హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

5G Launch: రేపు 5జీ సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ

5G Launch: రేపు 5జీ సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ

5G Launch: రేపు 5జీ సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
(ప్రతీకాత్మక చిత్రం)

5G Launch: రేపు 5జీ సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ (ప్రతీకాత్మక చిత్రం)

5G Launch | 5జీ సేవల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్. ఇంకొన్ని గంటల్లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) 5జీ సేవల్ని ప్రారంభించనున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

భారతదేశంలో 5జీ సేవలు (5G Services) అందుబాటులోకి రావడానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఇంకొన్ని గంటల్లో ఇండియాలో 5జీ సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరగబోయే ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో (India Mobile Congress) 5జీ సేవల్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. 10 రెట్లు వేగంగా 5జీ నెట్వర్క్ ఉంటుందని, త్వరలోనే 5జీ ప్రారంభిస్తామని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 1న ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో 5జీ సేవల్ని ప్రారంభించనున్నారు.

ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ, భారతీ ఎయిర్‌టెల్ నుంచి సునీల్ మిట్టల్, వొడాఫోన్ ఐడియా ఇండియా హెడ్ రవీందర్ టక్కర్ లాంటివారు పాల్గొననున్నట్టు ప్రభుత్వ అధికారుల సమాచారం. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ , కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా 5జీ సేవలు ఢిల్లీ, ముంబై సహా ఏడు నగరాల్లో ప్రారంభం కానున్నాయి.

Flipkart Sale: లేటెస్ట్ 5జీ మొబైల్‌పై రూ.10,000 డిస్కౌంట్... ఆఫర్ ఇంకొన్ని గంటలే

అక్టోబర్ 1 నుంచి 4 వరకు జియో 5జీ ట్రూ సేవల్ని ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ఎక్స్‌పీరియెన్స్ చేయొచ్చు. ఇందుకోసం రిలయన్స్ జియో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేయనుంది. జియో 5జీ సేవలు ఎంత వేగంగా ఉంటాయో టెస్ట్ చేయొచ్చు.

Credit Card Rules: రేపటి నుంచి నాలుగు కొత్త క్రెడిట్ కార్డ్ రూల్స్

ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఆసియాలోనే అతిపెద్ద టెక్నాలజీ ఎగ్జిబిషన్. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనిరేషన్స్, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాయి. అక్టోబర్ 1 నుంచి 4 వరకు ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఎగ్జిబిషన్ జరగనుంది. ఈ ఎగ్జిబిషన్ వేదికగా భారతదేశంలో 5జీ సేవలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టులో నిర్వహించే 5జీ స్పెక్ర్టమ్ వేలంలో రూ.1.50 లక్షల కోట్ల బిడ్స్ దాఖలయ్యాయి. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, అదానీ గ్రూప్ ఈ వేలంపాటలో పాల్గొన్నాయి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: 5g technology, Jio TRUE 5G, PM Narendra Modi, Reliance Jio

ఉత్తమ కథలు