హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

PUBG: పబ్జీకి అంత్యక్రియలు.. పాడెమోసి..వెక్కివెక్కి ఏడ్చిన యువత.. వీడియో వైరల్

PUBG: పబ్జీకి అంత్యక్రియలు.. పాడెమోసి..వెక్కివెక్కి ఏడ్చిన యువత.. వీడియో వైరల్

పబ్జీకి అంత్యక్రియలు

పబ్జీకి అంత్యక్రియలు

భారత్ నుంచి డేటా చౌర్యానికి పాల్పడుతున్నాయనే ఉద్దేశంతో చైనాకు చెందిన 118 అప్లికేషన్‌లను మన దేశం తాజాగా నిషేధించింది. వీటితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 224 చైనా యాప్లను భారత్ నిషేధించింది.

పబ్జీ ఆన్‌లైన్ గేమ్‌ను భారత ప్రభుత్వం బ్యాన్ చేసిన విషయాన్ని దాని అభిమానులు అంత తొందరగా జీర్ణించుకోలేకపోతున్నారు. స్నేహితులతో కలిసి ఆన్‌లైన్‌లో ఆడే ఈ ఆటను ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి దీనికి అలవాటు పడ్డ యువత వివిధ రూపాల్లో పబ్జీపై తమ ప్రేమను చాటుతూనే ఉన్నారు. తాజాగా గుజరాత్‌లో కొంతమంది యువకులు పబ్జీ యాప్‌కు సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేశారు. తెల్లటి దుస్తుల్లో వచ్చిన వారు రోదిస్తూ పబ్జీకి నివాళులు అర్పించారు. వారిలో రోషన్ పటేల్ అనే వ్యక్తి మాట్లాడుతూ... "మేమంతా 20 మంది వరకు స్నేహితులం ఉన్నాం. అందరం కలిసి మెలిసి ఉంటాం. గత ఏడు నెలలుగా మేమంతా పబ్జీ ఆడుతున్నాం. దీన్ని నిషేధించారని తెలిసి విస్మయానికి గురయ్యాం. మేమింకా ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నాం. పబ్జీని బ్యాన్ చేసినందువల్ల దానికి అంత్యక్రియలు చేయాలనుకున్నాం" అని వివరించాడు.

భారత్ నుంచి డేటా చౌర్యానికి పాల్పడుతున్నాయనే ఉద్దేశంతో చైనాకు చెందిన 118 అప్లికేషన్‌లను మన దేశం తాజాగా నిషేధించింది. వీటితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 224 చైనా యాప్లను భారత్ నిషేధించింది. మన దేశంలో పబ్జీ ఆడేవారి సంఖ్య 175 మిలియన్లు అని ఒక అంచనా. ప్రపంచం మొత్తంలో ఈ ఆటకు అలవాటు పడిన వారి సంఖ్య భారత్లోనే అధికం. భారత చట్టాలను, వినియోగదారుల గోప్యతను చైనా యాప్‌లు ఉల్లంఘిస్తున్నందున వాటిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టినట్టు కేంద్ర ప్రభుతం తెలిపింది. ఇంతకు ముందే ఇలాంటి 275 యాప్లపై నిఘా పెట్టినట్లు టెలికాం మంత్రిత్వ శాఖ తెలిపింది.

పబ్జీని బ్యాన్ చేసినప్పటి నుంచి యువత సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. దానిపై తమ ప్రేమను చాటుతున్నారు. ఇంతవరకు ఒక ఎత్తయితే... బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎన్ కోర్ అనే సంస్థతో కలిసి పబ్జీ లాంటి గేమ్ను రూపొందించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. భారత ప్రభుత్వ నిర్ణయానికి పూర్తి మద్దతు ప్రకటించాడు అక్షయ్. భారత సమగ్రత, సార్వభౌమాధికారాలను

పరిరక్షించుకోవాల్సిన బాధ్యత భారతీయులందరిపైనా ఉందని అక్షయ్ చెప్పాడు. తాను రూపొందించే గేమ‌్‌కు వచ్చే ఆదాయం నుంచి 20శాతం ఆదాయాన్ని వీర్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు కేటాయించనున్నట్లు ప్రకటించాడు. పబ్జీ మొబైల్, పబ్జీ మొబైల్ లైట్, లివిక్, వి చాట్ వర్క్, వి చాట్ రీడింగ్ వంటి యాప్‌లు నిషేధిత జాబితాలో ఉన్నాయి.

First published:

Tags: China App Ban, PUBG

ఉత్తమ కథలు