ్లాష్ స్మార్ట్‌ఫోన్ కావడం గమనార్హం. రియల్‌మీ మ్యాగ్‌డార్ట్ మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జర్ ఒక క్యూబాయిడ్ ఆకారంలో వస్తుందని గతంలో వార్తలు వచ్చాయి. కానీ తాజాగా బయటకు వచ్చిన టీజర్‌లో మాత్రం ఈ డివైజ్ ఒక రింగ్ రూపంలో ఉన్నట్లు కనిపిస్తోంది. సంబంధిత ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి ఇది ఫోన్ వెనుక భాగంలో అంటుకుంటుంది.
వేడిని బయటకు పంపడానికి దీని వెనుక వెంటిలేషన్ రంధ్రాలు ఉంటాయి. ఇది 15W కంటే ఎక్కువ ఛార్జింగ్ వేగాన్ని అందుకుటుందని.. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మాగ్నెటిక్ ఛార్జర్ అని లీక్‌లు పేర్కొన్నాయి. ఈ ఛార్జర్ పనిచేసే రియల్‌మీ ఫ్లాష్ స్మార్ట్‌ఫోన్.. హోల్-పంచ్ డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 12GB RAM, 256GB స్టోరేజ్ వంటి ఫీచర్లతో రానుంది. స్నాప్‌డ్రాగన్ 888 SoC, ఆండ్రాయిడ్ 11 బేస్డ్ రియల్‌మీ UI 2.0 ఓఎస్‌తో స్మార్ట్‌ఫోన్ పనిచేస్తుంది. అయితే కొత్త వైర్‌లెస్ ఛార్జర్, ఫ్లాష్ స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసిన తరువాతే.. దీని గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.