Realme 10 Pro+ 5G మరియు Realme 10 Pro 5G భారతదేశంలో ప్రారంభించబడ్డాయి. ఇందులో రియల్మీ 10 ప్రో ప్లస్ మూడు వేరియంట్లలో విడుదల కాగా.. రియల్మీ 10 ప్రో రెండు వేరియంట్లలో విడుదలైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
జియోతో భాగస్వామ్యం
Reliance Jio సహకారంతో అనేక కొత్త బండిల్ ఆఫర్లను తీసుకురానున్నట్టు Realme తెలిపింది. ఈ విషయంపై Realme India CEO మాధవ్ సేథ్ మాట్లాడుతూ.. 5G స్టాండలోన్, NRCA, VoNR వంటి టెక్నాలజీల కోసం Realme Jioతో చేతులు కలిపినట్లు వివరించారు. దీనితో పాటు, Jioతో భాగస్వామ్యంతో Realme వినియోగదారులకు నిజమైన 5G అనుభవాన్ని అందించడానికి ఎంపిక చేసిన షోరూమ్‌లలో ట్రూ 5G ఎక్స్పీరియన్స్ జోన్లను కూడా ఏర్పాటు చేశామన్నారు.
ఈ భాగస్వామ్యంపై జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ CEO కిరణ్ థామస్ మాట్లాడుతూ.. 'Realmeతో మరో గొప్ప భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. Realme 10 Pro+ వంటి శక్తివంతమైన 5G స్మార్ట్‌ఫోన్ యొక్క నిజమైన శక్తి Jio వంటి నిజమైన 5G నెట్వర్క్ ద్వారా మాత్రమే చూపబడుతుంది. జియో ట్రూ 5G భారతదేశంతో ప్రపంచంలోనే అత్యంత అధునాతన నెట్వర్క్.
దేశంలో స్వతంత్రంగా 5G నెట్‌వర్క్‌ను లాంచ్ చేస్తున్న ఏకైక ఆపరేటర్ రిలయన్స్ జియో . స్టాండ్ ఎలోన్ 5G నెట్వర్క్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే.. ఇది 4G నెట్‌వర్క్‌పై ఆధారపడదు. చాలా వేగవంతమైన డేటా హైవేని కూడా సృష్టిస్తుంది.
రియల్మీ 10 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్స్
రియల్మీ 10 ప్రో ప్లస్ మూడు వేరియంట్లలో ఇండియాలో రిలీజైంది. రియల్మీ 10 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల కర్వ్డ్ ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో 108మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 8మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. రియల్మీ 10 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రియల్మీ యూఐ 4.0 + ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 5జీ, బ్లూటూత్ 5.2 లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
Tecno Pova 4: టెక్నో పోవా 4 స్మార్ట్‌ఫోన్ లాంచ్.. బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లు
Variant | Colors | MOP | Offer Price | Sale date |
రియల్ మీ 10 ప్రో+ 5G (6+128 జీబీ) | Hyperspace Gold, Dark Matter and Nebula Blue | రూ. 24,999 | ధర రూ. 23,999 (రూ. 1000 బ్యాంక్ ఆఫర్ డిస్కౌంట్*) నో కాస్ట్ EMI 6 నెలల వరకు | డిసెంబర్ 14, 12 గంటల నుంచి సేల్ realme.com, Flipkart మరియు సమీపంలోని స్టోర్స్ లలో |
రియల్ మీ 10 ప్రో+ 5G (8+128GB) | రూ. 25,999 | NA |
రియల్మీ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్..
ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ పంచ్ హోల్ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో 108మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. రియల్మీ 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రియల్మీ యూఐ 4.0 + ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Jio 5G, Jio TRUE 5G, Realme