RBI: పేటీఎం, ఫోన్‌పే యూజర్లకు గుడ్ న్యూస్... కొత్త వ్యవస్థతో మీ సమస్యలకు పరిష్కారం దొరికినట్టే

RBI | ఆర్‌బీఐ ప్రవేశపెట్టిన అంబుడ్స్‌మన్‌తో పాటు ప్రతీ వ్యాలెట్ సంస్థలో ఇంటర్నల్ అంబుడ్స్‌మన్ ఉండాలని ఆర్‌బీఐ ఆదేశించింది.

news18-telugu
Updated: October 4, 2019, 6:40 PM IST
RBI: పేటీఎం, ఫోన్‌పే యూజర్లకు గుడ్ న్యూస్... కొత్త వ్యవస్థతో మీ సమస్యలకు పరిష్కారం దొరికినట్టే
RBI: పేటీఎం, ఫోన్‌పే యూజర్లకు గుడ్ న్యూస్... కొత్త వ్యవస్థతో మీ సమస్యలకు పరిష్కారం దొరికినట్టే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: October 4, 2019, 6:40 PM IST
వ్యాలెట్ యూజర్ల సమస్యల్ని పరిష్కరించేందుకు ఇంటర్నల్ అంబుడ్స్‌మన్ ఏర్పాటు చేయాలని పేటీఎం, ఫోన్‌పే వ్యాలెట్ సంస్థలకు ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం జరిగిన సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఈ ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం ఇండియాలో పేటీఎం, ఫోన్‌పే, మొబీక్విక్, పేయూ, అమెజాన్ పే లాంటి వ్యాలెట్స్ ఉన్నాయి. వీటి వ్యాపారం రోజురోజుకూ పెరుగుతోంది. వినియోగదారులూ పెరుగుతున్నారు. వాటితో పాటు కస్టమర్ల ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయి. అనేక మోసాలు, అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. అందుకే కస్టమర్ల సమస్యల్ని వేగంగా పరిష్కరించేందుకు ఇంటర్నల్ అంబుడ్స్‌మన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది జనవరిలోనే అంబుడ్స్‌మన్ స్కీమ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 2019 ప్రవేశపెట్టింది. వ్యాలెట్ సంస్థల నుంచి ఏవైనా సేవా లోపాలు ఉంటే వాటిపై ఫిర్యాదులు చేయడానికి, వాటిని పరిష్కరించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యంత్రాంగమే అంబుడ్స్‌మన్ స్కీమ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్. అయితే ఆర్‌బీఐ ప్రవేశపెట్టిన అంబుడ్స్‌మన్‌తో పాటు ప్రతీ వ్యాలెట్ సంస్థలో ఇంటర్నల్ అంబుడ్స్‌మన్ ఉండాలని ఆర్‌బీఐ ఆదేశించింది.

ఆర్‌బీఐ ప్రవేశపెట్టిన అంబుడ్స్‌మన్ ఆన్‌లైన్‌లో చేసే డిజిటల్ ట్రాన్సాక్షన్లపై కంప్లైంట్లకు మాత్రమే పరిమితం. వ్యాలెట్‌లో డబ్బులు వ్యాలెట్‌లో కనిపించకపోయినా, నిర్ణీత సమయంలో రీఫండ్ చేయకపోయినా, రీఫండ్ చేసేందుకు నిరాకరించినా, లావాదేవీలను తిరస్కరించినా, రద్దు చేసినా కంప్లైంట్ ఇవ్వొచ్చు. ఆన్‌లైన్ పేమెంట్‌లో జాప్యం జరిగినా, మీరు డబ్బులు చెల్లించినా అవతలివాళ్లకు చేరకపోయినా, పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయినప్పుడు మీ డబ్బులు మీకు తిరిగిరాకపోతే ఫిర్యాదు చేయొచ్చు. మీరు ట్రాన్స్‌ఫర్ చేసిన డబ్బులు లబ్ధిదారులకు చేరకపోతే అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించొచ్చు.

Vivo S1: వివో ఎస్1 కొత్త వేరియంట్ రిలీజ్... ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

Good News: ఆటో డ్రైవర్లకు శుభవార్త... రూ.10,000 పథకానికి దరఖాస్తు గడువు పెంపు

Reliance Offers: రిలయెన్స్ డిజిటల్‌లో 'ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్'... కేజీ బంగారం గెలుచుకునే ఛాన్స్
Loading...
Good News: కేబుల్ టీవీ యూజర్లకు శుభవార్త... రూ.130 చెల్లిస్తే 150 ఛానెళ్లు
First published: October 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...