దసరా, దీపావళి సీజన్‌కు ముందు ప్రధాన మొబైల్ కంపెనీలు స్మార్ట్ఫోన్ల రిలీజ్‌ను ఆపేశాయి. మళ్లీ ఇండియాలో స్మార్ట్ఫోన్ల రిలీజ్ సందడి మొదలైంది. రియల్మీ ఇండియా నుంచి రెండు స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ అయ్యాయి. రియల్మీ 10 ప్రో సిరీస్‌లో (Realme 10 Pro Series) రెండు మొబైల్స్ లాంఛ్ అయ్యాయి. రియల్మీ 10 ప్రో, రియల్మీ 10 ప్రో ప్లస్ (Realme 10 Pro Plus) మోడల్స్‌ను లాంఛ్ చేసింది కంపెనీ. వీటిలో రియల్మీ 10 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో కర్వ్ ఎడ్జ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్, 108మెగాపిక్సెల్ కెమెరా సెటప్ లాంటి ఫీచర్స్ ఉండగా, రియల్మీ 10 ప్రో మోడల్లో స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 6.7 అంగుళాల డిస్ప్లే లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
రియల్మీ 10 ప్రో ప్లస్ మూడు వేరియంట్లలో రిలీజైంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999. ఇంట్రడక్టరీ ఆఫర్ కింద రూ.1,000 తగ్గింపు పొందొచ్చు. అంటే 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.23,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.24,999 ధరకు, 8జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.26,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. డిసెంబర్ 14 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ప్రారంభం అవుతుంది. నైట్ బ్లాక్, స్టార్‌లైట్, సీ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు.
WhatsApp: మెటా అవతార్ ఫీచర్ వాట్సప్‌లో వచ్చేసింది... ఎలా పనిచేస్తుందంటే
realme 10 Pro + 5G Series Available in ????6GB+128GB, INR 23,999 ????8GB +128GB, INR 25,999 ????8GB +256GB, INR 27,999
Avail some amazing discounts through bank offers. The first sale begins on December 14, 12:00 PM!https://t.co/8PQIMqVZLa#realme10ProSeries5G #CurvedDisplayNewVision pic.twitter.com/0yC5V5GEAf — realme (@realmeIndia) December 8, 2022
రియల్మీ 10 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల కర్వ్డ్ ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో 108మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 8మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. రియల్మీ 10 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రియల్మీ యూఐ 4.0 + ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 5జీ, బ్లూటూత్ 5.2 లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
Wi-Fi: వైఫై ఎక్కువగా వాడుతున్నారా? ఈ సమస్యలు తప్పవు
Boundless display and limitless performance! Introducing the #realme10ProSeries5G with 108 MP ProLight camera, starting from ₹17,999*/- Welcome the future with #realme.
Know more: https://t.co/KyxJhPg9NA#realme10Pro5G #CurvedDisplayNewVision pic.twitter.com/fMtZ7mzu6j — realme (@realmeIndia) December 8, 2022
రియల్మీ 10 ప్రో రెండు వేరియంట్లలో రిలీజైంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999. ఇంట్రడక్టరీ ఆఫర్ కింద రూ.1,000 తగ్గింపు పొందొచ్చు. అంటే 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.17,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.19,999 ధరకు కొనొచ్చు. డిసెంబర్ 16 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ప్రారంభం అవుతుంది. హైపర్ స్పేస్ గోల్డ్, డార్క్ మ్యాటర్, నెబ్యులా బ్లూ కలర్స్‌లో కొనొచ్చు.
రియల్మీ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ పంచ్ హోల్ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో 108మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. రియల్మీ 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రియల్మీ యూఐ 4.0 + ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Realme, Smartphone