హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

PUBG NEW STATE: పబ్‌జీ న్యూ స్టేట్‌ గేమ్‌లో కొత్త ఫీచర్లు... సరికొత్త యానిమేషన్స్‌తో ఆకట్టుకోనున్న గేమ్

PUBG NEW STATE: పబ్‌జీ న్యూ స్టేట్‌ గేమ్‌లో కొత్త ఫీచర్లు... సరికొత్త యానిమేషన్స్‌తో ఆకట్టుకోనున్న గేమ్

PUBG NEW STATE: పబ్‌జీ న్యూ స్టేట్‌ గేమ్‌లో కొత్త ఫీచర్లు... సరికొత్త యానిమేషన్స్‌తో ఆకట్టుకోనున్న గేమ్
(ప్రతీకాత్మక చిత్రం)

PUBG NEW STATE: పబ్‌జీ న్యూ స్టేట్‌ గేమ్‌లో కొత్త ఫీచర్లు... సరికొత్త యానిమేషన్స్‌తో ఆకట్టుకోనున్న గేమ్ (ప్రతీకాత్మక చిత్రం)

PUBG NEW STATE | పబ్‌జీ కొత్త వర్షన్ పబ్‌జీ న్యూ స్టేట్ నవంబర్ 11న లాంఛ్ కానుంది. కొత్త ఫీచర్స్, కొత్త యానిమేషన్స్‌తో వీడియోగేమ్ లవర్స్‌ను ఈ గేమ్ ఆకట్టుకోనుంది. మరి ఈ గేమ్‌లో రాబోయే ఫీచర్స్ ఏంటో తెలుసుకోండి.

ప్రముఖ మొబైల్ గేమ్‌ పబ్‌జీ (PUBG) ఎంతోమంది గేమింగ్ ప్రియులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. వీడియో గేమ్ డెవలపర్ క్రాఫ్టన్‌ ఈ గేమ్‌లో మరో కొత్త వెర్షన్‌తో యూజర్లను ఆకట్టుకునేందుకు సన్నద్ధమవుతోంది. ఈ వారం చివర్లో పబ్‌జీ: న్యూ స్టేట్ (PUBG: NEW STATE) పేరుతో సరికొత్త పబ్‌జీని విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో క్రాఫ్టన్.. పబ్‌జీ: న్యూ స్టేట్ గేమ్‌కు సంబంధించి కొన్ని సరికొత్త ఫీచర్‌లను యూట్యూబ్ వీడియోల ద్వారా టీజ్ చేస్తోంది. తాజాగా విడుదల చేసిన ఓ వీడియోలో మరో కొత్త ఫీచర్‌ గురించి తెలిపింది. గేమర్లు తమ లూట్(loot), వెప‌న్స్‌ను వాహనం ట్రంక్‌/డిక్కీలో స్టోర్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ ఫీచర్‌ను 'ట్రంక్ (Trunk)' గా క్రాఫ్టన్ పేర్కొంది.

Smartphone Blast: ఆ స్మార్ట్‌ఫోన్ మళ్లీ పేలింది... ఏ కంపెనీదో తెలుసా?

ఈ ఫీచర్‌తో ప్లేయర్లు తమ వాహనంలో కావాల్సినంత లూట్, కొత్త వెపన్స్, హెల్మెట్స్, చెస్ట్ వెస్ట్స్ ఇలా ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు ప్లేయర్లు వెంటనే ఆ వెహికల్ డిక్కీ నుంచి ఆయుధాలు, గ్రెనేడ్లు, మందు సామగ్రి, ఎనర్జీ డ్రింక్, పెయిన్ కిల్లర్ ఇలా ఏవైనా వాడుకోవచ్చు. టీడీఎం/పేలోడ్ మోడ్‌లో మీ టీమ్ మెంబర్స్ మళ్లీ చేరినప్పుడు మీరు వాహనం ద్వారా నేరుగా వారితో సామాగ్రిని పంచుకోవచ్చు. వాహనంలో వెళ్తూనే రకరకాల సామాగ్రిని ఎక్స్ చేంజ్ చేసుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే పబ్‌జీ: న్యూ స్టేట్‌లో వాహనాలను ఒక మూవింగ్ స్టోరేజ్ యూనిట్‌గా వాడుకోవచ్చు. తద్వారా బ్యాక్ ప్యాక్ కంటే ఎక్కువ ఐటమ్స్ మీతోపాటే తీసుకెళ్లొచ్చు.

Flipkart: ఫ్లిప్‌కార్ట్ కొత్త ప్రోగ్రామ్... రెండు వారాల తరువాత స్మార్ట్‌ఫోన్లు రిటర్న్ చేసే ఆప్షన్

పబ్‌జీ: న్యూ స్టేట్‌లో ట్రంక్ ఫీచర్‌ను ప్లేయర్‌లు ఎలా ఉపయోగించాలో క్రాఫ్టన్ లేటెస్ట్ వీడియోలో వివరించింది. ఆటగాళ్లు వాహనం వద్దకు వెళ్లి వారి లూట్, వెపన్స్ కారు ట్రంక్ లేదా ఆఫ్-రోడర్‌లో స్టోర్ చేసుకోవచ్చని క్రాఫ్టన్ వీడియోలో చూపించింది. ప్లేయర్ వాహనం వద్దకు వెళ్ళినప్పుడు.. వారికి ఇప్పుడు "ట్రంక్" అనే ఒక సరికొత్త ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై నొక్కడం ద్వారా వారు తమ లూట్, వెపన్స్ ను ట్రంక్‌లోకి అన్‌లోడ్ చేయవచ్చు. తరువాత వాటిని మళ్లీ లోడ్ చేసుకోవచ్చు. లోడ్, అన్‌లోడ్ చేసేందుకు వీలుగా రెండు ఆప్షన్లను ప్లేయర్లు పొందుతారు. ఈ ఫీచర్ పబ్‌జీ: న్యూ స్టేట్‌ లాంచ్ అయిన మొదటి రోజు నుంచే ప్లేయర్లందరికీ అందుబాటులో ఉంటుంది.

Vivo Diwali Offer: కేవలం రూ.101 చెల్లించి స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు... ఆఫర్ రేపటివరకే

ట్రంక్ ఫీచర్ బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే.. మీరు మీ లూట్, ఆయుధాలను ఒకే చోట సురక్షితంగా ఉంచొచ్చు. ఒకవేళ ఎనమీ ప్లేయర్ మిమ్మల్ని కిల్(kill) చేసినా.. ట్రంక్ నుంచి మీ లూట్ యాక్సెస్ చేయలేరు. అంతేకాదు టీమ్ డెత్ మ్యాచ్‌(TDM)లలో ఆయుధాలు లేకుండా మళ్లీ బాటిల్ గ్రౌండ్ లోకి వచ్చే మీ టీమ్ మెంబర్లకు వెంటనే ఆయుధ సరంజామా షేర్ చేయొచ్చు. మీరు గ్రీన్ ఫ్లేర్ గన్ ద్వారా మీ టీమ్ మేట్స్ ను రివైవ్(revive) చేసినప్పుడు కూడా ట్రంక్ ద్వారా మీ లూట్ వారితో పంచుకోవచ్చు. ఇందుకు మీరు వారి సమీపంలో మీ వెహికిల్ పార్క్ చేస్తే సరిపోతుంది. శత్రువులతో పోరాడేందుకు మీ టీమ్ మేట్స్ కు ఆయుధాలు అవసరమైతే వారు ఈ ట్రంక్‌ని కూడా యాక్సెస్ చేయవచ్చు. ఒకే ట్రంక్‌ను జట్టులోని ప్లేయర్లు ఎవరైనా ఉపయోగించవచ్చు. ప్రతి ఒక్కరూ వస్తువులను ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.

పబ్‌జీ: న్యూ స్టేట్ (PUBG: NEW STATE) అనేది ప్రస్తుతం అందుబాటులో ఉన్న పబ్‌జీకి అడ్వాన్స్‌డ్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. క్రాఫ్టన్‌ ఇప్పటివరకు టీజ్ చేసిన వీడియోలను చూస్తుంటే.. ఈ సరికొత్త గేమ్‌లో శత్రువులను చంపేందుకు చాలా అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ అందించారని స్పష్టమవుతోంది. ఈ అదిరిపోయే గేమ్‌ నవంబర్ 11వ తేదీన ఇండియాతో సహా 199 దేశాల్లో విడుదల కాబోతోంది. ఆ రోజు నుంచి ప్లేయర్లు పబ్‌జీ: న్యూ స్టేట్ (PUBG: NEW STATE) డౌన్‌లోడ్ చేసుకొని ఆడుకోవచ్చు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: PUBG, PUBG Mobile India, Video Games

ఉత్తమ కథలు