హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

PUBG Mobile India: పబ్జీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఇండియాలో ప్రీ రిజిస్ట్రేషన్లు

PUBG Mobile India: పబ్జీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఇండియాలో ప్రీ రిజిస్ట్రేషన్లు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పబ్జీ అభిమానులకు శుభవార్త. బ్యాన్ అయిన పబ్జీ మొబైల్ ఇండియా మళ్లీ రాబోతోంది. దీనికి సంబంధించి ముందస్తు రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి.

  PUBG Mobile India Release Date: పబ్జీ అభిమానులకు శుభవార్త. బ్యాన్ అయిన పబ్జీ మొబైల్ ఇండియా మళ్లీ రాబోతోంది. దీనికి సంబంధించి ముందస్తు రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి. చాలా కాలం నుంచి గేమ్‌కు దూరం అయిన ఫ్యాన్స్ మళ్లీ పబ్జీ ఆడాలనుకుంటున్నారా? అయితే, మీరు కూడా ఈ విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు. పబ్జీ కార్పొరేషన్ త్వరలో భారత మార్కెట్లోకి మళ్లీ పబ్జీ మొబైల్ ఇండియాను తీసుకురాబోతోంది. భద్రతా కారణాల రీత్యా భారత్‌లో బ్యాన్ అయిన తర్వాత మళ్లీ ఇండియాలో అడుగుపెట్టడానికి పబ్జీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. అన్ని ట్రిక్స్ ప్లే చేస్తోంది. ఎట్టకేలకు గేమ్ ఇండియా వెర్షన్‌ను లాంచ్ చేయబోతోంది. అయితే, అధికారికంగా ప్రారంభించే ముందు PUBG కార్పొరేషన్ ముందస్తు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలు పెట్టింది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం PUBG Mobile India ముందస్తు రిజిస్ట్రేషన్ TapTap యాప్‌లో అందుబాటులో ఉంది. అది ఉచితం. గేమర్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇందులో పలు గేమ్స్ కూడా ఉన్నాయి. వాటిని ఆడుకోవచ్చు. అయితే, PUBG Mobile India అధికారిక వెబ్ సైట్‌లో ఎప్పటి నుంచి ప్రీ రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయనే అంశంపై ఇంకా ఆ సంస్థ నుంచి క్లారిటీ రాలేదు. అయితే, ముఖ్యమైన విషయం ఏంటంటే, TapTap యాప్‌ పబ్జీ కార్పొరేషన్ ఆధీకృతమైంది కాదు. అయినా కూడా మీరు పబ్జీ కోసం తహతహలాడుతుంటే.. గేమ్‌ను ముందుస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే TapTap యాప్‌లో ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.


  • ఈ విధంగా ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు
  • మొదట APK ద్వారా TapTap app డౌన్ లోడ్ చేసుకోవచ్చు. TapTap వెబ్ సైట్ మీద లింక్ ఉంటుంది.

  • TapTap అకౌంట్‌లో లాగిన్ చేయండి. ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే కొత్త అకౌంట్ క్రియేట్ చేయండి. ఆ తర్వాత PUBG Mobile India అని సెర్చ్ చేయండి. ఆ తర్వాత గేమ్ మీద క్లిక్ చేయండి.

  • ఆ తర్వాత ప్రీ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. అంతే. మీరు ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టే.

  • PUBG Mobile India ఏపీకే వెర్షన్ శుక్రవారమే రిలీజ్ అయింది. కంపెనీ అధికారిక వెబ్ సైట్‌లో ఈ వివరాలు ఉన్నాయి.

  • అయితే, ఏపీకే వెర్షన్ ద్వారా డౌన్ లోడ్ చేసుకున్నా కూడా కొందరు గేమర్స్ మాత్రం డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్టు తెలిపారు.

  • ప్రస్తుతానికి PUBG Mobile India ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ లింక్స్‌‌ మాత్రం కమింగ్ సూన్ అని ఉంది.


  PUBG గేమ్‌ను మళ్లీ భారత్‌లోకి తీసుకురావడానికి పబ్జీ కార్పొరేషన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. భారత్‌లో ఓ భాగస్వామి, కొత్త గేమ్‌తో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. అలాగే, భారత్‌లో 100 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు కూడా పబ్జీ కార్పొరేషన్ సిద్ధంగా ఉంది. లోకల్ వీడియో గేమ్స్, ఈ - స్పోర్ట్స్, ఎంటర్ టైన్‌మెంట్, ఐటీ ఇండస్ట్రీ కోసం ఈ పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా ఉంది.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: PUBG, PUBG Mobile India

  ఉత్తమ కథలు