Home /News /technology /

PRIME MINISTER NARENDRA MODI INAUGURATES BHARAT DRONE MAHOTSAV IN NEW DELHI PM MODI FLEW ASTERIA DRONE SS

Drone Festival: డ్రోన్ ఫెస్టివల్‌లో ఆస్టెరియా డ్రోన్ ఎగరేసిన ప్రధాని మోదీ

డ్రోన్ ఫెస్టివల్‌లో ఆస్టెరియా డ్రోన్ ఎగరేసిన ప్రధాని మోదీ

డ్రోన్ ఫెస్టివల్‌లో ఆస్టెరియా డ్రోన్ ఎగరేసిన ప్రధాని మోదీ

Drone Festival of India 2022 | భారత్ డ్రోన్ మహోత్సవ్ 2022 కార్యక్రమం న్యూ ఢిల్లీలో ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఈ ఈవెంట్‌ని ప్రారంభించారు. డ్రోన్ ఫెస్టివల్‌లో ఆస్టెరియా సంస్థకు చెందిన డ్రోన్‌ను ఎగరేశారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) న్యూ ఢిల్లీలో భారత్ డ్రోన్ మహోత్సవ్ 2022 (Drone Festival of India 2022) కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. 2022 మే 28 వరకు ఈ ఈవెంట్ జరుగుతుంది. ఈ ఈవెంట్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బెంగళూరుకు చెందిన ఆస్టెరియా ఏరోస్పేస్ లిమిటెడ్ (Asteria Aerospace Limited) సంస్థకు చెందిన డ్రోన్‌ను ఎగరేశారు. ఆస్టెరియా సంస్థకు చెందిన బూత్‌ను సందర్శించారు. డోన్ల ద్వారా ఆస్టెరియా రూపొందిస్తున్న పరిష్కారాల గురించి తెలుసుకున్నారు. ఈ దశాబ్దం చివరి నాటికి భారత్‌ను గ్లోబల్ డ్రోన్ హబ్‌గా మార్చాలనే దృక్పథాన్ని ఆయన పంచుకున్నారు. ఈ విజన్‌ను సాకారం చేసేందుకు భారత ప్రభుత్వం పరిశ్రమకు పూర్తి సహకారం అందిస్తుందని ఆయన మరోసారి తెలిపారు.

ఈ ఈవెంట్ ద్వారా మా నెక్స్ట్‌ జనరేషన్ డ్రోన్‌లు, స్కైడెక్, మా డ్రోన్ కార్యకలాపాల ప్లాట్‌ఫామ్‌ను ప్రభుత్వం, ఎంటర్‌ప్రైజ్ రంగాల్లో కీలక వ్యక్తులకు, నిర్ణేతలకు ప్రదర్శించడానికి మాకు ఒక గొప్ప అవకాశం లభించింది. పదేళ్ల క్రితం భారతదేశంలో డ్రోన్ రంగంలోకి ప్రవేశించిన కొన్ని సంస్థలలో మేము ఒకరిగా ఉన్నాము. అప్పటి నుంచి మేము బహుళ పరిశ్రమ రంగాలలో ఈ సాంకేతికత డిమాండ్, వినియోగంలో విపరీతమైన వృద్ధిని చూశాము. డ్రోన్ సాంకేతికత ప్రభావం చూపగల కొత్త మార్గాలను అన్వేషించడం కొనసాగిస్తాము.
నిహార్ వర్తక్, కో-ఫౌండర్, ఆస్టెరియా ఏరోస్పేస్ లిమిటెడ్


WhatsApp Hijack: మీ వాట్సప్ అకౌంట్‌ని సింపుల్‌గా హైజాక్ చేసేస్తారు... ఎలాగో తెలుసా?

Bharat Drone Mahotsav, drone festival in delhi, Drone Festival of India 2022, PM Modi, PM Narendra Modi, Prime Minister Narendra Modi, డ్రోన్ ఫెస్టివల్, డ్రోన్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, పీఎం నరేంద్ర మోదీ, పీఎం మోదీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భారత్ డ్రోన్ మహోత్సవ్

ఈ ఈవెంట్‌లో పరిశ్రమ రంగాల్లో భద్రత, నిఘా, సర్వేయింగ్, ఇన్‌స్పెక్షన్ అప్లికేషన్‌ల కోసం ఆస్టెరియా కఠినమైన, విశ్వసనీయమైన పనితీరుతో నడిచే డ్రోన్‌లను ప్రదర్శించింది. డ్రోన్ యాజ్ ఏ సర్వీస్ సొల్యూషన్స్‌ని అందించే క్లౌడ్-ఆధారిత డ్రోన్ ఆపరేషన్స్ ప్లాట్‌ఫారమ్, స్కైడెక్‌ను కూడా ప్రదర్శించింది.

Ola S1 Pro: రూ.1,39,000 విలువైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఉచితం... వారికి మాత్రమే

ఆస్టెరియా ఏరోస్పేస్ లిమిటెడ్ జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ సబ్సిడరీ సంస్థ. ఇది ఫుల్-స్టాక్ డ్రోన్ టెక్నాలజీ కంపెనీ. ఇంటర్నల్ హార్డ్‌వేర్ డిజైన్, సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి ప్రభుత్వం, ఎంటర్‌ప్రైజ్ కస్టమర్ల కోసం డ్రోన్ సొల్యూషన్స్‌ని అందిస్తోంది. రక్షణ, స్వదేశీ భద్రతకు దీర్ఘకాలిక, నాణ్యత గల విశ్వసనీయ ప్రొడక్ట్స్, సర్వీసెస్ అందించడంలో ఆస్టెరియా విశ్వసనీయ భాగస్వామి. వ్యవసాయం, చమురు, గ్యాస్, ఇంధనం, యుటిలిటీస్, టెలికమ్యూనికేషన్స్, మైనింగ్, నిర్మాణ రంగాలకు డ్రోన్ సేవల్ని అందిస్తోంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Drone technology, Drones, Modi, Pm modi, PM Narendra Modi

తదుపరి వార్తలు