PUBG Mobile India: డిసెంబర్ లో PUBG గేమ్ ఇండియాలో రీఎంట్రీ...గేమర్స్ కు పండగే...

ప్రతీకాత్మక చిత్రం

చైనాతో ఏర్పడిన సరిహద్దు వివాదం నేపథ్యంలో నిషేధానికి గురైన మోస్ట్ పాపులర్ గేమ్ PUBG తిరిగి భారత్లో ‘PUBG మొబైల్ ఇండియా’ పేరుతో విడుదలకు సిద్దమవుతోంది. ఈ మేరకు దాని పేటింట్ కంపెనీ PUBG Corp ఇటీవలే అధికారిక ప్రకటన కూడా చేసింది.

  • Share this:
చైనాతో ఏర్పడిన సరిహద్దు వివాదం నేపథ్యంలో నిషేధానికి గురైన మోస్ట్ పాపులర్ గేమ్ PUBG తిరిగి భారత్లో ‘PUBG మొబైల్ ఇండియా’ పేరుతో విడుదలకు సిద్దమవుతోంది. ఈ మేరకు దాని పేటింట్ కంపెనీ PUBG Corp ఇటీవలే అధికారిక ప్రకటన కూడా చేసింది. అయితే, అప్పటి నుంచి ఈ గేమ్ ఎప్పుడు విడుదల అవుతుందా అని పబ్జీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, వారి సుదీర్ఘ నిరీక్షణ తొందర్లోనే ముగియనున్నట్లు తెలుస్తోంది. భారత్లో పబ్జీ విడుదలకు సంబంధించిన విషయాలపై ఊహాగానాలు జోరందుకుంటున్న నేపథ్యంలో రెండు స్వతంత్ర నివేదికలు విరుద్దమైన ప్రకటనలు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.- ఒక ప్రైవేటు ఏజెన్సీ నివేదిక డిసెంబర్ ఆరంభంలో ఈ ఆట ప్రారంభించవచ్చని చెబుతుండగా, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నివేదిక మాత్రం భారత్లో ఈ గేమ్ విడుదలకు మంత్రిత్వ శాఖ ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదని స్పష్టం చేసింది.

భారతదేశంలోని యాప్ స్టోర్స్‌లో ఈ ఆటను తిరిగి ప్రారంభించడానికి PUBG Corp మంత్రిత్వ శాఖ నుంచి క్లియరెన్స్ పొందాల్సి ఉందని నివేదిక పేర్కొంది. అయితే, పబ్జీ మాతృ సంస్థ అయిన PUBG కార్ప్ ఇటీవల ‘పబ్జి మొబైల్ ఇండియా’ పేరుతో భారతదేశంలో అధికారికంగా గేమ్ విడుదలకు రిజిస్ట్రేషన్‌ చేసుకుంది.

తద్వారా త్వరలోనే ఈ ఆట భారతదేశంలో తిరిగి ప్రారంబమయ్యే వీలుందని అందరూ భావించారు. దీనికి గాను PUBG కార్ప్ భారతదేశంలో 100 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 740 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు స్పష్టం చేసింది. ఇక భారత్లో పబ్జీ గేమ్ డిసెంబర్ మొదటి వారంలో గ్రాండ్గా విడుదల కానున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.

ప్రభుత్వం నుంచి మరోసారి అనుమతి పొందాల్సి ఉంది..

అయితే, ఇన్ సైడ్ స్పోర్ట్ ప్రత్యేక నివేదిక మాత్రం పబ్జీ విడుదలపై పూర్తి విరుద్ధమైన ప్రకటన చేసింది. నివేదికలో పేర్కొన్న దాని ప్రకారం, పబ్జీ ఇండియా లాంచ్ పై మంత్రిత్వ శాఖ అధికారి స్పందిస్తూ “ భారత్లో పబ్జీ మాతృ సంస్థ అయిన పబ్జీ కార్ప్ ఇటీవల ‘‘పబ్జి మొబైల్ ఇండియా”పేరుతో ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీని రిజిస్ట్రేషన్ చేయించి అనుమతి తీసుకుంది. అంటే దీనర్థం పబ్జీ ఆటకు దేశంలో అనుమతి లభించినట్లు కాదు.

ఈ ఆట తిరిగి దేశంలో మరోసారి ప్రవేశపెట్టబడాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉంది. చైనా సంస్థలతో సంబంధాలున్నాయని ఆరోణలు ఎదుర్కొని భారత్లో బ్యాన్ అయిన 267 యాప్‌లలో ఏ ఒక్క టిక్టాక్తో సహా ఏ ఒక్క యాప్కు కూడా తిరిగి ప్రారంభించేందుకు భారత ప్రభుత్వం ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు.”అని అన్నారు.

కాగా, PUBG మొబైల్ ఇండియా వెబ్‌సైట్ గేమ్ ప్రారంభానికి సంబంధించి ఇంకా ఖచ్చితమైన సమాచారం ఇవ్వలేదు. ఇప్పటివరకు, టీజర్‌లను మినహాయించి, PUBG ఇండియా నుండి అధికారికంగా ఎంటువంటి ప్రకటన వెలువడలేదు. దీంతో సుదీర్ఘ కాలం నుంచి వేచి చూస్తున్న పబ్జీ ప్రియులకు ఈ వార్త నిరాశను మిగిల్చిందనే చెప్పవచ్చు.
Published by:Krishna Adithya
First published: