Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు షాక్... 5 కోట్ల మంది డేటా లీక్

Instagram | అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) సర్వర్‌లో ఉన్న యూజర్ల డేటాకు ఎలాంటి పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ లేదని, ఎవరైనా ఆ డేటాను యాక్సెస్ చేయొచ్చని సెక్యూరిటీ రీసెర్చర్ అనురాగ్ సేన్ బయటపెట్టడం సంచలనంగా మారింది.

news18-telugu
Updated: May 22, 2019, 11:56 AM IST
Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు షాక్... 5 కోట్ల మంది డేటా లీక్
Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు షాక్... 5 కోట్ల మంది డేటా లీక్ (ఫ్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: May 22, 2019, 11:56 AM IST
మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఉందా? మీరు రెగ్యులర్‌గా ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. సుమారు 5 కోట్ల మంది ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు, సెలబ్రిటీలు, అఫీషియల్ బ్రాండ్ అకౌంట్స్ నుంచి డేటా లీక్ అయింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) సర్వర్‌లో ఉన్న యూజర్ల డేటాకు ఎలాంటి పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ లేదని, ఎవరైనా ఆ డేటాను యాక్సెస్ చేయొచ్చని సెక్యూరిటీ రీసెర్చర్ అనురాగ్ సేన్ బయటపెట్టడం సంచలనంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల పేర్లు, ఫోటోలు, ఫోన్ నెంబర్లు, ఇమెయిల్ అడ్రస్‌లు పబ్లిక్‌గా అందుబాటులో ఉన్నాయని తేలింది. ఈ డేటా మొత్తం ముంబైకి చెందిన సోషల్ మీడియా మార్కెటింగ్ సంస్థ Chtrbox చేతుల్లోకి వెళ్లిందని తేలింది. దీంతో ఆ డేటాను ఆఫ్‌లైన్‌లోకి చేర్చింది Chtrbox.

Read this: PAN Card: మీ పాన్ కార్డ్ నెంబర్ అర్థమేంటో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల డేటా ఎలా పొందారన్న అంశంపై Chtrbox సీఈఓ ప్రణయ్ స్వరూప్ స్పందించలేదు. మరోవైపు 5 కోట్ల మంది ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల డేటా లీక్ వ్యవహారంపై ఫేస్‌బుక్ స్పందించింది. "ఈ అంశంపై దృష్టిపెట్టాం, యూజర్ల డేటా ఇన్‌స్టాగ్రామ్ నుంచి లీకైందా? లేక ఇతర మార్గాల్లో లీకైందా? అన్న కోణాల్లో విచారణ జరుపుతున్నాం. ఈ డేటా Chtrbox సంస్థకు ఎలా చేరిందో తెలుసుకుంటున్నాం" అని ఫేస్‌బుక్ స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల డేటా లీక్ కావడం ఇదే మొదటి సారి కాదు. 2017 లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ బగ్ కారణంగా 60 లక్షల మంది యూజర్ల డేటా లీకైంది.

Hyundai Venue: స్మార్ట్ ఫీచర్లతో హుందాయ్ వెన్యూ... కారు ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

Railway Recruitment: రైల్వేలో గూడ్స్ గార్డ్, జేఈ, స్టేషన్ మాస్టర్ పోస్టులు... మొత్తం 749 ఖాళీలు
Loading...
LIC Jobs: ఎల్ఐసీలో 8581 ఏడీఓ పోస్టులు... హైదరాబాద్ జోన్‌లో 1251 ఖాళీలు

Railway Jobs: ఇండియన్ రైల్వేస్‌లో 142 ఖాళీలు... వివరాలివే
First published: May 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...