హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

PUBG Mobile Ban: పబ్‌జీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... నిషేధంపై స్పందించిన పబ్‌జీ కార్పొరేషన్

PUBG Mobile Ban: పబ్‌జీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... నిషేధంపై స్పందించిన పబ్‌జీ కార్పొరేషన్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

PUBG Mobile Ban | పబ్‌జీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. పబ్‌జీ మొబైల్‌పై ఇండియాలో నిషేధం ఎత్తేసేందుకు పబ్‌జీ కార్పొరేషన్ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

భారత ప్రభుత్వం పబ్‌జీ మొబైల్ సహా 118 చైనా యాప్స్‌ని నిషేధించిన సంగతి తెలిసిందే. భారతదేశంలో బాగా పాపులర్ అయిన బ్యాటిల్ రాయల్ గేమ్ పబ్‌జీ మొబైల్. అయితే పబ్‌జీ గేమ్ రూపొందించింది సౌత్ కొరియాకు చెందిన గేమింగ్ కంపెనీ. కానీ పబ్‌జీ మొబైల్ వర్షన్‌ను మాత్రం చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ ప్రమోట్ చేస్తోంది. ఇండియాలో పబ్‌జీ మొబైల్ వర్షన్ రిలీజ్ చేసింది కూడా టెన్సెంట్ గేమ్స్ కంపెనీనే. భారత ప్రభుత్వం చైనా యాప్స్‌ని నిషేధం విధిస్తుండటంతో టెన్సెంట్ గేమ్స్ మేనేజ్ చేస్తున్న పబ్‌జీ మొబైల్ పైనా బ్యాన్ తప్పలేదు. దీనిపై సౌత్ కొరియాకు చెందిన పబ్‌జీ కార్పొరేషన్ స్పందించింది. మొత్తం పరిస్థితిని గమనిస్తున్నామని, నిషేధం గురించి తమకు సమాచారం ఉందని, అయితే ఇకపై పబ్‌జీ మొబైల్‌కు, టెన్సెంట్ గేమ్స్‌కు ఎలాంటి సంబంధం లేదని, పూర్తి బాధ్యతల్ని పబ్‌జీ కార్పొరేషన్ చూసుకుంటుందని తెలిపింది.

Samsung Galaxy m51: రిలీజ్‌కు ముందే తెలిసిపోయిన సాంసంగ్ గెలాక్సీ ఎం51 ఫీచర్స్

Oppo F17 Pro: ఒప్పో ఎఫ్17 ప్రో సేల్ ప్రారంభం... రూ.1,500 డిస్కౌంట్ పొందండి ఇలా

భారత ప్రభుత్వానికి చెందిన ప్రైవసీ, సెక్యూరిటీ అంశాలను పబ్‌జీ కార్పొరేషన్ పూర్తిగా అర్థం చేసుకుంది. ప్లేయర్ల డేటాను సురక్షితంగా ఉంచడం మా కంపెనీ మొదటి ప్రాధాన్యం. ఈ గేమ్‌ను ప్లేయర్స్‌కు మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. భారత చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా పబ్‌జీ మొబైల్ గేమ్ ఉంటుంది.

పబ్‌జీ కార్పొరేషన్ వివరణ

ఇకపై పబ్‌జీ మొబైల్‌ యాప్‍ను చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ నిర్వహించదు. పబ్‌జీ మొబైల్ వర్షన్‌ని కూడా పబ్‌జీ కార్పొరేషన్ చూసుకుంటుంది. ఇక పబ్‌జీ మొబైల్‌ యాప్‌కు చైనా మూలాలు ఉండవు కాబట్టి త్వరలో ఈ గేమింగ్ యాప్‌పై నిషేధం తొలగిపోతుందని పబ్‌జీ కార్పొరేషన్ భావిస్తోంది. పబ్‌జీ మొబైల్‌ యాప్‍ను బ్యాన్ చేయడంతో టెన్సెంట్ మొబైల్‌కు 34 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని అంచనా.

First published:

Tags: China, China App Ban, India-China, Indo China Tension, PUBG

ఉత్తమ కథలు