Apps: ఈ 29 యాప్స్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయా? అయితే జాగ్రత్త

Apps | మీరు వీటిలో ఏదైనా యాప్ ఉపయోగిస్తున్నట్టైతే వెంటనే డిలిట్ చేయండి. ఈ యాప్స్‌తో మీ ఫోన్ బ్యాటరీ కూడా ఎక్కువగా ఖర్చైపోతుంది.

news18-telugu
Updated: September 27, 2019, 11:26 AM IST
Apps: ఈ 29 యాప్స్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయా? అయితే జాగ్రత్త
Apps: ఈ 29 యాప్స్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయా? అయితే జాగ్రత్త (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 27, 2019, 11:26 AM IST
గూగుల్ ప్లే స్టోర్‌లో మరో 29 హానికరమైన యాప్స్ బయటపడటం స్మార్ట్‌ఫోన్ యూజర్లలో కలకలం రేపుతోంది. ఈ 29 యాప్స్‌ని కోటిసార్లు డౌన్‌లోడ్ చేసుకున్నట్టు లెక్కతేలింది. క్విక్‌హీల్ సెక్యూరిటీ ల్యాబ్స్ ఈ విషయాన్ని గుర్తించింది. వెంటనే అప్రమత్తమైన గూగుల్ ప్లేస్టోర్ నుంచి 29 యాప్స్‌ని తొలగించింది. అయితే ఇప్పటికే ఈ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకున్నవారు వెంటనే డిలిట్ చేయడం మంచిది. ఐకాన్ డ్రాగ్ చేసి అన్‌ఇన్‌స్టాల్ చేయడం కుదరదు. సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఈ యాప్స్‌ని తొలగించాల్సి ఉంటుంది. వీటిలో అడ్వర్టైజ్‌మెంట్స్‌తో విసిగెత్తించే 'యాడ్‌వేర్' కేటగిరీ యాప్స్ 5 ఉన్నాయి. యూజర్లు యూట్యూబ్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా యాప్స్ ఓపెన్ చేసిన ప్రతీసారి యాడ్స్‌తో చిరాకు తెప్పిస్తుంటాయి. క్విక్‌హీల్ సెక్యూరిటీ ల్యాబ్స్ గుర్తించిన 29 హానికరమైన యాప్స్ జాబితాను ఈ కింద చార్ట్‌లో చూడండి.

29 malicious apps, Fake apps, Quick Heal Security Labs, Google Play Store, malicious apps, Virus apps, 29 హానికర యాప్స్, ఫేక్ యాప్స్, క్విక్ హీల్ సెక్యూరిటీ ల్యాబ్స్, గూగుల్ ప్లే స్టోర్, హానికర యాప్స్, వైరస్ యాప్స్
Source: Quick Heal Security Labs


మీరు వీటిలో ఏదైనా యాప్ ఉపయోగిస్తున్నట్టైతే వెంటనే డిలిట్ చేయండి. ఈ యాప్స్‌తో మీ ఫోన్ బ్యాటరీ కూడా ఎక్కువగా ఖర్చైపోతుంది. ఇకపై మీరు ఏదైనా యాప్ డౌన్‌లోడ్ చేయాలనుకుంటే ముందుగా యాప్ డిస్క్రిప్షన్ చూడండి. యాప్ డెవలపర్ పేరు, వెబ్‌సైట్ చెక్ చేయండి. ఏదైనా అనుమానం ఉంటే అలాంటి యాప్స్ డౌన్‌లోడ్ చేయకపోవడమే మంచిది. యాప్ రివ్యూ, రేటింగ్స్ కూడా చూడొచ్చు. అయితే ఇవి కూడా నకిలీవి ఉండే ప్రమాదముంది. థర్డ్ పార్టీ యాప్ స్టోర్స్ నుంచి యాప్స్ డౌన్‌లోడ్ చేయొద్దు. గూగుల్ ప్లే లాంటి అఫీషియల్ స్టోర్స్ నుంచే యాప్స్ డౌన్‌లోడ్ చేయాలి. ఫోన్‌లో ‘Unknown Sources’ డిసేబుల్ చేయడం మంచిది.

Vivo U10: అదిరిపోయే ఫీచర్లతో వివో యూ10 రిలీజ్... ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

Smartphone offer: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.10,000 లోపు బెస్ట్ 20 స్మార్ట్‌ఫోన్లు ఇవే...
Loading...
Redmi offers: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రెడ్‌మీ ఫోన్లపై ఆఫర్లు ఇవే...

Realme Offers: ఫెస్టివల్ సేల్‌లో రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్ ఇవే
First published: September 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...