PUBG Addiction: ఆన్సర్ షీట్‌లో పబ్‌జీ గేమ్ వ్యాసం... ఎగ్జామ్‌లో ఫెయిలైన స్టూడెంట్

PUBG Addiction | క్వశ్చన్ పేపర్‌లో ప్రశ్నలు చూసి ఒక్కటి కూడా అర్థం కాలేదు. ఏం రాయాలో తెలియక 'పబ్‌జీ గేమ్ ఎలా ఆడాలి?' అని ఓ వ్యాసం రాసేశాడు. పరీక్షలో ఫెయిల్ కావడంతో పశ్చాత్తాపడుతున్నాడు.

news18-telugu
Updated: March 21, 2019, 9:37 AM IST
PUBG Addiction: ఆన్సర్ షీట్‌లో పబ్‌జీ గేమ్ వ్యాసం... ఎగ్జామ్‌లో ఫెయిలైన స్టూడెంట్
PUBG Addiction: ఆన్సర్ షీట్‌లో పబ్‌జీ గేమ్ వ్యాసం... ఎగ్జామ్‌లో ఫెయిలైన స్టూడెంట్
news18-telugu
Updated: March 21, 2019, 9:37 AM IST
పబ్‌జీ పిచ్చి పీక్ స్టేజ్‌కు వెళ్తోంది. కర్నాటకలో ఎకనమిక్స్ పరీక్షలో ఓ విద్యార్థి పబ్‌జీ గేమ్ ఎలా ఆడాలో వ్యాసం రాశాడు. ఫెయిల్ అయ్యాడు. కర్నాటకలో ఎకనమిక్స్ విద్యార్థి వరుణ్ పరిస్థితి ఇది. అలాగని ఆ విద్యార్థి చదువులో మొద్దు ఏమాత్రం కాదు. గతేడాది ఎస్ఎస్ఎల్‌సీ పరీక్షలో డిస్టింక్షన్ వచ్చింది. కానీ ఆ తర్వాత పై చదువుల్లో పరిస్థితి చూస్తే ఇలా తయారైంది. పబ్‌జీ గేమ్‌కు బానిసైపోయి చదువును అటకెక్కించాడు. రోజుల తరబడి పబ్‌జీ ఆడుతూనే ఉన్నాడు. ఎకనమిక్స్ పరీక్షకు హాజరయ్యాడు. క్వశ్చన్ పేపర్‌లో ప్రశ్నలు చూసి ఒక్కటి కూడా అర్థం కాలేదు. ఏం రాయాలో తెలియక 'పబ్‌జీ గేమ్ ఎలా ఆడాలి?' అని ఓ వ్యాసం రాసేశాడు. పరీక్షలో ఫెయిల్ కావడంతో పశ్చాత్తాపడుతున్నాడు.

నేను బాగా చదివేవాడిని. కానీ పబ్‌జీ గేమ్‌కు అడిక్ట్ అయ్యాను. మొదట్లో సరదాగా అనిపించిన ఆ గేమ్‌కు బానిసైపోయాను. పబ్‌జీ ఆడేందుకు క్లాసులకు డుమ్మా కొట్టాను. గార్డెన్‌లో కూర్చొని గేమ్ ఆడేవాడిని. ఎగ్జామ్‌లో ప్రశ్నలకు సమాధానాలు గుర్తుకు రాకపోవడంతో నాపై నాకే కోపం వచ్చింది. అందుకే ఆన్సర్ షీట్‌లో పబ్‌జీ గేమ్ గురించి రాశాను. ఇప్పుడు నా మొబైల్‌ను తల్లిదండ్రులు లాక్కొన్నారు. కానీ ఇప్పటికే పబ్‌జీ గేమ్ దృశ్యాలే కళ్లముందు కనిపిస్తున్నాయి. ఆ గేమ్ ఎంత ప్రమాదకరమైనదో నాకు ఇప్పుడు అర్థం అవుతోంది.
వరుణ్, పరీక్షలో ఫెయిల్‌ అయిన విద్యార్థి


జవాబు పత్రంలో ఏం రాయాలో తెలియక సినిమా పాటలు, డైలాగులు రాసేవాళ్లు ఉంటారు. కానీ ఈ విద్యార్థి ఏకంగా 'పబ్‌జీ గేమ్ ఎలా ఆడాలి?' అనే వ్యాసం రాయడం క్వశ్చన్ పేపర్ దిద్దినవాళ్లకూ షాకిచ్చింది. పబ్‌జీ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవడం దగ్గర్నుంచీ ఎలా ఆడి గెలవాలో మొత్తం స్టెప్స్ వారీగా వివరించాడు. పేపర్ దిద్దిన టీచర్ ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో తల్లిదండ్రుల్ని పిలిపించి మాట్లాడారు. ఇప్పుడు పరీక్ష తప్పిన వరుణ్ మళ్లీ జూన్‌లో ఎగ్జామ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది.



Holi 2019: దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు... కలర్‌ఫుల్ ఫోటోలు చూడండి

ఇవి కూడా చదవండి:
Loading...
Link PAN-Aadhaar: పాన్‌తో ఆధార్ లింక్ చేయడానికి 4 మార్గాలు... ఐటీ శాఖ టిప్స్

SBI YONO App: ఎస్‌బీఐ కస్టమర్లకు యోనో యాప్‌‌తో ఉపయోగాలు ఇవే...

WhatsApp 2019 Features: ఈ ఏడాది వాట్సప్‌లో ఆకట్టుకుంటున్న 12 ఫీచర్లు ఇవే...
First published: March 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...