భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. భారతదేశంలో 6,102 రైల్వే స్టేషన్లలో ఉచితంగా వైఫై సేవల్ని అందిస్తున్న రైల్‌టెల్ 100 రైల్వే స్టేషన్లలో ప్రధాన మంత్రి వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్‌ఫేస్ (PM-WANI) స్కీమ్ ద్వారా వైఫై సేవల్ని ప్రారంభించింది. ఇది రైల్వే ప్రయాణికులకు సులభంగా వైఫై సేవల్ని అందించడానికి ఉపయోగించే సర్వీస్. దశలవారీగా ఈ సర్వీస్‌ను 6,102 రైల్వే స్టేషన్లలో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది రైల్‌టెల్. ఇప్పటికే ఈ రైల్వేస్టేషన్లలో వైఫై సదుపాయం ఉన్న సంగతి తెలిసిందే. జూన్ 10 నాటికి 1000 రైల్వే స్టేషన్లలో, జూన్ 20 నాటికి 3000 రైల్వే స్టేషన్లలో, జూన్ 30 నాటికి 6,102 రైల్వే స్టేషన్లలో పీఎం వాణి స్కీమ్ కవర్ కానుంది. వైఫై నెట్వర్క్ యాక్సెస్ చేయడానికి Wi-DOT ఆండ్రాయిడ్ యాప్ ఉపయోగించాలి. ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది.
పీఎం వాణి స్కీమ్ విషయానికి వస్తే ఇది భారత ప్రభుత్వానికి చెందిన టెలికామ్ డిపార్ట్‌మెంట్ ప్రతిష్టాత్మక కార్యక్రమం. వైఫై ఉపయోగించడంలో సౌలభ్యం కోసం, అన్ని వైఫై నెట్‌వర్క్‌లను కనెక్ట్ చేయడానికి, ప్రజలకు బ్రాడ్‌బ్యాండ్ వినియోగాన్ని విస్తరించడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. రైల్‌టెల్ దేశంలోని అత్యంత విస్తృతమైన ఇంటిగ్రేటెడ్ వైఫై నెట్‌వర్క్ ఉన్న సంస్థ. రైల్‌టెల్ వైఫై వినియోగదారులకు పీఎం వాణి స్కీమ్ ఉపయోగపడుతుంది. పీఎం వాణి స్కీమ్‌లో ఈ నెట్వర్క్ కీలక పాత్ర పోషిస్తుంది.
Indian Railways: రైళ్లల్లో కొత్తగా 'బేబీ బెర్త్'... పసిపిల్లల కోసం ప్రత్యేకం (Photos)
Indian Railways' PSU Railtel has launched Prime Minister Wi-Fi Access Network Interface (PM-WANI) scheme-based access of its public WiFi services across 100 Railway Stations.https://t.co/DIivQHL0LV
— Ministry of Railways (@RailMinIndia) May 10, 2022
ప్రస్తుతం రైల్వే స్టేషన్లలో వైఫై నెట్వర్క్ ఉపయోగించాలంటే ఓటీపీ అవసరం అవుతుంది. అయితే పీఎం వాణి స్కీమ్ ద్వారా కేవైసీ ప్రాసెస్ సులభం అవుతుంది. ఓటీపీ కూడా అవసరం లేదు. Wi-DOT యాప్ ద్వారా సులువుగా వైఫై యాక్సెస్ చేయొచ్చు. పబ్లిక్ వైఫై ఉపయోగించే ప్రతీసారి ఓటీపీ ఎంటర్ చేయాల్సిన శ్రమను తగ్గిస్తుంది.
Android Smartphones: ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఉందా? ఇక ఈ ఫీచర్ వాడుకోలేరు
రైల్‌టెల్ దేశంలోని 6102 రైల్వే స్టేషన్లలో 17,792 వైఫై హాట్‌స్పాట్స్‌ని ఏర్పాటు చేసింది. మరిన్ని వైఫై హాట్‌స్పాట్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. కరోనా కన్నా ముందు ప్రతీ రోజూ 1.2 మిలియన్ యునిక్ యూజర్లు ఈ వైఫై సేవల్ని ఉఫయోగించుకోవడం విశేషం. రైల్‌టెల్ మొదటి 30 నిమిషాలు ఉచితంగా వైఫై అందిస్తోంది. ఆ తర్వాత పెయిడ్ వైఫై వాడుకోవాలి.
మీరు ఉన్న రైల్వేస్టేషన్ పీఎం వాణి స్కీమ్‌లో కవర్ అయితే Wi-DOT ఆండ్రాయిడ్ యాప్ ద్వారా సులువుగా వైఫై యాక్సెస్ చేయొచ్చు. లేదంటే మీ స్మార్ట్‌ఫోన్‌లో వైఫై ఆన్ చేసి స్కాన్ చేయాలి. ఫ్రీ వైఫై ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్‌తో రిజిస్ట్రేషన్ చేయాలి. మీ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి 30 నిమిషాలు ఫ్రీగా వైఫై వాడుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Free wifi, Indian Railways, Railways, Wifi