హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

The Story Of Pegasus: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ‘పెగాసస్‌ స్పైవేర్’.. ఈ పేరు వెనుకున్న కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

The Story Of Pegasus: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ‘పెగాసస్‌ స్పైవేర్’.. ఈ పేరు వెనుకున్న కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారత్‌తో సహా అనేక దేశాలను గడగడలాడిస్తున్న పెగాసస్‌ స్పైవేర్ జర్నలిస్టులు, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతల మొబైల్ ఫోన్లను ఎక్కువగా టార్గెట్ చేస్తోంది. ఇండియాలో చాలా ఫోన్స్ హ్యాక్ అయినట్లు ఇప్పటికే పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. సైబర్ వెపన్ గా ప్రయోగించిన ఈ స్పైవేర్‌ మొబైల్ వినియోగదారుల గోప్యతకు భంగం కలిగిస్తుందని పలు కథనాలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంకా చదవండి ...

భారత్‌తో సహా అనేక దేశాలను గడగడలాడిస్తున్న పెగాసస్‌ స్పైవేర్ జర్నలిస్టులు, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతల మొబైల్ ఫోన్లను ఎక్కువగా టార్గెట్ చేస్తోంది. ఇండియాలో చాలా ఫోన్స్ హ్యాక్ అయినట్లు ఇప్పటికే పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. సైబర్ వెపన్ గా ప్రయోగించిన ఈ స్పైవేర్‌ మొబైల్ వినియోగదారుల గోప్యతకు భంగం కలిగిస్తుందని పలు కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఇజ్రాయెల్‌ ఆధారిత ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ డెవలప్ చేసిన స్పైవేర్‌కి ‘పెగాసస్‌’ అని నామకరణం చేశారు. అయితే, ఈ స్పైవేర్ పేరు ‘పెగాసస్‌’ వెనుకున్న ఆసక్తికర కథ ఏంటో తెలుసుకుందాం.

పెగాసస్‌ అనేది గ్రీకు పురాణాలలో అత్యంత ప్రసిద్ధ చెందిన పౌరాణిక జీవులలో ఒకటి. కరెక్ట్ గా చెప్పాలంటే.. పెగాసస్ గ్రీకు పురాణాలలో పూజించబడే ఒక పౌరాణిక, రెక్కల గుర్రం. ఒక స్పైవేర్ కి రెక్కల గుర్రం పేరు పెట్టడం చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ..! నిజానికి పౌరాణిక రెక్కల గుర్రం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. బాలకృష్ణ చిత్రం భైరవద్వీపం, యానిమేటెడ్ మూవీ హెర్క్యులస్ తదితర చిత్రాల్లో పెగసాస్‌ గుర్రాలను మనం చూడొచ్చు. ఒక్కొక్క సినిమాల్లో ఒక్కొక్క విధంగా పెగాసస్‌ను చూపించారు. గ్రీకు పురాణాల ప్రకారం.. గ్రీకు వీరుడు బెల్లెరోఫోన్ యుద్ధాలకు వెళ్ళినప్పుడు పెగాసస్‌పై స్వారీ చేసేవాడని తెలుస్తోంది.

గ్రీకు సముద్ర దేవుడు పోసిడాన్, గోర్గాన్ మెడుసా దంపతులకు పెగాసస్ గుర్రం జన్మించింది. గ్రీకు పురాణాల్లో గోర్గాన్ మెడుసా రెక్కలు కలిగిన ఒక రాక్షసి. ఈ రాక్షసి తలలో జుట్టుకి బదులుగా అత్యంత విషపూరితమైన పాములు ఉంటాయి. ఐతే గ్రీకుహీరో పెర్సియస్.. గోర్గాన్ మెడుసాను శిరచ్ఛేదనం చేసినప్పుడు ఆ రాక్షసి రక్తం నుంచి పెగాసస్ గుర్రం జన్మించింది. సముద్ర దేవుడు పోసిడాన్ గుర్రం లేదా పక్షి రూపంలో ఉన్న గోర్గాన్ తో శారీరకంగా కలిసినప్పుడు పెగాసస్ జన్మించిందని అంటుంటారు. ఈ గుర్రం తెల్లగా పెద్ద రెక్కలతో చాలా అందంగా జన్మించడంతో దీనిని ఒక పవిత్రమైన గుర్రంగా భావించి పూజించడం ప్రారంభించారు. ఈ గుర్రం ముసెస్ అనే తొమ్మిది మంది గ్రీక్ దేవతలతో జీవించేది. గ్రీకువీరుడు బెల్లెరోఫోన్ దానిని ఎలాగైనా మచ్చిక చేసుకోని సింహం తల, డ్రాగన్ తోక ఉన్న చిమెరా అనే రాక్షసుడిని వధించాలని భావించాడు. దానిని మచ్చిక చేసుకోవడానికి బెల్లెరోఫోన్.. ఎథీనా దేవత నుంచి ఒక బంగారు కళ్ళెమును తీసుకున్నాడు. అనంతరం పెగసాస్ మెడలో బంగారు కళ్ళెమును విసిరాడు. దీంతో ఈ పౌరాణిక గుర్రం బెల్లెరోఫోన్ వశం అయిపోయింది. తర్వాత బెల్లెరోఫోన్ పెగాసస్‌ సహాయంతో చిమెరాను చంపేసి గొప్ప యోధుడిగా కీర్తి ప్రతిష్టలు గడించాడు.




పెగాసస్‌ సాయంతో ఎన్నో యుద్ధాలు చేసి విజయాలు సాధించినా.. బెల్లెరోఫోన్ కి సంతృప్తి కలగలేదు. చివరకు దేవుడు కావాలని భావించిన ఈ గ్రీకు యోధుడు దేవతల నివాసమైన ఒలింపస్ పర్వతం చేరుకోవాలని ప్రయత్నించాడు. పెగాసస్‌ గుర్రంపై అతడు ఒలింపస్ పర్వతం చేరుకుంటుండగా.. జ్యూస్ అనే ప్రధాన గ్రీకు దేవుడు అడ్డ వచ్చాడు. దీనివల్ల పెగాసస్‌ బెల్లెరోఫోన్ విసిరివేసింది. అప్పుడు బెల్లెరోఫోన్ కింద పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. పెగాసస్‌ సహాయంతో ఎంతో మందిని ఓడించిన ఈ గ్రీకువీరుడు చివరికి దాని నుంచే కిందపడి వికలాంగుడిగా మిగిలిపోయాడు. పెగాసస్ మాత్రం‌ జ్యూస్ దేవుడి ఆస్థానంలో మంచి స్థానాన్ని సంపాదించింది. అయితే పెగాసస్‌ ఒక నక్షత్రపుంజము అయిందని అంటుంటారు.

First published:

Tags: Technology

ఉత్తమ కథలు