ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 120 కిలోమీటర్లు ప్రయాణించే బైక్స్ వచ్చేశాయి..

త్వరలోనే మార్కెట్లోకి ఎలక్ట్రిసిటీ బైక్స్ రానున్నాయి. వీటిని ఒక్కసారి ఛార్జింగ్ పెట్టి 120 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు.

news18-telugu
Updated: April 30, 2019, 2:19 PM IST
ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 120 కిలోమీటర్లు ప్రయాణించే బైక్స్ వచ్చేశాయి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన అంకుర సంస్థ ‘ప్యూర్ ఈవీ’ ఎలక్ట్రిసిటీ బైక్స్‌ని అందుబాటులోకి తీసుకొస్తుంది. పర్యావరణ హితంగా.. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం వెళ్లడమే లక్ష్యంగా ఈ బైక్స్‌ని రూపొందించింది ‘ప్యూర్ ఈవీ’ఇప్పటికే ఈ సంస్థ నగర శివారులోని సంగారెడ్డి జిల్లా కంది మండలంలో 18వేల చదరపు అడుగుల్లో పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నెలరోజుల్లోనే ఈ బైక్స్ అమ్మకాలు దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి.

ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి, బ్యాటరీలదే కీలక పాత్ర. ఇదే ప్రధానంగా భావించిన ప్యూర్ ఈవీ ఐఐటీ హైదరాబాద్‌తో కలిసిపనిచేస్తోంది. ఎలాంటి వతావరణ పరిస్థితుల్లోనైనా సమర్థంగా పనిచేసే లిథియం అయాన్ బ్యాటరీలను రూపొందించినట్లు సంస్థ వ్యవస్థాపకులు తెలిపారు. ఈ బైక్స్ నాలుగు గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతాయని, ఒక్కసారి చేస్తే 120 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని తెలిపరాు. కిలోమీటర్ ప్రయాణానికి కేవలం 5పైసలు మాత్రమే ఖర్చవుతుందన్నారు. మార్కెట్లో వీటి ధర రూ. 30,000 నుంచి రూ.70,000 వరకు ఉండొచ్చని తెలిపారు.

First published: April 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు