PUBG Addiction : పట్టాలపై పబ్‌జీ ఆడారు... రైలు ఢీకొని ఇద్దరు కుర్రాళ్లు మృతి

PUBG Addiction : పబ్‌జీ గేమ్ ఆడుతూ ప్రపంచాన్ని మర్చిపోతున్నారు కుర్రాళ్లు. ఫలితాలు అత్యంత దారుణంగా ఉంటున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: March 18, 2019, 11:11 AM IST
PUBG Addiction : పట్టాలపై పబ్‌జీ ఆడారు... రైలు ఢీకొని ఇద్దరు కుర్రాళ్లు మృతి
పబ్‌జీ గేమ్ (File)
Krishna Kumar N | news18-telugu
Updated: March 18, 2019, 11:11 AM IST
అది మహారాష్ట్రలోని హింగోళీ ప్రాంతం. చుట్టుపక్కల జనం పెద్దగా ఉండరు. నిర్మానుష్యంగా ఉంటుంది. అక్కడ ఇద్దరు కుర్రాళ్లు సరదాగా తిరుగుతూ... రైలు పట్టాలవైపు వెళ్లారు. అప్పటికే వాళ్లు మొబైల్స్‌లో పబ్‌జీ గేమ్ ఆడుతున్నారు. అప్పటిదాకా నడిచిన వాళ్లకు ఖట్కాలీ బైపాస్ దగ్గర రైల్వే ట్రాక్‌లను చూడగానే వాటిపై కాసేపు కూర్చోవాలనిపించింది. దానికి తోడు పబ్ జీ గేమ్ మంచి థ్రిల్‌తో సాగుతోంది. నడుస్తూ ఆడటం కష్టంగా ఉంది... పట్టాలపై కూర్చొని ఆడుకుందాం అనుకున్నారు. ఇద్దరిలో ఒకడు... రైలు వస్తేనో అన్నాడు. ఆ వస్తే మనకు తెలీదా... సౌండ్ రాదా... అన్నాడు రెండోవాడు. అవును... ఇద్దరున్నాం. ఇద్దర్లో ఎవరో ఒకరికి రైలు వస్తున్న విషయం తెలుస్తుంది. సో... పట్టాల పైనుంచీ పక్కకు వెళ్లిపోవచ్చు. అని అనుకుంటూ... ట్రాకులపై కూర్చొని ఆట కొనసాగించారు.

కాసేపటికి... వాళ్లిద్దరి ఆటా జోరుగా సాగుతోంది. కంటి రెప్ప మూస్తే... ఎక్కడ ఆట పోతుందో అనేంత థ్రిల్‌గా సాగుతోంది. సరిగ్గా ఆ టైంలో... హైదరాబాద్ నుంచి అజ్మీర్ వెళ్తున్న రైలు అటుగా రాసాగింది. ఐతే... నగేశ్ గోరె (24), స్వప్నీల్ అన్నపూర్ణే (22).... ఆట తప్ప మరో విషయం తెలియని పొజిషన్‌లో ఉన్నారు. ఈ లోకంలో ఉన్న సంగతే మర్చిపోయారు. ఓ పక్క రైలు దూసుకొస్తుంటే... కనీసం దాని సౌండ్ గానీ, పట్టాలపై వచ్చే కదలిక శబ్దాలుగానీ వాళ్లు పట్టించుకోలేదు. అది నిర్మానుష్య ప్రాంతం కావడంతో... అక్కడ ట్రైన్ ఎలాంటి కూతా పెట్టకుండా దూసుకెళ్లింది. అంతే........

వాట్సాప్ ద్వారా న్యూస్ 18 తెలుగు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి

పట్టాలపై ఉన్న ఇద్దర్నీ రైలు ఢీకొట్టింది. బాడీలు బౌన్స్ అయ్యి... చుట్టుపక్కల తుప్పల్లోకి మాంసం ముద్దలు ఎగిరిపడ్డాయి. చీకటి పడ్డాక... ఎవరో వాటిని చూస్తేగానీ ఈ విషయం తెలియలేదు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు... ఆ కుర్రాళ్లిద్దరూ ఎవరి తాలూకో తెలుసుకుంటున్నారు. ఇలా పబ్‌జీ గేమ్‌ వల్ల జరుగుతున్న అనర్థాల్లో మరో విషాదంగా ఇది మిగిలిపోయింది.



 

ఇవి కూడా చదవండి :

బ్యాంకుల వెబ్‌సైట్లలో వర్చువల్ కీ బోర్డ్ ఎందుకు... తప్పక తెలుసుకోవాల్సిందే...
Loading...
ఆండ్రాయిడ్ గేమ్స్ ని కంప్యూటర్ లో ఆడాలా? ఇదిగో ఫ్రీ ఆప్షన్

యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా... ఇలా చెయ్యండి

మొబైల్ ఆండ్రాయిడ్ యాప్ తయారీ... సింపుల్‌గా ఎలా... ఇలా చెయ్యండి
First published: March 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...