PUBG New State: త్వరలో లాంచ్ కానున్న పబ్జీ- న్యూ స్టేట్ గేమ్.. భారత్ లో ఎప్పుడంటే..!

PUBG New State

PUBG New State: పబ్జీ న్యూస్టేట్ గేమ్‌ ప్రీ-రిజిస్ట్రేషన్‌లు సెప్టెంబర్‌లోనే ప్రారంభమయ్యాయి. కొత్త గేమ్ ప్రపంచవ్యాప్తంగా 17 విభిన్న భాషల్లో.. ఫ్రీ మొబైల్ గేమ్‌గా ప్రారంభమవుతుందని క్రాఫ్టన్ తెలిపింది.

  • Share this:
పబ్జీ- న్యూ స్టేట్ గేమ్ (PUBG: New State) విడుదల తేదీని క్రాఫ్టన్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఈ కొత్త పబ్జీ వెర్షన్‌ను నవంబర్ 11న విడుదల చేస్తామని ప్రకటించింది. భారత్‌ సహా 200కి పైగా దేశాల్లో.. ఆండ్రాయిడ్, iOS డివైజ్‌లలో రన్ అయ్యే కొత్త పబ్జీ గేమ్‌ అందుబాటులోకి రానుంది. అయితే అంతకు ముందు అక్టోబర్ 29, 30 తేదీల్లో.. మొత్తం 28 దేశాల్లో నిర్వహించనున్న టెక్నికల్ టెస్ట్‌ల అనంతరమే ఈ గేమ్ విడుదల కానుంది. పబ్జీ న్యూ స్టేట్ గేమ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు క్రాప్టన్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రకటించింది. దీనికి సంబంధించి ఆండ్రాయిడ్, iOS డివైజ్‌లలో కలిపి 50 మిలియన్లకు పైగా ప్రీ-రిజిస్ట్రేషన్‌లు పొందినట్లు వెల్లడించింది.

పబ్జీ న్యూస్టేట్ గేమ్‌ ప్రీ-రిజిస్ట్రేషన్‌లు సెప్టెంబర్‌లోనే ప్రారంభమయ్యాయి. కొత్త గేమ్ ప్రపంచవ్యాప్తంగా 17 విభిన్న భాషల్లో.. ఫ్రీ మొబైల్ గేమ్‌గా ప్రారంభమవుతుందని క్రాఫ్టన్ తెలిపింది. బహ్రెయిన్, కంబోడియా, ఈజిప్ట్, హాంకాంగ్, ఇండోనేషియా, ఇరాక్, జపాన్, జోర్డాన్, కొరియా, కువైట్, లావోస్, లెబనాన్, మకావో, మలేషియా, మాల్దీవులు, మయన్మార్, నేపాల్, ఒమన్ ఫిలిప్పీన్స్, ఖతార్, సౌదీ అరేబియా, సింగపూర్, శ్రీలంక, తైవాన్, థాయ్‌లాండ్, టర్కీ, యూఏఈ, యెమెన్.. మొత్తం 28 దేశాల్లో ఈ గేమ్ ఫైనల్ టెస్ట్‌ను క్రాఫ్టన్ నిర్వహించనుంది. అయితే ఈ ఫైనల్ టెస్టింగ్ దేశాల జాబితాలో భారత్ లేకపోవడం గమనార్హం.

పబ్జీ గేమ్‌కు ముందు నుంచి భారత్‌లో మంచి ఆదరణ ఉంది. అయితే చైనా నేపథ్యం ఉండటంతో, భద్రత కారణాలతో దీన్ని ఇండియా బ్యాన్ చేసింది. ఆ తరువాత క్రాఫ్టన్ సంస్థ భారత్‌ కోసం ప్రత్యేకంగా బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్‌ను అభివృద్ధి చేసింది. అనంతరం కొత్తగా ‘పబ్జీ: న్యూ స్టేట్’ గేమ్‌ను డిజైన్ చేసింది.

ఇది కూడా చదవండి : అంబ్రేన్ నుంచి సరికొత్త ఇయర్‌బడ్స్.. ఫెస్టివల్ ఆఫర్ కింద రూ.799కే.. వివరాలివే..

ఈ కొత్త వెర్షన్‌.. స్మార్ట్‌ఫోన్ గేమర్‌లకు నెక్ట్స్ జెనరేషన్ బ్యాటిల్ రాయల్ ఎక్స్‌పీరియెన్స్‌ అందించనుంది. కొత్త గన్‌ప్లే సిస్టమ్‌తో పాటు కొత్త రెండరింగ్ టెక్నాలజీని యూజర్లు ఆస్వాదించవచ్చు. ఈ గేమ్‌లో ట్రాయ్ (Troi) అనే కొత్త మ్యాప్, ఎరెంజెల్‌ (Erangel) అనే స్టాండర్డ్ ఫ్రాంచైజ్ మ్యాప్ ఉంటుంది. గేమ్‌లోని కొత్త కారును ‘ది వోల్టా’.. కొత్త ద్విచక్ర వాహనాన్ని ‘వల్చర్’ అని పిలుస్తారు. కొత్త కంటెంట్, మెరుగైన గేమ్‌ప్లేతో గేమ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తామని క్రాఫ్టన్ తెలిపింది.
Published by:Sridhar Reddy
First published: