గుడ్ న్యూస్... స్మార్ట్‌ఫోన్‌ను 5 నిమిషాల్లో 50% ఛార్జ్ చేసే కొత్త టెక్నాలజీ

Qualcomm Quick Charge 5 | మీ స్మార్ట్‌ఫోన్ పూర్తిగా ఛార్జింగ్ చేయాలంటే ఎంత సమయం పడుతుంది. కనీసం గంట అయిన సమయం పడుతుంది కదా. కానీ 5 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ చేయగల సరికొత్త టెక్నాలజీని రూపొందించింది క్వాల్కమ్.

news18-telugu
Updated: July 30, 2020, 6:26 PM IST
గుడ్ న్యూస్... స్మార్ట్‌ఫోన్‌ను 5 నిమిషాల్లో 50% ఛార్జ్ చేసే కొత్త టెక్నాలజీ
గుడ్ న్యూస్... స్మార్ట్‌ఫోన్‌ను 5 నిమిషాల్లో 50% ఛార్జ్ చేసే కొత్త టెక్నాలజీ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు శుభవార్త. ఫోన్‌లో ఛార్జింగ్ ఎక్కువ సేపు ఉండట్లేదని, త్వరగా బ్యాటరీ ఖాళీ అయిపోతుందని బాధపడేవారికి గుడ్ న్యూస్. మీ ఫోన్‌లో బ్యాటరీ మొత్తం ఖాళీల అయిపోయినా కేవలం 5 నిమిషాల్లో 50% ఛార్జింగ్ చేసే సరికొత్త టెక్నాలజీని టెక్ దిగ్గజం క్వాల్కమ్ రూపొందించింది. ఇప్పటికే రియల్‌మీ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 20 నిమిషాల్లో 100 పర్సెంట్ ఛార్జ్ చేసే ఛార్జింగ్ సొల్యూషన్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఒప్పో కూడా ఇలాంటి టెక్నాలజీని పరిచయం చేసింది. ఇప్పుడు క్వాల్కమ్ కూడా క్విక్ ఛార్జ్ 5 పేరుతో ఫాస్ట్ ఛార్జింగ్ సొల్యూషన్‌ను రూపొందించింది. ఇప్పటికే క్వాల్కమ్ క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీ స్మార్ట్‌ఫోన్లలో ఉంది. 2017లో క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 4+ టెక్నాలజీని పరిచయం చేసింది. ఇప్పుడు క్విక్ ఛార్జ్ 5 టెక్నాలజీని ప్రకటించింది.

Vivo V19: ఈ ఫోన్ ధర రూ.4,000 తగ్గింది... ఇప్పుడు ఎంతంటే

Samsung Galaxy M31s: భారీ బ్యాటరీతో సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ రిలీజ్... ధర ఎంతో తెలుసా?

Quick Charge 5, Quick Charge 5 features, Qualcomm Quick Charge 5, Qualcomm fast charging tech, Qualcomm fast charging technology, Realme 125W UltraDART charging, Oppo fast charging, క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 5, క్విక్ ఛార్జ్ 5 ఫీచర్స్, క్వాల్కమ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, రియల్‌మీ ఫాస్ట్ ఛార్జింగ్
ప్రతీకాత్మక చిత్రం


క్వాల్కమ్ చెబుతున్న వివరాల ప్రకారం క్విక్ ఛార్జ్ 5 టెక్నాలజీతో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ గల స్మార్ట్‌ఫోన్‌ను 0 నుంచి 50 శాతానికి కేవలం 5 నిమిషాల్లో ఛార్జ్ చేయొచ్చు. "ప్రపంచంలో వాణిజ్యపరంగా ఆచరణీయమైన వేగవంతమైన మొట్టమొదటి ఛార్జింగ్ ప్లాట్‌ఫాం ఇదే. 100వాట్ కన్నా ఎక్కువ ఛార్జింగ్ పవర్‌ సపోర్ట్ చేస్తుంది" అని క్వాల్కమ్ ప్రకటించింది. క్విక్ ఛార్జ్ 4 కన్నా క్విక్ ఛార్జ్ 5 టెక్నాలజీ 70 శాతం ఎక్కువ సమర్థవంతమైనదని, క్విక్ ఛార్జ్ 1 తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా పవర్ డెలివరీ ఉంటుందని ప్రకటించింది. క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 5 టెక్నాలజీలో క్వాల్కమ్ బ్యాటరీ సేవర్, స్మార్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అడాప్టర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. దీని వల్ల బ్యాటరీ లైఫ్ సైకిల్ ఎక్కువగా ఉంటుంది.
Published by: Santhosh Kumar S
First published: July 30, 2020, 6:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading