PUBG India వచ్చేది అప్పుడే.. ఆ APKను డౌన్ లోడ్ చేయొద్దంటున్న నిపుణులు

ప్రతీకాత్మక చిత్రం

పబ్ జీ (PUBG) మళ్లీ తన సేవలను భారత్ లో ప్రారంభించేందుకు మరింత సమయం పట్టనుంది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి పబ్ జీ (PUBG) సంస్థకు ఇంకా అనుమతులు రావాల్సి ఉంది. కానీ PUBG APK downloadఅంటూ వస్తున్న సమాచారంపై అప్రమత్తంగా ఉండాలని ఇలాంటి పుకార్లు నమ్మొద్దని సైబర్ క్రైమ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • Share this:
పబ్ జీ (PUBG) మళ్లీ తన సేవలను భారత్ లో ప్రారంభించేందుకు మరింత సమయం పట్టనుంది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి పబ్ జీ సంస్థకు ఇంకా అనుమతులు రావాల్సి ఉంది. కానీ PUBG APK downloadఅంటూ వస్తున్న సమాచారంపై అప్రమత్తంగా ఉండాలని ఇలాంటి పుకార్లు నమ్మొద్దని సైబర్ క్రైమ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్లోబల్ వర్షన్ కు భిన్నంగా పబ్ జీ ఇండియన్ వర్షన్ రిలీజ్ కానుండటంపై భారతీయుల్లో క్రేజ్ నెలకొంది. అయితే PUBG Mobile India ఎప్పుడెప్పుడు మళ్లీ తిరిగి వస్తుందా అని గేమ్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంటే కొత్త అప్ డేట్స్ మాత్రం ఏమీ లేకపోవటం నిరాశను మిగులుస్తోంది. చూస్తుంటే మనదేశంలో పబ్ జీ ఆట వచ్చేందుకు ఇంకా చాలా సమయం పట్టచ్చనే అంచనాలు బలపడుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి తరువాత పబ్ జీ రీలాంచ్ అవ్వచ్చనే లీకులు వస్తున్నాయి. వీలైనంత త్వరగా గేమ్ ను ఇండియాలో రీలాంచ్ చేసేందుకు సంస్థ విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ అవేవీ ఇప్పటివరకూ సఫలవంతం కాలేదు.

కేంద్ర ప్రభుత్వ శాఖ అయిన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి ఇంకా అనుమతులు మాత్రం రాలేదు. బ్యాన్ అయిన సంస్థలు తమ వ్యాపార లావాదేవీల కోసం మనదేశంలో కేవలం ఓ కొత్త సంస్థను ఫ్లోట్ చేసేసి మళ్లీ ఆపరేషనల్ కావడం సరైన విధానం కానేకాదని కేంద్రం తేల్చిచెప్పింది. ఒకవేళ పబ్ జీకి ఇది అంత సులువైన వ్యవహారమైతే ఇదే బాటలో టిక్ టాక్ (Tik Tok) కూడా పయనిస్తుందని, ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయమంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. దీంతో పబ్ జీ (PUBG) గేమ్ అందుబాటులోకి వచ్చేందుకు మరింత సమయం పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

PUBG Corporation ఆధ్వర్యంలో నడుస్తున్న PUBG, PUBG Mobile, PUBG Mobile India, PUBG Mobile Lite titles వంటివి ఉండగా పబ్ జీ మొబైల్ ఇండియా ఆధ్వర్యంలో కొత్త గేమ్ ఇండియన్ మార్కెట్లోకి రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉందని కంపెనీ సోషల్ మీడియాలో పేర్కొంది. కానీ ఆతరువాత ఎటువంటి అప్ డేట్స్ లేకపోవటంతో ఈ గేమ్ ఇప్పట్లో మార్కెట్లోకి వచ్చే చాన్సులు లేవనే విషయం తేటతెల్లమవుతోంది. పెయిడ్ అప్ ఇన్వెస్ట్మెంట్ గా రూ.5 లక్షలను సమర్పించి భారత కార్పొరేట్ ఎఫైర్స్ వద్ద నమోదు చేయించుకుంది. మరోవైపు అనుమతులన్నీ లభించాక కూడా పబ్ జీ (PUBG) మొబైల్ ఇండియా ముందుగా ఆండ్రాయిడ్ (Android) ప్లాట్ఫామ్ లో మాత్రమే అందుబాటులోకి రానున్నట్లు లీకులు వస్తున్నాయి.

చైనా (China) యాప్ కాదు
సెప్టెంబర్2న భారత ప్రభుత్వం పబ్ జీ తో సహా 118 చైనా యాప్స్ (China Apps) పై నిషేధం విధించింది. అయితే పబ్ జీ మాత్రం సౌత్ కోరియాకు చెందిన సంస్థ కాగా దాని కార్యకలాపాలను మాత్రం చైనాలోని టాంసెంట్ అనే సంస్థ నిర్వహిస్తుంది. దీంతో భారత ప్రజల సైబర్ సెక్యూరిటీ, ప్రైవసీని కాపాడటానికి భారత ప్రభుత్వం దీన్ని కూడా బ్యాన్ చేసింది. బ్యాన్ ఉన్నప్పటికీ పబ్ జీ (PUBG) ని ఇండియాలో ఆడే వెసులుబాటుంది. కానీ అక్టోబరు 30 నుంచి అధికారికంగా మాత్రం ఈ గేమ్ బ్యాన్ అయింది.

ఇండియాకు స్పెషల్ పబ్ జీ
కాగా ఇండియాలోని గేమర్స్ కోసం ప్రత్యేక వర్షన్ తో ముందుకు వస్తోంది పబ్ జీ (PUBG) . పబ్ జి (PUBG) గేమ్ ను భారత్ లో నిషేధించడంతో ఆ ప్రభావం కంపెనీపై బాగా పడింది. అయితే తిరిగి పబ్ జి (PUBG) ఇండియా లోకి రావాలని చేయని ప్రయత్నం అంటూ లేదు. దీనికోసం స్థానిక కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడంతో పాటు ఇండియాలోనే యూజర్ల డేటాని నిల్వచేయడానికి మైక్రోసాఫ్ట్ తో ఒప్పందం చేసుకుంది. భారత్ లో PUBGబ్యాన్ అవడంతో చైనా సంస్థతో తెగతెంపులు చేసుకుని మళ్లీ ఇండియాలోకి ప్రవేశించడానికి కుస్తీ పడుతున్న సంస్థ ఇండియన్ పబ్ జీ (PUBG) లవర్స్ కోసం గేమ్ ను రీడిజైన్ చేసింది. భారతీయుల అభిరుచికి అనుగుణంగా కొన్ని మార్పులు కూడా చేశారు. అందులో భాగంగా పబ్‌జి (PUBG) క్యారెక్టర్స్ కు నిండుగా వస్త్రాలు ఉండేలా డిజైన్ చేశారు.
Published by:Nikhil Kumar S
First published: