Home /News /technology /

PRICES OF HERO GLAMOUR HIKED BY RS 1300 UMG GH

Hero Glamour: బైక్ కొనేవారికి షాకింగ్ న్యూస్.. ధరలు పెంచేసిన హీరో కంపెనీ..!

హీరో గ్లామర్ బైక్

హీరో గ్లామర్ బైక్

దిగ్గజ టూవీలర్ల తయారీ కంపెనీలలో ఒకటైన హీరో మోటోకార్ప్ (Hero Motocorp) ఇండియాలో తన గ్లామర్ బైక్స్‌ ధరలను భారీగా పెంచింది. కంపెనీ నిర్ణయంతో 125 సీసీ కమ్యూటర్ మోటార్‌సైకిల్ గ్లామర్ (Glamour) బైక్స్ ఎక్స్-షోరూమ్ ధరలు స్వల్పంగా పెరిగాయి.

ఇంకా చదవండి ...
దిగ్గజ టూవీలర్ల తయారీ కంపెనీలలో ఒకటైన హీరో మోటోకార్ప్ (Hero Motocorp) ఇండియాలో తన గ్లామర్ బైక్స్‌ ధరలను భారీగా పెంచింది. కంపెనీ నిర్ణయంతో 125 సీసీ కమ్యూటర్ మోటార్‌సైకిల్ గ్లామర్ (Glamour) బైక్స్ ఎక్స్-షోరూమ్ ధరలు స్వల్పంగా పెరిగాయి. స్టాండర్డ్, ఎక్స్‌టెక్ (Xtec) అనే రెండు వేరియంట్‌ల గ్లామర్ బైక్స్ ధరలను పెంచుతూ భారతీయ కొనుగోలుదారులకు కంపెనీ షాక్ ఇచ్చింది. స్టాండర్డ్ వేరియంట్‌ ధర రూ.1,200, Xtec వేరియంట్ ధర రూ.1,300 మేర పెంచింది. దీనితో ఈ ఏడాదిలో గ్లామర్ బైక్ రేట్లు ఏప్రిల్, 2022 తరువాత మరోసారి పెంచినట్లు అయింది.

ఈ పెంపుతో గ్లామర్ స్టాండర్డ్ డ్రమ్ (Drum) వేరియంట్‌ ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు రూ.79,670కి చేరుకుంది. స్టాండర్డ్ డిస్క్ (Disk) వేరియంట్‌ ధర రూ.83,670కి ఎగబాకింది. ఎక్స్‌టెక్ డ్రమ్ (Drum) వేరియంట్ ఎక్స్-షోరూమ్ రేటు రూ.84,220కి, ఎక్స్‌టెక్ డిస్క్ (Disk) వేరియంట్ ధర రూ.88,820కి పెరిగాయి. ముడిసరుకు ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరగడంతో ధరలు పెంచాలని నిర్ణయించినట్లు హీరో కంపెనీ కొద్ది రోజుల క్రితం తెలిపింది. కస్టమర్లపై ఒకేసారి ధరల భారం మోపకుండా దశలవారీగా ఈ కంపెనీ వాహనాల ధరలు పెంచుతోంది.

 ఇదీ చదవండి: కన్నీళ్లు తెప్పించే వార్త.. వర్షంలో నట్టడివిలో నడుస్తూ.. కూతురి శవంతో నాలుగు కిలోమీటర్లు.. ఆ తండ్రి బాధ వర్ణణాతీతం


గ్లామర్ ఫీచర్లు
గ్లామర్ బైక్ హీరో 124.7 cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజన్‌తో 10.7 hp, 10.6 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఐడిల్ స్టార్ట్-స్టాప్ ఫంక్షన్, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్, ఆటో సెయిల్ టెక్ అనేవి గ్లామర్ బైక్‌ల్లో అందించిన కొన్ని స్టాండర్డ్ ఫీచర్లు. Xtec వేరియంట్ బ్లూటూత్ కనెక్టివిటీని.. టర్న్-బై-టర్న్ నావిగేషన్ సిస్టమ్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది. గ్లామర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్లు, వెనుక భాగంలో డ్యూయల్ స్ప్రింగ్‌లతో వస్తుంది.



ఈ బైక్స్ ధరల పెంచినా కూడా.. గ్లామర్ ఇప్పటికీ దానితో పోటీ పడుతున్న ఇతర కంపెనీల బైక్స్ కంటే తక్కువ ప్రారంభ ధరకే లభిస్తోంది. గ్లామర్ కి పోటీ ఇచ్చే టీవీఎస్ రైడర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.84,541... హోండా SP 125 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.80,455... బజాజ్ పల్సర్ 125 ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.81,389గా ఉంది. హీరో కంపెనీ మోటార్‌సైకిల్స్ ప్రతినెలా లక్షల్లో అమ్ముడుపోతున్నాయి. అందువల్ల ఈ ధరల పెంపు నేరుగా చాలా మంది కొనుగోలుదారులపై ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు. హీరో మోటోకార్ప్ పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులను భరించేందుకు కొద్దిరోజుల క్రితం భారత మార్కెట్లో Xtreme సిరీస్ బైక్స్‌తో పాటు చాలా స్కూటీల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇతర టూవీలర్ల కంపెనీలు కూడా రేట్లను పెంచేస్తున్నాయి.
Published by:Mahesh
First published:

Tags: Auto News, Bikes, Hero, New bikes

తదుపరి వార్తలు