ప్రధాని మోదీ వెబ్‌సైట్ హ్యాకైంది... బాంబు పేల్చిన ఎథికల్ హ్యాకర్

అనధికారికంగా వెబ్‌సైట్ యాక్సెస్ చేసినవాళ్ల దగ్గర వెబ్‌సైట్‌కు సంబంధించిన పూర్తి డేటా ఉందని ఎలియాట్ ఆల్డర్సన్ వాదన. ఇదే విషయాన్ని తన ట్విట్టర్‌లో వెల్లడించాడు.

news18-telugu
Updated: January 14, 2019, 6:25 PM IST
ప్రధాని మోదీ వెబ్‌సైట్ హ్యాకైంది... బాంబు పేల్చిన ఎథికల్ హ్యాకర్
ప్రధాని మోదీ (ఫైల్ ఫొటో)
  • Share this:
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెబ్‌సైట్ narendramodi.in హ్యాకైందా? ఫ్రెంచ్ ఎథికల్ హ్యాకర్, సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ ఎలియాట్ ఆల్డర్సన్ ఈ విషయాన్ని వెల్లడించడం కలకలం రేపుతోంది. ప్రధాన మంత్రి వెబ్‌సైట్‌లోని యాక్సెస్ చేసిన కొందరు టెక్స్ట్‌ ఫైల్ ఒకటి అప్‌లోడ్ చేశారని సదరు హ్యాకర్ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఎథికల్ హ్యాకర్ ఎలియాట్ ఆల్డర్సన్ అసలు పేరు రాబర్ట్ బాప్టిస్ట్. గతంలో ఆధార్‌లోనూ లోపాలు బయటపెట్టడమే కాదు UIDAIని సవాల్ చేశాడు. ఇప్పుడు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ వెబ్‌సైట్ హ్యాకైందని వెల్లడించడం కలకలం రేపుతోంది.

అనధికారికంగా వెబ్‌సైట్ యాక్సెస్ చేసినవాళ్ల దగ్గర వెబ్‌సైట్‌కు సంబంధించిన పూర్తి డేటా ఉందని ఎలియాట్ ఆల్డర్సన్ వాదన. ఇదే విషయాన్ని తన ట్విట్టర్‌లో వెల్లడించాడు. ఎవరో నరేంద్ర మోదీ వెబ్‌సైట్ హ్యాక్ చేసి తన పేరు మీద ఓ ఫైల్ క్రియేట్ చేసినట్టు చెబుతున్నాడు. అంతే కాదు... వెంటనే తనను ప్రైవేట్‌గా సంప్రదించి సెక్యూరిటీ ఆడిట్ మొదలుపెట్టాలని సూచించాడు.మోదీ వెబ్‌సైట్ నిర్వహిస్తున్న వారికి సదరు హ్యాకర్ ట్వీట్ గురించి తెలిసి వెంటనే అతనితో టచ్‌లోకి వెళ్లారు. narendramodi.in టీమ్ తనతో సంప్రదించినట్టు సదరు హ్యాకర్ మళ్లీ ట్విట్టర్‌లో వెల్లడించాడు. సమస్యను గుర్తించామని, చర్యలు తీసుకుంటున్నామని తనతో తెలిపినట్టు ఎలియాట్ ఆల్డర్సన్ చెబుతున్నాడు. వెబ్‌సైట్ నిర్వాహకులు ఆ ఫైల్‌ని డిలిట్ చేసినట్టు చెప్పాడు.narendramodi.in వెబ్‌సైట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోదీ బయోగ్రఫీ, ఆయన కార్యక్రమాలు, ఇతర సమాచారం ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

AADHAR NEWS: ఆధార్ కార్డు పోయిందా? ఇలా రీప్రింట్ చేసుకోవచ్చు

JALLIKATTU: 'జల్లికట్టు' వెనకున్న ఆసక్తికర చరిత్ర ఏంటో తెలుసా?

TRAI Good News: నెలకు రూ.153 చెల్లిస్తే 100 ఫ్రీ లేదా పే ఛానెళ్లు

REDMI 6 PRO: రూ.11,499 విలువైన ఫోన్ రూ.1,058 ధరకే... ఎలా కొనాలో తెలుసుకోండి

SBI CARD: ఎస్‌బీఐ ఏటీఎం కార్డు నుంచి డేటా కొట్టేస్తారు జాగ్రత్త
First published: January 14, 2019, 6:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading