Science Festival: కాసేపట్లో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ప్రారంభించనున్న మోదీ

India International Science Festival | ఈ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు దేశవిదేశాలకు చెందిన విద్యార్థులు, ప్రతినిధులు, సైన్స్ జర్నలిస్టులు వచ్చారు. 130 దేశాల ప్రతినిధులు ఈ ఫెస్టివల్‌లో పాల్గొనడం విశేషం.

news18-telugu
Updated: November 5, 2019, 1:02 PM IST
Science Festival: కాసేపట్లో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ప్రారంభించనున్న మోదీ
Science Festival: కాసేపట్లో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ప్రారంభించనున్న మోదీ
  • Share this:
అతిపెద్ద ఈవెంట్‌కు కోల్‌కతా సిద్ధమైంది. 5వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌ను కాసేపట్లో ప్రారంభించనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. నవంబర్ 5 నుంచి నవంబర్ 8 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ, విజ్ఞాన భారతి (VIBHA) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్-AICTE, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-CSIR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్-ICAR, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ISRO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-ICMR లాంటి సంస్థలు కూడా ఇందులో పాల్గొంటాయి. సాయంత్రం 4 గంటలకు ఈవెంట్‌ను ప్రారంభించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు. ఈ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు దేశవిదేశాలకు చెందిన విద్యార్థులు, ప్రతినిధులు, సైన్స్ జర్నలిస్టులు వచ్చారు. 130 దేశాల ప్రతినిధులు ఈ ఫెస్టివల్‌లో పాల్గొనడం విశేషం.





2015 నుంచి ప్రతీ ఏటా సైన్స్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది భారత ప్రభుత్వం. ఈసారి 5వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌ జరుగుతోంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈవెంట్‌ వివిధ అంశాల్లో గిన్నీస్ రికార్డులు సాధించినవారు, ప్రయోగాలు చేసినవారు తమ ప్రతిభను చాటేందుకు సరైన వేదికగా నిలుస్తోంది ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌. సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రమోట్ చేయడంతో పాటు వివిధ రంగాల్లో భారతదేశాన్ని తక్కువ సమయంలో అభివృద్ధి వైపు పయనించేలా చేసేందుకు సైన్స్ ఎలా ఉపయోపడిందో ఈ వేదికపై చాటిచెబుతుంటారు పలు రంగాల నిపుణులు.
Loading...
అదరగొట్టే లుక్స్‌తో 'బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్'... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Aadhaar-Ration Card Link: మీ రేషన్‌ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేశారా? లాభాలివే

Health ATM: రైల్వే స్టేషన్లలో 'హెల్త్ ఏటీఎం'... రూ.50 చెల్లిస్తే 5 నిమిషాల్లో రిపోర్ట్

New MNP Rules: నవంబర్ 10 వరకు మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ బంద్... ఎందుకో తెలుసా?
First published: November 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...