దక్షిణ కొరియా(South Korea) స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శామ్సంగ్(Samsung) త్వరలోనే తన గెలాక్సీ F23 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఈ నెల ప్రారంభంలో, శామ్సంగ్ ఇండియా(Samsung India) తన అధికారిక వెబ్సైట్లో గెలాక్సీ ఎఫ్ 23ని టీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి మార్చి రెండో వారంలో విడుదలవుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. గెలాక్సీ F23 స్నాప్‌డ్రాగన్(Snap Dragon) 700 సిరీస్ 5G చిప్సెట్తో పనిచేస్తుంది. దీని ధర రూ. 20 వేలలోపు ఉండే అవకాశం ఉంది. ఈ ఏడాది భారతదేశంలో లాంచింగ్ కానున్న శామ్సంగ్ మొదటి F సిరీస్ స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే కావడం విశేషం. శామ్సంగ్ నుంచి రాబోయే శామ్సంగ్ గెలాక్సీ F23 లాంచింగ్ డేట్, ధర, స్పెసిఫికేషన్ల (Specifications) వివరాలను పరిశీలిద్దాం.
శామ్సంగ్ గెలాక్సీ F23 ధర..
నివేదికల ప్రకారం, శామ్సంగ్ గెలాక్సీ F23 మార్చి రెండో వారంలో భారతదేశంలో లాంచ్ అవ్వనుంది. శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 23 లాంచింగ్‌పై వివరాలు స్పష్టంగా చెప్పనప్పటికీ, కొత్త ఎఫ్ సిరీస్ ఫోన్ భారతదేశానికి త్వరలోనే వస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. శామ్సంగ్ ఇండియా తన అధికారిక వెబ్సైట్లో ఇటీవల పేర్కొన్న ఏకైక మోడల్ గెలాక్సీ F23. మిడ్‌రేంజ్ ధరలోనే దీనిలో ప్రీమియం ఫీచర్లను అందించనుంది. ధర విషయానికి వస్తే.. శామ్సంగ్ గెలాక్సీ F23 5G ధర రూ. 20,000 లోపే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
శామ్సంగ్ గెలాక్సీ F23 స్పెసిఫికేషన్లు..
త్వరలోనే భారత మార్కెట్లోకి విడుదలకానున్న శామ్సంగ్ గెలాక్సీ F23 5G అనేది ఒక మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్. ఈ స్మార్ట్‌ఫోన్ 5G కనెక్టివిటీకి సపోర్ట్ ఇస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 765G ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఈ చిప్సెట్ Geekbench తాజా లిస్టింగ్‌లో కనిపించింది. ఇది ఆండ్రాయిడ్ 12 OneUI పై పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.4 -అంగుళాల AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది.
ఇక, కెమెరా విషయానికి వస్తే. . దీని వెనుక భాగంలో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించింది. ఇక, సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ప్రత్యేకంగా 13 -మెగాపిక్సెల్ ఫ్రంట్ సెన్సార్ కెమెరాను చేర్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గల 5,000mAh బ్యాటరీతో వస్తుంది. తద్వారా నిమిషాల వ్యవధిలోనే ఫోన్‌ను ఫుల్ ఛార్జ్ చేయవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Smartphone