Home /News /technology /

WhatsApp Reactions: త్వరలోనే వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్.. ఎలా పని చేస్తుందంటే..

WhatsApp Reactions: త్వరలోనే వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్.. ఎలా పని చేస్తుందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొద్ది రోజుల క్రితం వాట్సాప్ మెసేజ్ రియాక్షన్ ఫీచర్ ఇండివిడ్యువల్ చాట్‌తో సహా గ్రూప్ చాట్‌లో కూడా అందుబాటులో ఉంటుందని వాట్సాప్ బీటా ఇన్ఫో పేర్కొంది. అయితే ఇప్పుడు గ్రూప్ చాట్‌లో మీ రియాక్షన్లను తోటి గ్రూప్ సభ్యులందరూ చూడగలుగుతారని తెలిపింది.

ఇంకా చదవండి ...
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) తరుచుగా సరికొత్త ఫీచర్లను జోడిస్తోంది. ఈ అదిరిపోయే ఫీచర్లతో వాట్సాప్ వినియోగదారులు మంచి యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరొక అదిరిపోయే ఫీచర్ తీసుకొచ్చేందుకు వాట్సాప్ (Whatsapp) సన్నాహాలు చేస్తోంది. మెసేజ్ రియాక్షన్ (Message Reaction) అనే ఒక కొత్త ఫీచర్‌ను వాట్సాప్ అభివృద్ధి చేస్తోందని వాబీటాఇన్ఫో తెలిపింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు మెసేజ్ రియాక్షన్ ఫీచర్ పరిచయం చేసేందుకు వాట్సాప్ కృషి చేస్తోంది. మెసేజ్ రియాక్షన్ ఫీచర్‌తో యూజర్లు తమ ఫ్రెండ్స్, స్నేహితులు పంపిన మెసేజ్‌లకు రియాక్ట్ అవ్వచ్చు

ఇప్పటికే ఇలాంటి ఫీచర్‌ ఇన్‌స్టాగ్రామ్ (Instagram), ఫేస్‌బుక్ (Facebook) మెసెంజర్ యాప్స్‌లో అందుబాటులో ఉంది. వాట్సాప్‌‌లో అందుబాటులోకి వచ్చే మెసేజ్ రియాక్షన్ ఫీచర్‌తో ఒక మెసేజ్‌కు ఒక్కసారి రియాక్ట్ అవ్వచ్చు. మొత్తం ఆరు ఎమోజీలు రియాక్షన్స్ గా అందుబాటులో ఉండనున్నాయని తెలుస్తోంది. అయితే మీరు ఒక గ్రూపులో ఏదైనా మెసేజ్‌కు రియాక్ట్ అయినట్లయితే.. ఆ రియాక్షన్ ను గ్రూపులో ఉన్న సభ్యులు అందరూ చూడగలరు. ప్రస్తుతానికి ఒక వాట్సాప్ చాట్‌లో మెసేజ్‌కు రియాక్ట్ కావాలంటే.. ప్రత్యేకంగా ఒక మెసేజ్ పంపించాల్సి వస్తోంది. కానీ ఇప్పుడు వాట్సాప్ తీసుకొస్తున్న మెసేజ్ రియాక్షన్ ఫీచర్‌తో నేరుగా మెసేజ్‌కు ఎమోజీలతో రియాక్ట్ అవ్వొచ్చు

కొద్ది రోజుల క్రితం వాట్సాప్ మెసేజ్ రియాక్షన్ ఫీచర్ ఇండివిడ్యువల్ చాట్‌తో సహా గ్రూప్ చాట్‌లో కూడా అందుబాటులో ఉంటుందని వాట్సాప్ బీటా ఇన్ఫో పేర్కొంది. అయితే ఇప్పుడు గ్రూప్ చాట్‌లో మీ రియాక్షన్లను తోటి గ్రూప్ సభ్యులందరూ చూడగలుగుతారని తెలిపింది. రియాక్షన్ ఇన్ఫో చూడటం ద్వారా మీరు ఏ ఎమోజీతో మెసేజ్‌కు రియాక్ట్ అయ్యారో గ్రూప్ సభ్యులు వ్యూ చేయగలరు. యూజర్లు వాట్సాప్ గ్రూపులోని మెసేజ్ రియాక్షన్‌పై నొక్కిన తర్వాత, వారికి పాప్-అప్ మెనూ కనిపిస్తుంది. ఈ మెనూలో ఆల్ ట్యాబ్ (All Tab) అని పిలిచే ట్యాబ్ ఉంటుంది. ఇది గ్రూపులో ఒక మెసేజ్‌కు వచ్చిన అన్ని రియాక్షన్లను ఆ గ్రూప్ సభ్యులందరికీ చూపిస్తుంది. వాట్సాప్ యూజర్లు ఒక మెసేజ్‌కు ఒకసారి.. మొత్తం ఆరు ఎమోజీలతో రియాక్ట్ కాగలరని నివేదిక చెబుతోంది. యూజర్లు వాట్సాప్ ఎమోజి లైబ్రరీలోని తమకు నచ్చిన ఎమోజీలను మెసేజ్ రియాక్షన్ గా ఎంచుకోవచ్చు

Telangana: ఢిల్లీ నుంచి వచ్చి సైలెంట్ అయిన KCR.. కొత్త ప్లాన్‌.. ఆ తరువాతే అమలు చేస్తారా ?

KCRను మళ్లీ టెన్షన్ పెడుతున్న ఈటల రాజేందర్.. అజ్ఞాతంలోకి ఆ నాయకుడు ?

Salt: మీరు వాడే ఉప్పు మంచిదేనా ? ఇలా చెక్ చేసుకోండి.. చాలా ముఖ్యం

Health Tips: మీరు ఈ రకమైన సమస్యతో బాధపడుతున్నారా ? వెంటనే ఈ కూరగాయలకు దూరంగా ఉండండి

ఇది ఒక ఆప్షనల్ ఫీచర్‌గా యూజర్లకు అందుబాటు వచ్చే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. దీని అర్థం ఈ ఫీచర్ అవసరం లేకపోతే వినియోగదారులు దీన్ని టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ గురించి ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Whatsapp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు