Chandrayaan 2 | చంద్రయాన్ 2 ప్రయోగంపై రాకేశ్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

చంద్రయాన్ 2 ఉపగ్రహంపై అంతరిక్షంలోకి వెళ్లిన తొలి, ఒకే ఒక్క భారతపౌరుడు రాకేష్ శర్మ పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు.

news18-telugu
Updated: September 6, 2019, 11:13 PM IST
Chandrayaan 2 | చంద్రయాన్ 2 ప్రయోగంపై రాకేశ్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
రాకేష్ శర్మ, చంద్రయాన్ 2
news18-telugu
Updated: September 6, 2019, 11:13 PM IST
చంద్రయాన్ 2 ప్రయోగంలో చరిత్రాత్మక ఘట్టానికి మరికొన్ని గంటలు మిగిలి ఉన్నాయి. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 2 లోని ల్యాండర్ విక్రమ్ శనివారం (శుక్రవారం అర్ధరాత్రి ) 1.30 నుంచి 2.30 మధ్య చంద్రుడి దక్షిణ ధ్రువం మీద అడుగుపెట్టబోతోంది. ఇస్రో శాస్త్రవేత్తలు సాఫ్ట్ ల్యాండింగ్ చేయనున్నారు. ఈ అద్భుత ఘట్టం కోసం ఇస్రో ఎంతో ఉత్కంఠగాతో ఎదురుచూస్తోంది. అయితే, చంద్రయాన్ 2 విజయవంతం అయితే, ఏం జరుగుతుంది? చంద్రుడి మీద నీటి ఆనవాళ్లను గుర్తిస్తే ఏమవుతుంది? ఇలాంటి ప్రశ్నలు చాలా మందికి ఉన్నాయి. అయితే, వాటిపై స్పందించారు రాకేష్ శర్మ. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి, ఒకే ఒక్క భారతపౌరుడు రాకేష్ శర్మ. టైమ్స్ నౌకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘చంద్రుడి మీద నీరు ఉంటుందన్న విషయాన్ని చంద్రయాన్ 1 ఎప్పుడో గుర్తించింది. అయితే, తక్కువ ఉష్ణోగ్రతలు ఉండే ప్రదేశంలో చంద్రయాన్ 2 దిగుతోంది. బహుశా అక్కడ మంచుని గుర్తించే అవకాశం ఉంది. ఒకవేళ నీరు ఉన్నట్టు గుర్తిస్తే చంద్రుడు నివాసయోగ్యమైన ప్రాంతంగా మారుతుంది. మరింత లోతైన పరిశోధనలు చేయడానికి ఆస్కారం లభిస్తుంది. హీలియం లాంటి గ్యాస్ ఉందో లేదో కూడా చెక్ చేయడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ అక్కడ నీరు గనుక గుర్తిస్తే అది కచ్చితంగా చేరుకునే గమ్యస్థానం అవుతుంది.’ అని అన్నారు.

First published: September 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...