భారతదేశంలో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) ట్రెండ్ కొనసాగుతోంది. మార్కెట్లోకి కొత్తకొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు వస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ ప్యూర్ ఈవీ (PURE EV) సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ (Electric Motorcycle) లాంఛ్ చేసింది. ప్యూర్ ఈవీ ఇకోడ్రిఫ్ట్ (PURE EV ecoDryft) పేరుతో ఎలక్ట్రిక్ బైక్‌ను లాంఛ్ చేసింది. ఇది హైదరాబాద్‌లో తయారు చేసిన బైక్. హైదరాబాద్‌లోని ప్యూర్ ఈవీ టెక్నికల్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్‌లో డిజైన్ చేసి, ఈ బైక్‌ను రూపొందించడం విశేషం.
ప్యూర్ ఈవీ ఇకోడ్రిఫ్ట్ ఎలక్ట్రిక్ బైక్ ధర చూస్తే ఢిల్లీలో ఎక్స్ షోరూమ్ ధర రూ.99,999. ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో కలిపి ఈ ధరలో లభిస్తుంది ప్యూర్ ఈవీ ఇకోడ్రిఫ్ట్ ఎలక్ట్రిక్ బైక్ . ఈ ధర వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉంటుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ, ఆర్‌టీఓ ఫీజులపై ధర ఆధారపడి ఉంటుంది. ఈ ధర రాష్ట్రాన్ని బట్టి రూ.1,14,999 వరకు వెళ్లొచ్చు.
New Rules in Goa: గోవా వెళ్లేవారికి షాక్... ఆ తప్పు చేస్తే రూ.50,000 ఫైన్
Get ready to dominate the streets with the all-new electric bike PURE ecoDryft. With its aggressive look and durable build, this bike is perfect for urban warriors. Head over to our website to discover more at https://t.co/GkXQPp5J2N#PUREEV #ecoDryft #ev #electricmotorcycle pic.twitter.com/mL5qwS4vZm
— PURE EV (@pureevindia) January 19, 2023
ప్యూర్ ఈవీ ఇకోడ్రిఫ్ట్ ఎలక్ట్రిక్ బైక్‌లో 3.0 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ బైక్‌ను ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 85 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 135 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుంది. గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. 20 నుంచి 80 శాతం వరకు కేవలం మూడు గంటల్లో ఛార్జ్ అవుతుంది. 0 నుంచి 100 శాతం వరకు 6 గంటల్లో ఛార్జ్ అవుతుంది. కిలోమీటర్‌కు కేవలం 25 పైసల ఖర్చుతో ప్రయాణించవచ్చు.
SBI Scheme: ఎస్‌బీఐ స్కీమ్... మీ అకౌంట్‌లోకి ప్రతీ నెలా డబ్బులు
ప్యూర్ ఈవీ ఇకోడ్రిఫ్ట్ ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. మొదటి బ్యాచ్ వాహనాలను కస్టమర్లకు మార్చి మొదటి వారం నుంచి డెలివరీ చేస్తామని కంపెనీ చెబుతోంది. బ్లాక్, గ్రే, బ్లూ, రెడ్ కలర్స్‌లో ఈ బైక్ కొనొచ్చు. ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో యాంటీ థెఫ్ట్, స్మార్ట్ లాక్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. 140 కిలోల వరకు లోడ్ తీసుకెళ్లగలదు. ఇందులో 3 డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. డ్రైవ్ మోడ్‌లో గంటకు 45 కిలోమీటర్లు, క్రాస్ ఓవర్ మోడ్‌లో గంటకు 60 కిలోమీటర్లు, థ్రిల్ మోడ్‌లో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని 5 సెకండ్లలో, 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని 10 సెకండ్లలో అందుకోవచ్చు.
ఇప్పటికే టెస్ట్ రైడ్స్ ప్రారంభించింది కంపెనీ. దేశంలోని 100 పైగా డీలర్‌షిప్స్ దగ్గర డెమో వాహనాలు గత రెండు నెలలుగా అందుబాటులో ఉన్నాయని, కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని కంపెనీ చెబుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto News, Electric bike, Electric Vehicle, Two wheeler