రైల్వేలో అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులందరి కోసం ప్రత్యేకంగా ఓ యాప్ రూపొందించింది. HRMS Employee Mobile App for Indian Railways పేరుతో సరికొత్త యాప్‌ను రిలీజ్ చేసింది. కొంతకాలంగా బీటా టెస్టింగ్‌లో ఉన్న హెచ్ఆర్ఎంఎస్ యాప్‌ను రైల్వే బోర్డ్ ఛైర్మన్ వీకే యాదవ్ అధికారికంగా రిలీజ్ చేశారు. ఇండియన్ రైల్వేస్‌కు సాంకేతిక సహకారం అందిస్తున్న సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ రూపొందించిన యాప్ ఇది. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కేవలం భారతీయ రైల్వే ఉద్యోగులు మాత్రమే ఈ యాప్‌ను యాక్సెస్ చేయగలరు. 2.3 ఎంబీ సైజ్ ఉన్న ఈ యాప్‌ను ఇప్పటికే 1,00,000 మందికి పైగా రైల్వే ఉద్యోగులు డౌన్‌లోడ్ చేయడం విశేషం.
HRMS Mobile App launched today by Chairman Railway Board, Shri V K Yadav. All employees of IR can now see data related to their service and communicate with administration for any changes, if required. Available on Google Play Store - HRMS Employee Mobile App for Indian Railways pic.twitter.com/hxF09PeDsB
— Ministry of Railways (@RailMinIndia) February 20, 2020
ఇండియన్ రైల్వేస్ హెచ్ఆర్ఎంఎస్ ఎంప్లాయీ మొబైల్ యాప్‌లో రైల్వే ఉద్యోగులకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఈ యాప్‌ను ఉపయోగించాలంటే రైల్వే ఉద్యోగులు IPAS No / PF No ఎంటర్ చేయాలి. వారి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి. మొబైల్ నెంబర్ అప్‌డేట్ లేనివాళ్లు తమ ఆఫీసులోని క్లర్క్ ద్వారా ఈ మొబైల్ యాప్ యాక్సెస్ పొందొచ్చు. ప్రతీ ఉద్యోగికి హెచ్ఆర్ఎంఎస్ ఐడీ లభిస్తుంది. ఆ ఐడీతో ఈ యాప్‌ను యాక్సెస్ చేయొచ్చు. ఈ యాప్‌లో ఉద్యోగులు తమ సర్వీస్‌కు సంబంధించిన మొత్తం డేటా చూడొచ్చు ఏవైనా మార్పుచేర్పులుంటే సంబంధిత కార్యాలయానికి సూచించొచ్చు.
ఇవి కూడా చదవండి:
Rail Madad: రైలు ప్రయాణంలో సమస్యలా? ఈ యాప్‌లో కంప్లైంట్ ఇవ్వండి
Aadhaar Address Update: ఆధార్ సెంటర్‌కు వెళ్లకుండా ఆధార్ కార్డులో అడ్రస్ మార్చండి ఇలా
SIM Swap: మీ బ్యాంకు అకౌంట్లు ఖాళీ చేసే మోసాన్ని అడ్డుకోండి ఇలా
Redmi Note 8 Pro: గుడ్ న్యూస్... రెడ్‌మీ నోట్ 8 ప్రో ధర తగ్గింది
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Railway, Indian Railways, Mobile App, Railways, Technology