అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ mYoga పేరుతో సరికొత్త యాప్‌ను లాంఛ్ చేశారు. 'యోగా సే సహ్యోగ్ తక్' అనే మంత్రాన్ని మోదీ ప్రకటించారు. ఎంయోగా యాప్‌లో యోగాకు సంబంధించిన వీడియోలు ఉంటాయి. ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. ప్రపంచంలోని నలుమూలలకు యోగాను తీసుకెళ్లేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ-WHO సహకారంతో భారతదేశం మరో ముఖ్యమైన అడుగు వేసిందని, ఎంయోగా యాప్ ప్రపంచంలోని దాదాపు అన్ని భాషల్లో ఉపయోగించుకోవచ్చని మోదీ అన్నారు. ప్రాచీన శాస్త్రం, మోడర్న్ టెక్నాలజీల కలయికకు ఎంయోగా యాప్ ఓ నిదర్శనమని కొనియాడారు. వాస్తవానికి ఈ యాప్‌ను గతంలోనే రూపొందించినా కోవిడ్-19 మహమ్మారి కారణంగా లాంఛింగ్ కార్యక్రమం టీవీల్లో ప్రసారం కాలేదు. ఈ యాప్ గతేడాది, ఈ ఏడాది గొప్ప పాత్ర పోషిస్తుందన్నారు మోదీ.
WhatsApp Status: వాట్సప్ యూజర్లకు అలర్ట్... ఇక ఆ ఫీచర్ ఉండదు
Realme 7 Pro: ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.4,000 తగ్గింది... మూడు రోజులే అవకాశం
जब भारत ने यूनाइटेड नेशंस में अंतर्राष्ट्रीय योग दिवस का प्रस्ताव रखा था, तो उसके पीछे यही भावना थी कि ये योग विज्ञान पूरे विश्व के लिए सुलभ हो।
आज इस दिशा में भारत ने यूनाइटेड नेशंस, WHO के साथ मिलकर एक और महत्वपूर्ण कदम उठाया है: PM @narendramodi #YogaDay
— PMO India (@PMOIndia) June 21, 2021
శాస్త్రీయ సాహిత్యాన్ని సమీక్షించి, విస్తృతమైన అంతర్జాతీయ నిపుణులతో సంప్రదించిన తర్వాత ఎంయోగా యాప్ రూపొందించినట్టు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. వాల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్-WHO, కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ కలిసి ఈ యాప్‌ను రూపొందించాయి. ఎంయోగా యాప్‌ను 12 ఏళ్ల నుంచి 65 ఏళ్ల లోపు ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. ఎక్కడైనా ఈ యాప్ సాయంతో యోగాసానాలు వేయొచ్చు. ఇంగ్లీష్, హిందీ, ఫ్రెంచ్ భాషల్లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. త్వరలో ఐక్యరాజ్య సమితి గుర్తించిన భాషల్లో అందుబాటులోకి రానుంది.
Android New Features: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు 7 కొత్త ఆండ్రాయిడ్స్ ఫీచర్స్
Airtel Rs 456 Plan: ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్... రూ.456 ప్లాన్ ప్రకటించిన కంపెనీ
ఎంయోగా యాప్‌లో యోగా నేర్చుకోవడానికి కావాల్సిన వీడియోలు ఉంటాయి. వీడియో చూసుకుంటూ యోగాసనాలు ప్రాక్టీస్ చేయొచ్చు. 10 నిమిషాలు, 20, నిమిషాలు, 45 నిమిషాలు ఇలా మీరు ఎంత సమయం యోగా చేయాలనుకుంటే అంత సమయాన్ని ఎంచుకోవాలి. అందుకు తగ్గట్టుగా వీడియోలు కనిపిస్తాయి. గూగుల్ ప్లేస్టోర్‌లో ఎంయోగా యాడౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android, Android 11, Android 12, Mobile App, Yoga, Yoga day, Yoga day 2021