బ్యాన్‌కు గురై నెలలు గడుస్తున్నా భారత్‌లో పబ్జీ ఫీవర్ ఏ మాత్రం తగ్గలేదు. మళ్లీ గేమ్ ఎప్పుడు వస్తుందా అని లక్షలాది మంది వేచిచూస్తున్నారు. అయితే త్వరలో భారత్‌లో గేమ్‌ను లాంచ్ చేస్తామని పబ్జీ ఇటీవల ప్రకటించింది. అయితే గేమర్లు మాత్రం ఇంకొంత కాలం వేచిచూడాల్సిందే. 2021 ఫిబ్రవరిలోపే భారత్‌లో పబ్జీ వచ్చే అవకాశం ఉంది. అయితే పబ్జీ అంటూ కొన్ని సైట్లలో లింక్ కనిపిస్తున్నాయి. ఏపీకే ఫైల్స్ కు లింక్ లు ఉంటున్నాయి. అయితే అవన్నీ నకిలీవే.
పబ్జీ అని ఉన్న ఫేక్ లింక్‌లకు క్లిక్ చేయడం ప్రమాదకరం. దీనివల్ల మొబైళ్లు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని వెబ్సైట్లలో లభిస్తున్న థర్డ్ పార్టీ ఏపీకే ఫైల్స్‌ను కొందరు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఇవి జెన్యూన్ ఫైల్స్ కావు. దీన్ని వల్ల ఫోన్లోకి మాల్వేర్ వచ్చి.. తెలియకుండా డేటా చోరీకి గురవుతుంది.
గేమ్ వచ్చేసిందంటూ పుకార్లు పెరిగిపోతుండడంతో పబ్జీ కార్పొరేషన్ స్పందించింది. యూజర్లు ఇంకొంత కాలం వేచిచూడాలని సూచించింది. స్థానిక నిబంధనల ప్రకారం ప్లేయర్లు డేటా సురక్షితంగా, భద్రంగా ఉండేలా గేమ్‌ను తీసుకొస్తున్నామని ప్రకటించింది.
పబ్జీ సహా 118 చైనీస్ యాప్స్‌ను భారత ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్‌లో బ్యాన్ చేసింది. భారత సమగ్రతకు, భద్రతకు ఈ యాప్స్ ముప్పుగా ఉన్నాయని, డేటాను చోరీ చేస్తున్నాయని పేర్కొంది. కాగా మళ్లీ గేమ్‌ను భారత్ లో మళ్లీ లాంచ్ చేసేందుకు పబ్జీ కార్పొరేషన్ ప్రయత్నిస్తూనే ఉంది. ఈ మేరకు ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. భారత్‌కు ప్రత్యేకంగా బాటిల్ రాయల్ గేమ్‌ను తీసుకురానున్నట్టు ప్రకటించింది. అయితే ప్రభుత్వ నుంచి అనుమతి ఆలస్యం కావడంతో గేమర్లు మరికొంత కాలం వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా పబ్జీకి పోటీగా భారత్‌లో పా-జీ లాంచ్ అయింది. దీనిపై కూడా గేమర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిజిస్టేషన్లు లక్షల సంఖ్యలో జరుగుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: PUBG, PUBG Mobile India