Realme 8s 5G: మార్కెట్‌లోకి రియ‌ల్‌మి 8ఎస్‌.. బెస్ట్ ఆఫ‌ర్స్ ఇవే

Realme 8 Series: (image: Realme India)

వినియోగ‌దారులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రియ‌ల్‌మి 8ఎస్(Realme 8s) మోడ‌ల్ మార్కెట్‌లోకి వ‌చ్చేసింది. ఈ ఫోన్ మొదటి సేల్ నుంచి ఈ ఫోన్ కొనేవారికి మంచి ఆఫర్ల(Offers)ను కూడా సంస్థ ప్రకటించింది.

  • Share this:
    వినియోగ‌దారులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రియ‌ల్‌మి 8ఎస్ మోడ‌ల్ మార్కెట్‌లోకి వ‌చ్చేసింది. రియల్‌మీ ఇండియాలో రియల్‌మీ 8ఐ (Realme 8i), రియల్‌మీ 8ఎస్ 5జీ (Realme 8s 5G) స్మార్ట్‌ఫోన్లను లాంఛ్ చేసింది. దీంతో రియల్‌మీ 8 సిరీస్‌లో మొత్తం 5 స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఇప్పటికే రియల్‌మీ 8, రియల్‌మీ 8 5జీ, రియల్‌మీ 8 ప్రో స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లో ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో రియల్‌మీ 8ఐ రూ.15,000 బడ్జెట్‌లో, రియల్‌మీ 8ఎస్ 5జీ రూ.20,000 బడ్జెట్‌లో రిలీజ్ అయ్యాయి.
    ఆఫ‌ర్ల వివ‌రాలు..
    రియల్ మీ రెండురోజుల క్రితం విడుదల చేసిన లేటెస్ట్ 5G ఫోన్ Realme 8s. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్  సెప్టెంబర్ 13, 2021 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్ (Flipkart)తోపాటు రియ‌ల్‌మి (Realme) అధికారిక వెబ్సైట్(website) నుంచి జరుగనుంది. ఈ ఫోన్ మొదటి సేల్ నుంచి ఈ ఫోన్ కొనేవారికి మంచి ఆఫర్లను కూడా సంస్థ ప్రకటించింది.

    Facebook Smart Glasses: క‌ళ్ల‌ద్దాల‌తో ఫోన్ మాట్లాడొచ్చు.. అదిరిపోయే ఫీచ‌ర్స్‌తో ఫేస్‌బుక్ స్మార్ట్ కళ్లజోడు


    రియల్ మీ 8s స్మార్ట్ ఫోన్ 6GB RAM, ఇంకా 128GB వేరియంట్ రూ. 17,999  ధరతో, 8GB RAM మరియు 128GB వేరియంట్ రూ.19,999  ధరతో ప్రకటించింది. ఈ ఫోన్ ను realme.com నుంచి ICICI క్రెడిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ EMI అప్షన్ తో కొనేవారికి రూ.1,500ల ఫ్లాట్ డిస్కౌంట్ అఫర్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్టు కూడా అనేకమైన అఫర్లను అందించింది.
    రియల్​మీ 8ఎస్​ ఫీచ‌ర్లు ఇవే..
    రియల్​మీ 8ఎస్​ 5జీ ఫోన్​ మీడియాటెక్​ డైమెన్సిటీ 810 ప్రాసెసర్​తో పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల ఫుల్​ హెచ్​డీ(HD) డిస్​ప్లేను అందించనున్నారు. ఇది 6 జీబీ ర్యామ్​, 8 జీబీ ర్యామ్​ రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. వీటిలో 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్​ను అందించనున్నారు. దీని వెనుకవైపు 64MP ప్రైమరీ కెమెరా, 2MP కెమెరాలు ఉండనున్నాయి. దీని ముందు భాగంలో సెల్ఫీలు(selfie), వీడియో కాలింగ్ కోసం 16MP కెమెరాను అందించనున్నారు. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్(Charging) సపోర్ట్‌తో కూడిన 5,000mAh బ్యాటరీతో రానుంది. ఈ ఫోన్​ యూనివర్స్ పర్పుల్, యూనివర్స్ బ్లూ కలర్(Blue color) అనే రెండు కలర్​ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.ఈ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ లేటెస్ట్ 5G ప్రోసెసర్ Dimensity 810 ఆక్టా కోర్ ప్రోసెసర్ కి జతగా అధిక‌ RAM శక్తితో పనిచేస్తుంది. ఈ ప్రోసెసర్ తో వచ్చిన మొట్టమొదటి ఫోన్ ఇదే అవుతుంది. ఈ ఫోన్ Android 11 ఆధారితంగా RealmeUI 2.0 స్కిన్ పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ EIS వీడియో స్టెబిలైజేషన్ కు మద్దతునిస్తుంది. ముందుభాగంలో సెల్ఫీ కెమెరా కూడా EIS వీడియో స్టెబిలైజేషన్ కు మద్దతునిస్తుంది.
    Published by:Sharath Chandra
    First published: