Home /News /technology /

Twitter alternative Koo: ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా కూ యాప్... పది లక్షలకు పైగా డౌన్‌లోడ్స్

Twitter alternative Koo: ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా కూ యాప్... పది లక్షలకు పైగా డౌన్‌లోడ్స్

Twitter alternative Koo: ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా కూ యాప్... పది లక్షలకు పైగా డౌన్‌లోడ్స్

Twitter alternative Koo: ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా కూ యాప్... పది లక్షలకు పైగా డౌన్‌లోడ్స్

Twitter alternative Koo App | ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా ఇండియాలో కూ యాప్ పాపులర్ అవుతోంది. కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌తో పాటు ఇతర మంత్రులు ఈ యాప్ ఉపయోగిస్తున్నారు. అసలు ఈ యాప్ ప్రత్యేకత ఏంటీ? ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి? తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
గత ఏడాది ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన ఆత్మనిర్భర్ భారత్ పిలుపుతో స్థానిక డెవలపర్లు దేశీయంగా కొత్తరకం యాప్‌లను అభివృద్ధి చేస్తున్నారు. విదేశీ సోషల్ నెట్‌వర్క్‌ ప్లాట్‌ఫాంలకు పోటీగా వీటిల్లో కొన్నింటికి ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే వాట్సాప్‌కు పోటీగా సందేశ్ అనే కొత్త యాప్‌ను ప్రభుత్వం రూపొందించింది. దీన్ని కొంతమంది అధికారులు పరీక్షిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా ‘Koo’ అనే కొత్త యాప్‌ను మన దేశంలో లక్షలాది మంది డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఈ ఇండియన్ సోషల్ నెట్ వర్కింగ్ యాప్‌ను పలువురు ప్రముఖులు కూడా వాడుతున్నారు. కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, పీయూష్ గోయల్ వంటి వారు ఇప్పటికే Kooలో అకౌంట్ ఓపెన్ చేశారు. వాట్సాప్, ట్విట్టర్‌ వంటి విదేశీ నెట్‌వర్క్‌లకు బదులుగా మన దేశంలోనే రూపొందిన ఇలాంటి కొత్త యాప్‌లను వాడటం మంచిదని చాలామంది యూజర్లు భావిస్తున్నారు.

Password: అలర్ట్... ఈ 20 పాస్‌వర్డ్స్ ఉపయోగిస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ

ఇండియాలో లాంఛ్ అయిన Nokia 5.4, Nokia 3.4 స్మార్ట్‌ఫోన్స్... ధర, స్పెసిఫికేషన్స్ ఇవే

Koo ప్రత్యేకతలేంటి?


ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా భారత్‌లో Kooను అభివృద్ధి చేశారు. ఈ ఇండియన్ మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్‌ను 2020 మార్చిలో అందుబాటులోకి తీసుకువచ్చారు. అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్ బిదావత్కా అనే ఇద్దరు వ్యక్తులు దీని సృష్టికర్తలు. ట్విట్టర్‌లో ఉన్న అన్ని ఫీచర్లూ దీంట్లో కూడా ఉన్నాయి. ఈ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాంలో వివిధ అంశాలపై అభిప్రాయాలను పంచుకోవచ్చు. 2020 ఆగస్టులో భారత ప్రభుత్వం నిర్వహించిన ఆత్మనిర్భర్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌ను Koo గెల్చుకోవడం విశేషం.

ఈ యాప్‌ దేశంలోని వివిధ ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులో ఉంటుంది. Kooలో హిందీ, తెలుగు, కన్నడ, బెంగాలీ, తమిళం, మలయాళం, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, ఒరియా, అస్సామీ భాషల్లో పోస్టులు రాయవచ్చు. Koo వినియోగదారులు పోస్ట్‌లు, ఆడియో, వీడియో, ఫోటోలను షేర్ చేయవచ్చు. వివిధ రకాల పోల్స్ కూడా నిర్వహించవచ్చు. DMల ద్వారా చాటింగ్ చేసుకోవచ్చు.

Vodafone Idea: వొడాఫోన్ ఐడియా-Vi యూజర్లకు 50 జీబీ ఎక్స్‌ట్రా డేటా... వారికి మాత్రమే

mAadhaar యాప్ వాడుతున్నవారికి అలర్ట్... డిలిట్ చేసి మళ్లీ ఇన్‌స్టాల్ చేయండి... ఎందుకంటే

ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?


Koo యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లో అందుబాటులో ఉంది. ఐఫోన్, ఆండ్రాయిడ్ డివైస్‌లలో దీన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌కు గూగుల్ ప్లే స్టోర్లో 4.7 స్టార్ రేటింగ్ ఉంది. iOS యాప్ స్టోర్‌లో 4.1 రేటింగ్ పొందింది. 49,400 రివ్యూలతో, పది లక్షలకు పైగా డౌన్లోడ్‌లతో Koo యాప్ దూసుకుపోతోంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Koo App, Mobile App, Playstore, Twitter

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు