Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Battlegrounds Mobile India: బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ నిషేధించాలని హైకోర్టులో పిల్

Battlegrounds Mobile India: బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ నిషేధించాలని హైకోర్టులో పిల్

Battlegrounds Mobile India: బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ నిషేధించాలని హైకోర్టులో పిల్
(ప్రతీకాత్మక చిత్రం)

Battlegrounds Mobile India: బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ నిషేధించాలని హైకోర్టులో పిల్ (ప్రతీకాత్మక చిత్రం)

Battlegrounds Mobile India | బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ నిషేధించాలని తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది. హైదరాబాద్‌కి చెందిన ఓ న్యాయవాది ఈ వ్యాజ్యాన్ని హై కోర్టులో దాఖలు చేశారు. దీనిపై మార్చిలో విచారణ జరగనుంది.

ఇంకా చదవండి ...

బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాకి (Battlegrounds Mobile India) వీడియో గేమ్ యాప్‌ని నిలిపివేయాలని అభ్యర్ధిస్తూ తెలంగాణ హై కోర్టులో (Telangana High Court) ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దానికి సంబంధించిన కంప్యూటర్, మొబైల్ ఆటలన్నింటినీ తొలగించాలని కోర్టును ఆశ్రయించారు. హైదరాబాద్‌కి చెందిన న్యాయవాది అనిల్ స్టెవెన్సన్ జంగం ఈ వ్యాజ్యాన్ని హై కోర్టులో దాఖలు చేశారు. ఈ ఆటలు చిన్నారుల్లో మానసిక సమస్యలతోపాటు వారి జీవితాలమీదా ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంతే కాకుండా దేశ భద్రతకూ ఈ ఆప్ వల్ల ప్రమాదం ఉందని కోర్టుకు వివరించారు. 2020 సెప్టెంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిన పబ్జీ మొబైల్ గేమ్ (PUBG mobile video game) యొక్క మరో రూపమే ఈ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా అని ఆ వ్యాజ్యంలో ఆరోపించారు.

కనుక, ఈ మొబైల్ గేమ్ ని, దాని అనుబంధంగా ఉన్న అన్నింటినీ తక్షణమే శాశ్వతంగా మూసివేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోర్టుకు విన్నవించారు. ఈ కేసులో కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు, బెంగళూరుకు చెందిన పబ్జీ ఇండియా, దక్షిణ కొరియాకి చెందిన క్రాఫ్టోన్ సంస్థలనూ ప్రతివాదులుగా చేర్చారు. నిషేధిత జాబితాలోని పబ్జీ మొబైల్ గేమ్ ని పోలిన ఆటను తిరిగి విడుదల చేసినందుకు క్రాఫ్టొన్ సంస్థను ప్రతివాదిగా చేశారు. ఈ వ్యాజ్యంపై మార్చి 14న విచారణ జరగనుంది.

Vu Smart TV: వ్యూ ప్రీమియం స్మార్ట్ టీవీ వచ్చేసింది... ధర రూ.12,999 మాత్రమే

ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో పేర్కొన్న ప్రాధమిక ఆధారాల ప్రకారం, ప్లేయర్ అన్నౌన్స్ బ్యాటిల్ గ్రౌండ్స్ (పబ్జీ) (Player Unknown's Battlegrounds – PUBG) అనేది ఓ వ్యసనపరమైన ఆట. అది అప్పట్లో గూగుల్ ప్లే స్టోర్ లోనూ, ఐ ఫోన్ యాప్ స్టోర్ లోనూ అందుబాటులో ఉండేదని, ఆ ఆటను చైనాకు చెందిన టెన్సెంట్ హోల్డింగ్ లిమిటెడ్ (Tencent Holding Ltd) రూపొందించిందని ఈ ఆట అత్యంత వ్యసన లక్షణం కలదని ప్రజా ప్రయోజన వ్యాజ్యం వివరిస్తుందని పూర్తి స్థాయి విధ్వంసాన్ని ప్రేరేపిస్తుందని, భయంకరమైన ద్రుశ్యాలను ప్రదర్శిస్తుందని, అనవసరమైన అల్లకల్లోలం ఆ ఆటలో ఉంటుందని పేర్కొన్నారు.

ఈ ఆటకు బానిస అయిన పిల్లల ప్రవర్తనలో అనేక మార్పులు, చాలా అవలక్షణాలు కనిపిస్తున్నాయని, చాలా మంది పిల్లలు అసాధారణంగాను, మరికొంత మంది పిచ్చిగాను ప్రవర్తిస్తున్నారని వివరించారు. దేశవ్యాప్తంగా వివిద పత్రికల్లో ప్రచురితమయిన అనేక వార్తలను ప్రస్తావిస్తూ, పిల్లల్లో అలాంటి అవలక్షణాలను అనేక ఉదాహరణలతో ఈ వ్యాజ్యంలో పొందుపరిచారు. పబ్జీ ఆటపై ఓ మనస్తత్వవేత్త జరిపిన పరిశోధననూ ఉటంకించారు. అంతేగాక, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ ఆటను హానికర జాబితాలో చేర్చిందని వివరించారు.

Vivo Y75 5G: అదిరిపోయే ఫీచర్స్‌తో వివో వై75 రిలీజ్... ధర, ఫీచర్స్ వివరాలివే

దేశ రక్షణ విషయం గురించి ప్రస్తావిస్తూ, చైనాకు చెందిన ఈ టెన్సెంట్ హోల్డింగ్ తోపాటు అనేక సంస్థలు దేశ రక్షణకు భంగం కలిగించాయని, సమాచార తస్కరణ చేయడమేగాక వ్యక్తిగత గోప్యతనూ భంగ పరిచాయని హోమ్ మంత్రిత్వ శాఖ సెప్టెంబర్, 2020లోనే ఆరోపించింది. ఆ సూచనలకు అనుగుణంగానే, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 118 మొబైల్ అప్లికేషన్లను నిషేధించింది. ఆ జాబితాలోనే పబ్జీ కూడా ఉంది.

నిషేధం నుంచి తప్పించుకోవడానికే ఈ దక్షిణ కొరియా సంస్థ క్రాఫ్తోన్ ఈ ఆటను తప్పుదారిలో పునఃప్రారంభించింది అని, ఈ వ్యాజ్యంలో ప్రస్తావించారు. నవంబర్, 2020లో పబ్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ నూతన కంపెనీని ఏర్పాటు చేశారని, ఇది విదేశీ సంస్థకు ఒక అనుబంధ సంస్థ మాత్రమేనని, వీడియో గేమ్ లను తయారు చేయడం, ప్రచారం కల్పించడం, వాటిని ఆన్ లైన్ లో విడుదల చేయడం వంటివి ఈ కంపెనీ ప్రధాన లక్ష్యాలని, క్రాఫ్టోన్ కంపెనీయే ఆ విదేశీ సంస్థ అని, పబ్జీ ఇండియాలో దీనికి 99.5 శాతం పెట్టుబడులను క్రాఫ్టోన్ సంస్థే పెట్టిందని, ఆ మిగిలిన 0.5 శాతం నిధులను కొరియాకు చెందిన రెండు ఇతర సంస్థలు పెట్టాయని ఆరోపించారు.

First published:

Tags: Battlegrounds Mobile India, BGMI, High Court, Telangana High Court