హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

1G to 5G: ఇండియాలో 5G సేవలు ప్రారంభం... 1G నుంచి 5G వరకు టెక్నాలజీ జర్నీ ఇదే

1G to 5G: ఇండియాలో 5G సేవలు ప్రారంభం... 1G నుంచి 5G వరకు టెక్నాలజీ జర్నీ ఇదే

1G to 5G: ఇండియాలో 5G సేవలు ప్రారంభం... 1G నుంచి 5G వరకు టెక్నాలజీ జర్నీ ఇదే
(ప్రతీకాత్మక చిత్రం)

1G to 5G: ఇండియాలో 5G సేవలు ప్రారంభం... 1G నుంచి 5G వరకు టెక్నాలజీ జర్నీ ఇదే (ప్రతీకాత్మక చిత్రం)

5G Services | ఇండియాలో 5జీ సేవలు అధికారికంగా ప్రారంభం అయ్యాయి. ప్రధాని మోదీ 5జీ సేవల్ని ప్రారంభించారు. త్వరలో యూజర్లకు 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ఇండియాలో 5G సేవలు ప్రారంభం అయ్యాయి. ఢిల్లీలో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఇండియాలో 5జీ సేవలను ప్రారంభించారు. ఇటీవల ముగిసిన 5G స్పెక్ట్రమ్(5G Spectrum) వేలంలో రిలయన్స్ జియో, అదానీ గ్రూప్, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా పాల్గొన్న సంగతి తెలిసిందే. మొత్తం 22 టెలికాం సర్కిల్‌లలో ప్రీమియం 700 MHz బ్యాండ్‌లో 5G స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసిన ఏకైక టెలికాం ఆపరేటర్‌గా జియో(Jio) నిలిచింది. మరో ఇంటర్నెట్‌ విప్లవం ఇండియాలో మొదలుకాబోతున్న సమయంలో 1G నుంచి 5G వరకు సెల్యులార్ నెట్‌వర్క్‌ల పరిణామాన్ని తెలుసుకుందాం.

1G నుంచి 5G వరకు ప్రతి నెట్‌వర్క్ జనరేషన్ మొబైల్ కమ్యూనికేషన్ సిస్టమ్‌ల పరంగా ప్రపంచాన్ని గణనీయంగా మార్చింది. ప్రతి కొత్త నెట్‌వర్క్ జనరేషన్‌తో నెట్‌వర్క్, ఇంటర్నెట్ వేగం, నాణ్యత పెరిగాయి.

Credit Card Rules: రేపటి నుంచి నాలుగు కొత్త క్రెడిట్ కార్డ్ రూల్స్

1979లో టోక్యోలో మొదలైన 1G

ఫస్ట్‌ జనరేషన్‌ 1G సేవలను మొదట 1979లో టోక్యోలో నిప్పాన్ టెలిఫోన్, టెలిగ్రాఫ్ టెక్నాలజీస్‌ ప్రారంభించింది. 1G నెట్‌వర్క్ అనలాగ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డ్స్‌పై పని చేస్తుంది. దేశవ్యాప్తంగా 1G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చిన మొదటి దేశంగా జపాన్ నిలిచింది. 1983లో యూఎస్‌ 1G సేవలను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 1G సేవలను తీసుకొచ్చిన దేశంగా 1984లో జపాన్‌ రికార్డ్‌ నెలకొల్పింది.

1G తక్కువ సౌండ్ క్వాలిటీ, తక్కువ కవరేజ్, ఎటువంటి రోమింగ్ సపోర్ట్ లేకుండా వచ్చింది.

2Gలో రోమింగ్‌ ఫెసిలిటీ

డిజిటల్ సెకండ్‌ జనరేషన్‌(2G) నెట్‌వర్క్‌లు అనలాగ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డ్స్‌ తీసుకొచ్చాయి. 2G టెక్నాలజీ సీడీఎంఏ (CDMA), జీఎస్ఎం(GSM) కాన్సెప్ట్‌లను పరిచయం చేయడమే కాకుండా, యూజర్లకు రోమింగ్‌ ఫెసిలిటీ అందించింది. అలానే ఎస్ఎంఎస్‌లు, గరిష్టంగా 50 kbps వేగంతో ఎంఎంఎస్ వంటి డేటా సేవలను అందించింది.

New Rules: రేపటి నుంచి 9 కొత్త రూల్స్... మీ డబ్బుపై ప్రభావం ఎంతో తెలుసుకోండి

3Gతో మొదలైన వీడియో కాలింగ్‌

2001లో 3G సేవలను ప్రవేశపెట్టడంతో మొబైల్ టెక్నాలజీ మరింత మెరుగుపడింది. 3G మొబైల్ ఇంటర్నెట్‌కు పూర్తిస్థాయిలో యాక్సెస్‌ను అందించింది. 2జీ కంటే నాలుగు రెట్లు వేగవంతమైన డేటా ట్రాన్స్‌ఫర్‌కు 3G సపోర్ట్ చేసింది. అంతేకాదు మొబైల్ ఫోన్‌లకు ఈమెయిల్స్, నావిగేషనల్ మ్యాప్స్‌, వీడియో కాలింగ్, వెబ్ బ్రౌజింగ్, మ్యూజిక్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను తీసుకొచ్చింది.

4Gతో దాదాపు ఏడురెట్లు పెరిగిన వేగం

1Gbps బ్యాండ్‌విడ్త్, 1.7 GHz నుంచి 2.6 GHz ఫ్రీక్వెన్సీతో ఫోర్త్‌ జనరేషన్‌(4G) గణనీయమైన మార్పులను తీసుకొచ్చింది. 2009 డిసెంబర్ నెలలో బ్రాడ్‌బ్యాండ్ సెల్యులార్ నెట్‌వర్క్ టెక్నాలజీకి చెందిన ఫోర్త్ జనరేషన్ (4G) అందుబాటులోకి వచ్చింది. 4G టెక్నాలజీ హై స్పీడ్, హై క్వాలిటీ, హై కెపాసిటీతో వాయిస్, డేటా సర్వీసెస్ ఆఫర్ చేసింది. 4G, 3G కంటే ఐదు నుండి ఏడు రెట్లు వేగవంతమైన స్పీడ్‌తో వచ్చింది.

5G యావరేజ్‌ బ్యాండ్‌విడ్త్‌ 100 Mbps

చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఫిప్త్‌ జనరేషన్‌(5G) 4G నెట్‌వర్క్ కంటే చాలా మెరుగ్గా ఉంది. యావరేజ్‌ బ్యాండ్‌విడ్త్ 100 Mbps, ఇది గరిష్టంగా 20 Gbps, 28.4 GHz ఫ్రీక్వెన్సీతో, 5G మల్టి-Gbps డేటా ట్రాన్స్‌ఫర్‌ రేటు అందిస్తుంది. 5జీ నెట్‌వర్క్ కస్టమర్‌లకు అల్ట్రా ఫాస్ట్ ఇంటర్నెట్, మల్టీమీడియా సర్వీసెస్ అందించడానికి అధునాతన సాంకేతికతలను ఉపయోగిస్తోంది.భవిష్యత్తులో స్మార్ట్ సిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, రోబోటిక్ సర్జరీ వంటి కొత్త టెక్నాలజీ ప్రాధాన్యం పెరుగుతుంది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: 5G, 5g technology, Pm modi, PM Narendra Modi

ఉత్తమ కథలు