• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • PUBG MOBILE INDIA AMID DECEMBER LAUNCH SPECULATION REPORT ALLEGES NO MINISTRY CLEARANCE SS GH

PUBG Mobile India: పబ్‌జీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్... ఎందుకంటే

PUBG Mobile India: పబ్‌జీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్... ఎందుకంటే

PUBG Mobile India: పబ్‌జీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్... ఎందుకంటే (image: Pubg)

PUBG Mobile India | పబ్‌జీ మొబైల్ ఇండియా గేమ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు మరింతకాలం ఎదురుచూపులు తప్పవు. ఎందుకో తెలుసుకోండి.

  • Share this:
పబ్ జీ మళ్లీ తన సేవలను భారత్‌లో ప్రారంభించేందుకు మరింత సమయం పట్టనుంది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి పబ్ జీ సంస్థకు ఇంకా అనుమతులు రావాల్సి ఉంది. కాగా గ్లోబల్ వర్షన్ కు భిన్నంగా పబ్ జీ ఇండియన్ వర్షన్ రిలీజ్ కానుండటంపై భారతీయుల్లో క్రేజ్ నెలకొంది. భారత దేశంలో పబ్ జీ త్వరలో తన కార్యకలాపాలను పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు అన్ని కసరత్తులు పూర్తి చేసి, ఈనెల మొదటి వారంలోనే ఈ గేమ్ ను భారతీయులకు అందుబాటులోకి తెచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. అయినా కేంద్ర ప్రభుత్వ శాఖ అయిన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY) నుంచి ఇంకా అనుమతులు మాత్రం రాలేదు. బ్యాన్ అయిన సంస్థలు తమ వ్యాపార లావాదేవీల కోసం మనదేశంలో కేవలం ఓ కొత్త సంస్థను ఫ్లోట్ చేసేసి మళ్లీ ఆపరేషనల్ కావటం సరైన విధానం కానేకాదని కేంద్రం తేల్చిచెప్పింది. ఒకవేళ పబ్ జీ కి ఇది అంత సులువైన వ్యవహారమైతే ఇదే బాటలో టిక్ టాక్ (Tik Tok) కూడా పయనిస్తుందని, ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయమంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేస్తోంది. దీంతో పబ్ జీ గేమ్ అందుబాటులోకి వచ్చేందుకు మరింత సమయం పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇండియాలో రిలీజైన మరో 5జీ స్మార్ట్‌ఫోన్... Moto G 5G ప్రత్యేకతలు ఇవే

Nokia 2.4: రూ.10,399 ధరకే నోకియా 2.4 స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే

PUBG Corporation ఆధ్వర్యంలో నడుస్తున్న PUBG, PUBG Mobile, PUBG Mobile India, PUBG Mobile Lite titles వంటివి ఉండగా పబ్ జీ మొబైల్ ఇండియా ఆధ్వర్యంలో కొత్త గేమ్ ఇండియన్ మార్కెట్లోకి రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉందని కంపెనీ సోషల్ మీడియాలో పేర్కొంది. దీంతో గేమ్ లవర్స్ సంతోషం తారాస్థాయికి చేరుకుంది. పెయిడ్ అప్ ఇన్వెస్ట్మెంట్ గా రూ.5 లక్షలను సమర్పించి భారత కార్పోరేట్ ఎఫైర్స్ వద్ద నమోదు చేయించుకుంది. మరోవైపు అనుమతులన్నీ లభించాక కూడా పబ్ జీ మొబైల్ ఇండియా ముందుగా ఆండ్రాయిడ్ (Android) ప్లాట్ఫామ్ లో మాత్రమే అందుబాటులోకి రానున్నట్టు లీకులు వస్తున్నాయి.

చైనా యాప్ కాదు


భారత ప్రభుత్వం కొంత కాలం క్రితం పబ్ జీతో సహా కొన్ని చైనా యాప్స్ (China Apps)ను బ్యాన్ చేసింది. అయితే పబ్ జీ మాత్రం సౌత్ కోరియాకు చెందిన సంస్థ కాగా దాని కార్యకలాపాలు మాత్రం చైనాలోని టాంసెంట్ అనే సంస్థ నిర్వహిస్తుంది. దీంతో భారత ప్రజల సైబర్ సెక్యూరిటీ, ప్రైవసీని కాపాడటానికి భారత ప్రభుత్వం దీన్ని కూడా బ్యాన్ చేసింది.

New Rules December: సామాన్యులకు అలర్ట్... రేపటి నుంచి మారే రూల్స్ ఇవే

December Bank Holidays: డిసెంబర్‌లో బ్యాంకులకు 7 సెలవులు... ఎప్పుడెప్పుడంటే

ఇండియాకు స్పెషల్ పబ్ జీ


కాగా ఇండియాలోని గేమర్స్ కోసం ప్రత్యేక వర్షన్ తో ముందుకు వస్తోంది పబ్ జీ. పబ్ జి గేమ్ ని భారత్ లో నిషేధించడంతో ఆ ప్రభావం కంపెనీపై బాగా పడింది. అయితే తిరిగి పబ్ జి ఇండియా లోకి రావాలని చేయని ప్రయత్నం అంటూ లేదు. దీనికోసం స్థానిక కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడంతో పాటు ఇండియాలోనే యూజర్ల డేటాని నిల్వచేయడానికి మైక్రోసాఫ్ట్ తో ఒప్పందం చేసుకుంది. భారత్ లో PUBGబ్యాన్ అవడంతో చైనా సంస్థతో తెగతెంపులు చేసుకుని మళ్లీ ఇండియాలోకి ప్రవేశించడానికి కుస్తీ పడుతున్న సంస్థ ఇండియన్ పబ్ జీ లవర్స్ కోసం గేమ్ ను రీడిజైన్ చేసింది. భారతీయుల అభిరుచికి అనుగుణంగా కొన్ని మార్పులు కూడా చేశారు. అందులో భాగంగా పబ్‌జి క్యారెక్టర్స్ కు నిండుగా వస్త్రాలు ఉండేలా డిజైన్ చేశారు.
Published by:Santhosh Kumar S
First published: